
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జర్నలిస్టుల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. వారి సంక్షేమానికి ఏం చేయాలనేదానిపై సీఎంకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్‌రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. శ్రీనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విలేకరుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా అకాడమీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో సమగ్రంగా సమాచారాన్ని తెలుసుకోకుండానే వార్తలొస్తున్నాయని, అది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వాస్తవ సమాచారాన్ని తెలుసుకున్నాకే విలేకరులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్, జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment