waterdog
-
శ్రీశైలం పాతాళగంగలో నీటి కుక్కల సందడి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పాతాళ గంగలో నీటి కుక్కలు(Otters) సందడి చేశాయి. ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్టుపై విన్యాసాలు చేస్తూ యాత్రికులకు కనిపించాయి. అవి నీటి నుండి బయటకు వచ్చి పుణ్య స్థానాలు చేస్తున్న భక్తులను ఆకర్షింస్తున్నాయి. భక్తులు అలా వాటిని చూస్తుండిపోయేలా కట్టిపడేస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నీటి కుక్కలు పాతాళగంగ ఒడ్డుకొచ్చాయి. మెట్ల మార్గంలో నీటి కుక్కలు(Otters)కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు. ఇది కూడా చదవండి: పోలవరంపై కేంద్రం పిటిషన్: ఏపీ హైకోర్టు నుంచి బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ -
ఎటీకి ఎదురీది.. చేపలను వేటాడి
శ్రీశైలం జలాశయంలో నీటికుక్కలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కేవలం వరద సమయాల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. నీటికుక్కలు లేదా నీటిపిల్లులుగా పిలవబడే వీటి శాస్త్రీయనామం లుక్ట్రాగన్. దీనిమూతి ‘వి’ ఆకారంలో ఉండి తోక భాగం తెడ్డు ఆకారంలో ఉంటుంది. వరద ప్రవాహనికి ఎదురీతూ వెళ్లి చేపలను ఆహారంగా తింటుంటాయి. ఇవి శ్రీశైలం జలాశయంలో కనిపించడంతో వాటిని చూసిన పర్యాటకులు వాటి వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. – డి. హుసేన్, – ఫొటో గ్రాఫర్