కేసీఆర్ను కలసిన కార్పొరేషన్ల చైర్మన్లు | TRS leaders meet K. Chandrasekhar Rao chairman of corporations | Sakshi
Sakshi News home page

కేసీఆర్ను కలసిన కార్పొరేషన్ల చైర్మన్లు

Published Tue, Oct 11 2016 12:55 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

కేసీఆర్ను కలసిన కార్పొరేషన్ల చైర్మన్లు - Sakshi

కేసీఆర్ను కలసిన కార్పొరేషన్ల చైర్మన్లు

రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన తొమ్మిది మంది టీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఈమేరకు సీఎం అధికారిక నివాసంలో ఆయనను కలిశారు. ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడైన నల్లగొండ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తన భార్య, కూతురుతో కలసి వచ్చి సీఎంను కలిశారు.

జి.బాలమల్లు (టీఎస్‌ఐఐసీ) రాజయ్య యాదవ్ (షీప్, గోట్ డెవలప్‌మెంట్), లింగంపల్లి కిషన్‌రావు (టీఎస్ ఆగ్రోస్), పి.సుదర్శన్‌రెడ్డి (సివిల్ సప్లైస్), ఈద శంకర్‌రె డ్డి (ఇరిగేషన్ డెవలప్‌మెంట్), మందుల సామేలు (గిడ్డంగులు), ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి (స్పోర్ట్స్ అథారిటీ), మర్రి యాదవరెడ్డి (కుడా) తదితరులు సీఎంను కలసి కృతజ్ఞతలు చెప్పారు.   -సాక్షి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement