ఎటీకి ఎదురీది.. చేపలను వేటాడి
శ్రీశైలం జలాశయంలో నీటికుక్కలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కేవలం వరద సమయాల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. నీటికుక్కలు లేదా నీటిపిల్లులుగా పిలవబడే వీటి శాస్త్రీయనామం లుక్ట్రాగన్. దీనిమూతి ‘వి’ ఆకారంలో ఉండి తోక భాగం తెడ్డు ఆకారంలో ఉంటుంది. వరద ప్రవాహనికి ఎదురీతూ వెళ్లి చేపలను ఆహారంగా తింటుంటాయి. ఇవి శ్రీశైలం జలాశయంలో కనిపించడంతో వాటిని చూసిన పర్యాటకులు వాటి వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
– డి. హుసేన్, – ఫొటో గ్రాఫర్