ప్రమాదపు అంచున పనిచేసిన, ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధవార్తలను రిపోర్ట్ చేసిన సాహసికులైన ఎంతోమంది జర్నలిస్ట్‌ల గురించి తెలుసుకుందిపాలస్తీనా అమ్మాయి ప్లెస్తియ. వారి గురించి విన్నప్పుడల్లా....
‘ఎంత కష్టం. ఎంత సాహసం!’ అనుకునేది.ఆ కష్టం, సాహసం తన స్వీయానుభవంలోకి రావడానికి ఎంతోకాలం పట్టలేదు.జర్నలిజంలో పట్టా పుచ్చుకున్న తరువాత హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఆమెని ఆహ్వానించింది.హమాస్–ఇజ్రాయెల్ వార్‌ను రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్‌గా ప్రపంచానికి పరిచితం అయిన ప్లెస్తియ యుద్ధభూమిలో కత్తి అంచున నడక అంటే ఏమిటో తెలుసుకుంది. యుద్ధ బీభత్సాన్ని దగ్గరి నుంచి చూసింది. తాజాగా...‘అలాకాద్ అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ బీరుట్’లో మీడియా స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లెబనాన్‌కు వెళ్లింది. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ కాస్తా మళ్లీ విద్యార్థిగా మారింది.
‘యుద్ధకాలంలో భావోద్వేగాలకు అవకాశం లేదు. ఏడ్వడానికి కూడా టైమ్ దొరకనంతగా ఉరుకులు పరుగులు. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధం ఆగి΄ోతుందని మనసులో చిన్న ఆశ. అంతలోనే మరో పెద్ద విషాదాన్ని రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. పూర్తిగా నష్ట΄ోయాం. ఇంతకంటే ఎక్కువగా నష్ట΄ోయేది ఏమిటి అనిపించేది కొన్నిసార్లు’ గతాన్ని గుర్తు చేసుకుంది ప్లెస్తియ.
గాజాలో యుద్ధవార్తలు కవర్ చేస్తున్న రోజుల్లో ప్లెస్తియకు నిద్రపోవడానికి కూడా టైమ్ దొరికేది కాదు. తిండి సరిగా ఉండేది కాదు. పెట్రోల్ కొరత వల్ల మీడియా వాహనం ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు టీమ్‌తో సంబంధాలు తెగిపోయేవి. కరెంట్ కష్టాలు, ఫోన్ కష్టాలు సరే సరి.
‘ఈ రోజు సరే, రేపు బతికి ఉంటానా అని ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని’ అంటూ గత రోజులను గుర్తు చేసుకుంది ప్లెస్తియ. వార్తలను కవర్ చేసేందుకు మొదట్లో మెడలో ఐడీ ట్యాగ్ వేసుకునేది. ప్రెస్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించేది. అయితే వీటివల్లే ఎక్కువ ప్రమాదం ఉందని గ్రహించి వాటికి దూరంగా ఉంది.
‘ఈ రోజు ఏం కవర్ చేయాలి...అని ఎప్పుడూ ΄్లాన్ చేసుకోలేదు. కొన్నిసార్లు స్టోరీ కోసం వెదికేదాన్ని. మరికొన్ని సార్లు స్టోరీ నన్ను వెదుక్కుంటూ వచ్చేది’ అంటున్న ప్లెస్తియ రిపోర్టింగ్‌కు వెళుతున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చేవి. ఆ గండాల నుంచి అదృష్టశాత్తు బయటపడింది.
గాజాలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తనకు ప్రజల నుంచి రకరకాల స్పందనలు ఎదురయ్యేవి. కొందరు ఆ΄్యాయంగా పలకరించి బ్రెడ్, టీ ఇచ్చేవారు. ‘ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు వెరవకుండా మీ జర్నలిస్ట్‌లు పనిచేస్తున్నారు. మీ వల్లే మా బాధలు ప్రపంచానికి తెలుస్తున్నాయి’ అని ప్రశంసించేవాళ్లు.
కొందరు మాత్రం...‘నేను జర్నలిస్ట్’ అని పరిచయం చేసుకోగానే భయపడేవారు. ‘ఇప్పటికే ఎంతోమంది జర్నలిస్ట్‌లు చని΄ోయారు. మా గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి’ అనేవాళ్లు. ‘నిజానికి నేను వారి దగ్గరికి జర్నలిస్ట్‌గా కంటే సాటి మనిషిగా వెళ్లాను. వారి బాధలను పంచుకున్నాను. ధైర్యం చె΄్పాను’ అంటున్న ప్లెస్తియ ఆశావాది. యుద్ధం లేని రోజులు, గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్ర΄ోయే రోజులు వస్తాయని, మాయమైపోయిన నవ్వుల పువ్వులు మళ్లీ వికసిస్తాయని, ‘యుద్ధం గతం మాత్రమే. వర్తమానం కాదు’ అని బలంగా నమ్మే రోజులు వస్తాయనే ఆశిస్తోంది ప్లెస్తియ. ఇజ్రాయెల్ సైనిక దాడి గురించి రిపోర్టింగ్ చేస్తూ మరణించిన జర్నలిస్ట్ షిరీన్ అబూ స్మారక స్కాలర్‌షిప్ ΄÷ందిన ప్లెస్తియ లెబనాన్‌లో స్టూడెంట్‌గా మరో ప్రయాణం మొదలుపెట్టింది. ఈ యువ జర్నలిస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్‌ల ఫాలోవర్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment