
ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విజిలెన్స్ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో ఉన్న వీడియో జర్నలిస్టులను అకారణంగా అసభ్య పదజాలంతో దూషించి దౌర్జన్యానికి పాల్పడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం అదనపు ఎస్పీ ఈశ్వరరావుని కలిసి వినతిపత్రం సమర్పించారు. రెండు రోజుల క్రితం అక్రమంగా ఇసుక తవ్వుతున్నారన్న కారణంగా చింతమనేని అనుచరుల వాహనాలను విజిలెన్స్ అధికారులు సంఘటనాస్థలంలోనే సీజ్ చేశారు. ఈ విషయం తెలిసి చింతమనేని, ఆయన అనుచరులు సుమారు 100 మంది సంఘటనాస్థలానికి చేరుకుని బలవంతంగా సీజ్ చేసిన వాహనాలను తీసుకుపోవడం, ఈ విషయమై విజిలెన్స్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.