సాక్షి, సిద్దిపేట: దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులకు మనం ఏం చేసినా తక్కువేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వారి త్యాగాలు ప్రతీ భారతీయుడు గుర్తించాలని పేర్కొన్నారు. శత్రుదేశంలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన భారత పైలెట్ల స్ఫూర్తి చాలా గొప్పదని హరీష్ కొనియాడారు. వారి త్యాగం వెలకట్టలేనిదనీ, ప్రాణాలు పొతున్నా దేశం కోసం పోరాడుతున్నారని గుర్తుచేశారు. బుధవారం సిద్దిపేటలోని ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్ట్‌ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి ప్రస్తావించారు. భారత వైమానికి దళం పోరాటపటిమను ప్రసంశించారు. తెలంగాణలోని జర్నలిస్ట్ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారనీ, దానికి తనవంతు పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. జర్నలిజం అంటే సామాజిక గౌరవం అని హరీష్ వర్ణించారు. జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం రూ. 35 కోట్లు కేటాయించినట్లు హరీష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment