
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించారు. సచివాలయం నుంచి అసెంబ్లీలోకి రాకూడదంటూ శుక్రవారం నిషేదాజ్ఞాలు జారీ చేశారు. గేట్ నెంబర్ 2 నుంచి మాత్రమే రావాలని.. అదీ ఆధార్ కార్డుతో నమోదు చేసుకుంటేనే లోనికి అనుమతిస్తామని జర్నలిస్టులకు స్పష్టం చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే మీడియాపై ఆంక్షలు అమలు చేస్తున్నామని అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు వెల్లడించారు.