ఫలితాలు వెలువడే వరకు ఏమరుపాటు పనికిరాదు
అనుమానాలు నివృత్తి చేసుకోవాలి.. కౌంటింగ్ ఏజెంట్ల జాబితా 31లోగా అందివ్వాలి
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వరాదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, రీజనల్ కో–ఆర్డినేటర్లతో మంగళవారం ఆయన తాడేపల్లి నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఈసీ అనుసరిస్తున్న తీరు, అధికార యంత్రాంగంపై అనుమానాలున్న నేపథ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని చెప్పారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
⇒ ప్రజల ఆదరాభిమానాలతో వైఎస్సార్‌సీపీ తిరిగి విజయం సాధించబోతోంది. కాబట్టి మరింత జాగరూకత అవసరం. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలుంటే వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను 31వ తేదీలోగా ఇవ్వాలి. పారీ్టకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలి.
⇒ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని కుయుక్తులు పన్నుతున్నందున నియమ నిబంధనలు కచి్చతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఏజెంట్లదే. పోస్టల్ బ్యాలెట్, ఇతర అంశాలపై ఈసీ గైడ్‌లైన్స్‌కు భిన్నంగా ఆదేశాలు ఇవ్వమని కూడా ఈసీపై ఒత్తిడి చేస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతాలలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
⇒ కౌంటింగ్ ఏజెంట్ల నియామకం రెండు రోజుల్లో పూర్తి చేయాలి. కౌంటింగ్ ప్రారంభ సమయంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. ఫైనల్ గా డిక్లరేషన్ తీసుకునే వరకు అప్రమత్తంగా ఉండాలి.
⇒ సీఎం జగన్ తిరిగి విజయం సాధించాలని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో ఏజెంట్లు కూడా ప్రతి టేబుల్ దగ్గరా అంత పట్టుదలగా ఉండాలి. ఈ నెల 29వ తేదీనాటికి కౌంటింగ్ ఏజెంట్ల ఫార్మాట్‌లో పేర్లు, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందించాలి. మన ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలో ముందుగా తెలుసుకోవాలి.
⇒ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చాలా అప్రమత్తత అవసరం. వీటివల్లే గతంలో గుంటూరులో వేలాది ఓట్లు మనపార్టీ నష్టపోవాల్సి వచి్చన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment