సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
శామీర్‌పేట్: కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు మహారాష్ర్టతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందంతో పాటు జిల్లాల పునర్విభజనకు కృషి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం శామీర్‌పేట్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి శామీర్‌పేట్ సర్పంచి బత్తుల కిశోర్‌యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మహారాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చరిత్రలో ఓ మైలు రాయి అన్నారు. ప్రాజెక్టుల ఒప్పందం ద్వారా మల్లన్నసాగర్ ద్వారా మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేట్ పెద్ద చెరువుకు నీళ్లు వస్తాయన్నారు. దీంతో రైతుల పంట పొలాలకు నీరు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ ఉప సర్పంచ్ కంటం క్రిష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు డి.బి. వెంకటేశ్, ఆనంద్‌గౌడ్, నాయకులు విష్ణు, గన్నారెడ్డి, మైసయ్య, నారాయణ, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, వెంకటేశ్, రాములు, రమేశ్, అంజనేయులు సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.