2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి: భట్టి విక్రమార్క | Telangana Deputy CM Bhatti Vikramarka Key Comment Over Singareni | Sakshi
Sakshi News home page

2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి: భట్టి విక్రమార్క

Published Fri, Jun 21 2024 1:35 PM | Last Updated on Fri, Jun 21 2024 4:31 PM

Deputy CM Batti Vikramarka Key Comments Over Singareni

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సింగరేణి ప్రభుత్వ సంస్థ.. కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉంది అంటూ భట్టి కామెంట్స్‌ చేశారు.

కాగా, హైదరాబాద్‌లో శుక్రవారం పదో రౌండ్‌లో కోల్‌మైన్‌ యాక్షన్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క  పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి లేఖను అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి కాకుండా మొట్టమొదటిసారి కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రక్రియను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసు.

సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు, కొంగు బంగారం. సింగరేణి బొగ్గు వల్లే మన రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్స్ నడుస్తున్నాయి. 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్‌లు కేటాయించాల్సిన అవసరం ఉంది. త్రైపాక్షిక ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 1400 వందల మిలియన్ టన్నులు బొగ్గును తియ్యడానికి అవకాశం ఇంకా ఉంది.

2015లో కొత్త చట్టం వల్ల సింగరేణి తనకు ఉన్న అర్హతలను కోల్పోయింది. సత్తుపల్లి, కోయగూడ, మరో రెండు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కేంద్రం వద్ద ప్రతిపాదన ఉంది. సింగరేణి ప్రభుత్వ సంస్థ. కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కోల్ బ్లాక్స్‌ వెళ్లాయి. రిజర్వేషన్లు పక్కన పెట్టీ ప్రైవేటీకరణ దిశగా వేలం పాట నడవడం వల్ల సింగరేణికి నష్టం. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉంది.

రిజర్వేషన్ కోటాలో బొగ్గు బ్లాక్‌లు కేటాయించాలి. రిజర్వేషన్ల అంశంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలి. కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిలపక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తాం. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ బతకాలి అంటే కొత్త గనులు కేటాయించడం ఎంతో అవసరం. సత్తుపల్లి, కొయగూడ బ్లాక్‌ల పాత లీజు రద్దు చేసి వాటిని సింగరేణికి కేటాయించాలని కోరుతున్నాం. సింగరేణి భవిషత్ కోసం మరో 0.5 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సింగరేణి సంస్థను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

సింగరేణి పూర్వ వైభవం కోసం కిషన్ రెడ్డి గారు కృషి చేయాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement