![Premavati Expressing Anger at TDP Leaders - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/2/tdp.jpg.webp?itok=raqkwA8n)
టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రేమావతి
సాక్షి, తిరుపతి మంగళం: ఏం తల్లీ.. జగన్ ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలకు అన్యాయం చేస్తోంది కదా..? అని టీడీపీ నేత పులివర్తి నాని స్థానిక తిరుమలనగర్‌లో మహిళలను ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే మాకు అన్యాయం జరిగిందంటూ స్థానికురాలు ప్రేమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పట్లో చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా తిరుమల నుంచి కిందకు దింపేసి బతుకు లేకుండా చేశాడని, ఏళ్ల తరబడి తిరుమలలో ఉద్యోగం చేస్తున్న తన భర్త ఉద్యోగం కూడా తీసేశాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెంచారు.. గ్యాస్ ధర పెంచారు కదా తల్లీ.. అని కస్తూరమ్మను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అవును సార్.. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వం కదా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ ఆమె ఎదురు ప్రశ్న వేయడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు.
మంగళంలోని తిరుమలనగర్ పంచాయతీలో గురువారం టీడీపీ నాయకులు నిర్వహించిన ఇదేమి ఖర్మ.. కార్యక్రమంలో స్థానికులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. వారి సమాధానాలకు విస్తుబోయారు. చంద్రబాబు పాలనలోనే తమ పరిస్థితి ఇదేమి ఖర్మ.. అన్నట్టుగా ఉందన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: (చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ షాకింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment