కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ
సాక్షి, కొలిమిగుండ్ల (నంద్యాల జిల్లా): కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ నెల 28న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో హెలిప్యాడ్‌ను కంపెనీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి నుంచి సీఎం నేరుగా ఫ్యాక్టరీలోకి చేరుకొని స్విచ్ ఆన్‌చేసి పరిశ్రమను ప్రారంభిస్తారు. సీఎం వైఎస్ జగన్ కొలిమిగుండ్ల మండలంలో తొలిసారిగా అడుగుపెట్టనుండడం గమనార్హం. పరిశ్రమ నుంచి ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
చదవండి: (ఆ విషయంపై కేటీఆర్, మహారాష్ట్ర సీఎం కేంద్రాన్ని ప్రశ్నించారు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment