చిన్న పత్రికలకు అండగా నిలుస్తాం
ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పత్రికలకు అండగా నిలుస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు అల్లం నారాయణ హామీ ఇచ్చారు. శనివారం ప్రెస్ అకాడమీలో జరిగిన తెలంగాణ చిన్న, మధ్య తరహా దినపత్రికల సమస్యల చర్చా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 13న చిన్నపత్రికల సమస్యలపై సీఎంతో చర్చలు జరిపే అవకాశం ఉంద ని, ఈలోపు పత్రికాసంఘాలన్నీ ఒకేగొడుకు కిందికి రావాలని అల్లం సూచించారు.