
సాక్షి, విజయవాడ: కోర్టు సమీపంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మద్దెల పవన్, మద్దెల రాజేష్‌లపై దాడి చేసిన 9 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వారిలో మొత్తం 14 మందిని పోలీసులు గుర్తించారు. 9 మందిని అరెస్ట్ చేసిన సూర్యారావు పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మిగిలిన ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిందితులు కొర్ర సత్యనారాయణ, అరసంకల అశోక్, చింతజల్లు రమేష్ బాబు, బాలబొమ్మ అయ్యప్ప, రాచూరు వెంకటేశ్వర్లు, రెడ్డిపల్లి కిరణ్ కుమార్, రెడ్డిపల్లి సతీష్ కుమార్, గుత్తి సత్యనారాయణ, ఇమ్మిడి శివకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కర్రలు, బీరు బాటిళ్లతో నిందితులు విచక్షణ రహితంగా దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ పార్టీలో యాక్టివ్‌గా పని చేసినందుకే దాడి జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం బాధితులు మద్దెల పవన్, రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment