సాక్షి, నంద్యాల జిల్లా: అధికారం అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నంద్యాల మండలం బాబూజీ నగర్ గ్రామంలో దళిత కుటుంబంపై టీడీపీ నాయకులు దాడి చేశారు. వినాయక నిమజ్జన సమయంలో దళిత యువకుడు వరుణ్‌పై టీడీపీ నేతలు చెయ్యి చేసుకున్నారు. తమ కుమారుడిని ఎందుకు కొట్టారని అడిగేందుకు వెళ్లిన తల్లిదండ్రులను టీడీపీ నేతలు చితకబాదారు. పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, చింతలాయిపల్లెలో గురువారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. గ్రామానికి చెందిన వల్లెపు ప్రసాద్ కుటుంబీకులు వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారంతా టీడీపీలో కొనసాగుతుండగా ప్రసాద్ కుటుంబీకులు మాత్రం వైఎస్సార్‌సీపీ లో ఉంటున్నారు.
పని నిమిత్తం బయటకు వచ్చిన ప్రసాద్ బస్టాండ్ పరిసరాల్లో ఉండగా టీడీపీకి చెందిన పది మందికి పైగా అక్కడికి చేరుకొని అతనిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పెద్దిరాజు, ప్రకాష్, సావిత్రి సంఘటన స్థలానికి చేరుకోవడంతో వారిపై దాడికి దిగారు. ఈ ఘటన లో నలుగురు గాయపడ్డారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: జగన్ పిఠాపురం పర్యటనలో భద్రతా లోపం
Comments
Please login to add a commentAdd a comment