మంత్రులతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాల వారీగా అభిప్రాయసేకరణను మంత్రులు పూర్తి చేశారు.
శాసనసభా సమావేశాల్లోపు నామినేటెడ్ పోస్తులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పోస్టులపై ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు.