సాక్షి, అమరావతి/గుణదల(విజయవాడ తూర్పు): జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా ఇంజినీరింగ్ కాలే జీలో జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం సమాచార శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు.
మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ప్రధాన నగరాల్లో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలో కూడా నిర్వహిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలిచే విషయలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ శిబిరాల ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.10 వేల విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో హరీంధిరప్రసాద్, సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఈ ఉచిత హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడాదిలో ఎన్నిసార్లు ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తినా.. ప్రతిసారి రూ.2 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు వీలుగా అతి తక్కువ ప్రీమియంతో జర్నలిస్టు హెల్త్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందుకోసం జర్నలిస్టులు రూ.1,250 చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ.1,250 చెల్లిస్తోందని చెప్పారు.
అనూహ్య స్పందన..
జర్నలిస్టుల ఉచిత హెల్త్ క్యాంపునకు మొదటి రోజు అనూహ్య స్పందన లభించింది. ఆంధ్ర హాస్పిటల్, అమెరికన్ అంకాలజీ అండ్ ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఉషా కార్డియాక్ సెంటర్, క్యాపిటల్, కామినేని, సెంటినీ, పిన్నమనేని, హెచ్‌సీజీ క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్ అండ్ హార్ట్ కేర్ సెంటర్, సన్‌రైజ్, అను, స్వర ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వెయ్యి మందికి పైగా అక్రిడిటెడ్ జర్నలిస్టులు తమ కుటుంబ స భ్యులతో పాల్గొని వివిధ పరీక్షలు చేయించుకున్నా రు. ఈ క్యాంప్ ఆదివారం కూడా కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment