సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మత్స్యకారులు
మహారాణిపేట: మత్స్యకారులకు కష్టం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ఆదుకున్నారని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డెడ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ చెప్పారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జానకీరామ్ ఆధ్వర్యాన శనివారం విశాఖలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మత్స్యకారులు, బోటు యజమానులు క్షీరాభిషేకం చేశారు. జానకీరామ్ మాట్లాడుతూ మత్స్యకారులంటే సీఎం జగన్‌కు ఎనలేని అభిమానమని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అతి తక్కువ సమయంలోనే బాధిత మత్స్యకారులకు రూ.7.11 కోట్లు పరిహారం చెల్లించి సీఎం తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అసోసియేషన్ నాయకులు మైలపల్లి లక్ష్మణరావు, మైలపల్లి నరసింహులు, జి.దానయ్య, దూడ పోలయ్య, గనగళ్ల పోతయ్య, మున్నం బాలాజీ, యాగ శ్రీనివాసరావు, ఎస్.రాము, బోటు యాజమానులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చదవండి: పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం!
Comments
Please login to add a commentAdd a comment