
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పాతాళ గంగలో నీటి కుక్కలు(Otters) సందడి చేశాయి. ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టుపై విన్యాసాలు చేస్తూ యాత్రికులకు కనిపించాయి. అవి నీటి నుండి బయటకు వచ్చి పుణ్య స్థానాలు చేస్తున్న భక్తులను ఆకర్షింస్తున్నాయి. భక్తులు అలా వాటిని చూస్తుండిపోయేలా కట్టిపడేస్తున్నాయి.
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నీటి కుక్కలు పాతాళగంగ ఒడ్డుకొచ్చాయి. మెట్ల మార్గంలో నీటి కుక్కలు(Otters)కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు.
ఇది కూడా చదవండి: పోలవరంపై కేంద్రం పిటిషన్: ఏపీ హైకోర్టు నుంచి బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ
Comments
Please login to add a commentAdd a comment