సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విపత్తు వేళ ఔషధ తయారీ సంస్థ ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఔదార్యం చూపింది. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్యులు, నర్సులు, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది, జర్నలిస్టులకు ఉచితంగా ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లను అందించాలని కంపెనీ నిర్ణయించింది. 170కిపైగా నగరాలు, పట్టణాల్లోని కోవిడ్–19 పాజిటివ్ వచ్చిన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇంటికే ఉచితంగా ఈ ట్యాబ్లెట్లను హోం డెలివరీ చేస్తారు. ఇందుకోసం టెస్ట్ రిపోర్ట్, వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, గుర్తింపు కార్డు కాపీని కస్టమర్ కేర్ డెస్క్ 9100591030 నంబరుకు పంపాల్సి ఉంటుంది.
కోవిడ్–19 చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని ఫావిలో పేరుతో ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. విపత్తు సమయంలో ధైర్యంగా ముందుండి, ఆదర్శప్రాయంగా నిలిచిన వారికి సేవ చేయడం తాము బాధ్యతగా భావిస్తున్నట్టు ఎంఎస్‌ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్‌ఎన్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment