సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై సమాజం చేస్తున్న యుద్ధంలో ముందు వరుసలో ఉన్న జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. జర్నలిస్టులు కరోనా వైరస్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని, ఇలాంటి వారియర్స్ సైతం కరోనా బారిన పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులకు క రోనా పరీక్షలు చేశామని, అవసరమైన ప్రతి జర్నలిస్టుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సోమవారం సచివాలయంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రతినిధులు ఈటలను కలిశారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. కాగా, పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఈటల హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment