గుంతకల్లు: రైల్వే కార్మికులకు తీపి కబురు అందింది. ఈ నెలలో దసరా, వచ్చే నెల దీపావళి పండుగలు జరగనున్న నేపథ్యంలో రైల్వేలో పనిచేసే కార్మికులకు 78 రోజుల వేతనం (వేజ్‌స్)ను బోనస్‌గా ఇవ్వాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. గుంతకల్లు రైల్వే డివిజన్ మొత్తం మీద దాదాపు 13500 మంది ౖపైగా రెల్వే కార్మికులు, ఉద్యోగులకు బోనస్ లభిస్తుందని తెలిసింది. ఒక్కో కార్మికుడికి నెలకు గరిష్టంగా రూ.8,975లు వేజేస్ లభిస్తే ఒక్క రోజుకు రూ.299.16లు వంతున లభిస్తుందని నిర్ధారించారు.
ఈ లెక్కన రైల్వే బోర్డు ఆదేశాల మేరకు 78 రోజుల వేతనం బోనస్‌గా ఇవ్వాలంటే ఒక్కో కార్మికుడికి రూ.17950లు వస్తుంది. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాలతో పాటు నెల్లూరు, మహబూబ్‌నగర్, రాయచూరు, బళ్లారి జిల్లాలలో పనిచేసే 13500 మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులకు రూ.24 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంటుందని ఒక రైల్వే అధికారి తెలిపారు.
రైల్వే కార్మికులకు 78 రోజుల వేతనం బోనస్
Published Wed, Sep 20 2017 10:56 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
Advertisement