
సాక్షి, చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ రైతులు 120 మంది సాగుచేసుకుంటున్న 223 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు అప్పగించాలని గురువారం మంత్రిమండలి నిర్ణయించింది.
దీంతో రైతులు ఎమ్మెల్యే విడదల రజనిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చిత్రపటానికి అభిషేకం చేశారు. ఒక్కో రైతుకు రూ.25 లక్షల వంతున మొత్తం రూ.30 కోట్లు పరిహారంగా అందుతుందని ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వం భూములను ఉచితంగా లాక్కోవాలని చూసిందని, ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని రైతులు పేర్కొన్నారు.