
నంద్యాల: నంద్యాల జిల్లాలోని మహానందిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. మంగళవారం మహానందిలోని ఈశ్వర్ నగర్ సమీపంలో ఓ యువకుడిపై చిరుత పులి దాడి చేసింది. దీంతో ఈశ్వర్ నగర్ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
గత నెల రోజుల నుండి మహానంది చుట్టే ఓ చిరుత సంచరిస్తోంది. ఇవాళ యువకుడిపై దాడి మహానందిలో కలకలం రేపుతోంది. ఇప్పటికైనా చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment