వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీద టీడీపీ నేతలు రెక్కీ నిర్వహించిన విషయం బట్టబయలయింది. ఎమ్మెల్యేపై దాడి చేయాలని స్థానిక టీడీపీ ఇంచార్జ్ నేత పులివర్తి నాని గత కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చెవిరెడ్డికి సంబంధించిన ప్రతి కదలికను తెలిపిలా అయన దగ్గర ఇద్దరు డ్రైవర్లను నియమించారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో అదును చూసుకొని దాడి చేయాలని భావించారు. అయితే స్థానిక మహిళలు, అభిమానులే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేకు భద్రతగా నిలవడంతో నాని వ్యూహం రివర్సయింది.