‘సడలింపులు’పై హైకోర్టుకు వెళ్తాం: వైవీ సుబ్బారెడ్డి | Yv Subba Reddy Comments On Relaxation Of Gazetted Signature In Postal Ballot | Sakshi
Sakshi News home page

‘సడలింపులు’పై హైకోర్టుకు వెళ్తాం: వైవీ సుబ్బారెడ్డి

Published Wed, May 29 2024 5:43 PM | Last Updated on Wed, May 29 2024 6:08 PM

Yv Subba Reddy Comments On Relaxation Of Gazetted Signature In Postal Ballot

పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: పోస్టల్‌ బ్యాలెట్‌లో‌ గెజిటెడ్‌ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు. 

దేశం అంతటా ఒక రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్‌ చెబుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై గెజిటెడ్‌ సంతకం లేకుంటే దానిని తిరస్కరించడం నిబంధన. కానీ ఏపీలో మాత్రం గెజిటెడ్‌ సంతకం లేకపోయినా అనుమతించడంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వైవీ అన్నారు. సీఈసీ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

తప్పుడు పనుల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement