సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌పై కేసు | Case Against Akhilesh Yadav, Supporters For Assaulting Journalists | Sakshi
Sakshi News home page

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌పై కేసు

Published Sun, Mar 14 2021 1:41 AM | Last Updated on Sun, Mar 14 2021 3:46 AM

Case Against Akhilesh Yadav, Supporters For Assaulting Journalists - Sakshi

లక్నో: జర్నలిస్టులపై దాడి చేశారన్న ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొరాదాబాద్‌ జిల్లా పఖ్వారా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఓ విలేకరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 11వ తేదీన ఓ హోటల్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు పలు ప్రశ్నలు సంధిం చారు. దీనిపై అఖిలేశ్‌ అసహనం వ్యక్తం చేశారు. అఖిలేశ్‌ ఉసిగొల్పడంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అనుచరులు విలేకరులపై దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు విలేకరులు గాయపడ్డారని బాధితుడొకరు పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement