
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ దళిత నేతలు పాలాభిషేకం చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘చంద్రబాబు ఊరు చివర అంబేద్కర్ విగ్రహం పెడతానని మోసం చేశారు. సీఎం జగన్ నగర నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ మాట ఇచ్చారంటే అంబేద్కర్ విగ్రహం కట్టించి తీరుతారు. కోర్టుల్లో కేసులు వేయించి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును అడ్డుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారని’’ వైఎస్సార్‌సీపీ దళిత నేతలు కనకరావు మాదిగ, మధుసూదన్‌రావు, అమ్మాజీ, పద్మజ మండిపడ్డారు. (వైఎస్సార్‌కు ఘన నివాళి)
Comments
Please login to add a commentAdd a comment