May 22nd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Assembly Elections 2024: Political News Updates In Telugu On May 22nd, 2024 | Sakshi
Sakshi News home page

May 22nd AP Election News Updates: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Wed, May 22 2024 6:55 AM | Last Updated on Wed, May 22 2024 7:24 PM

Ap Elections 2024 May 22nd Political Updates Telugu

May 22nd AP Elections 2024 News Political Updates..

7:23 PM, May 22nd, 2024
టీడీపీ రిగ్గింగ్‌.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డి

  • మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు
  • పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాం
  • పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది
  • మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.
  • ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు?
  • రిగ్గింగ్‌ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?
  • మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి
  • మాచర్లలో  అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?
  • బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు
  • అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం
  • రిగ్గింగ్‌ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?
  • ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి
  • ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి
  • మమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు
  • దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి
  • ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది
  • మాచర్ల  వీడియోను మాత్రమే బయటపెట్టారు
  • మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు
  • ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం
     

5:08 PM, May 22nd, 2024
మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలే

  • మాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌
  • ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలు
  • వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలు
  • రెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్‌ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌
  • టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు
  • ఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలు
  • ఓటర్లు బూత్‌ లోపలికి వెళ్లేందుకు  ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలు
  • టీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులు
  • ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

4:56 PM, May 22nd, 2024
ఓటర్లకు టీడీపీ డబ్బులు పంపిణీపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

  • డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచారు
  • ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి విరుద్ధం
  • ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

2:00 PM, May 22nd, 2024
ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్‌

  • ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్‌ విధించింది. 
  • నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశం.
  • ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. 
  • తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. 
  • టీడీపీ నేతలు వెంకట సతీష్‌, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
  • అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్‌ భయంతో పరారయ్యారు. 
     

1:30 PM, May 22nd, 2024
సిట్ ప్రాధమిక నివేదికపై ఈసీ తదుపరి చర్యలేంటి?

  • తప్పుచేసిన పోలీసులపై కేసులు నమోదవుతాయా
  • ఇప్పటికే ఇద్దరు ఎస్పీలు...12 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్
  • శాఖాపరమైన విచారణకు ఆదేశం
  • సిట్ నివేదికలో బట్టబయలైన పోలీసుల వైఫల్యం
  • కొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ నివేదిక
  • నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కేసుల నమోదుకు ఈసి ఆదేశించే అవకాశం
  • సిట్ పూర్తిస్ధాయి నివేదిక వరకు ఈసి వేచిచూస్తుందా
     

1:00 PM, May 22nd, 2024
ఈసీ ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం: ముఖేష్ కుమార్ మీనా

  • విజయవాడ
  • సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్‌
  • ఈవీఎం ధ్వంసం కేసులో కోర్టులో మెమో దాఖలు చేశాం
  • వీడియో బయటకు రాక ముందే కేసు విచారణ సాగుతుంది
  • ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి ఈరోజు సాయంత్రంలోగా  నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది
  • 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం
  • ఈవీఎంలో డేటా భద్రంగానే ఉంది
  • ఓటు వేసిన వారి డేటా కంట్రోల్ యూనిట్‌లో భద్రంగానే ఉన్నాయి
  • సిట్ నివేదిక ను ఎన్నికల కమిషన్ కి పంపాము
  • ఈసీ ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం

 

 

12:00 PM, May 22nd, 2024
ఓటమి దిశగా పవన్‌..!

  • జడ్పీ చైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్యేగా కాకినాడ జిల్లాను అభివృద్ధి చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత.
  • ఎప్పుడూ ప్రజల మధ్యే వంగా గీత. అందుబాటులో ఉండని పవన్‌. 
  • రాజకీయాల్లో, ప్రజాదరణలో వంగా గీతకు ఏమాత్రం సరితూగని పవన్‌. 
  • వంగా గీతకే పట్టం కట్టిన పిఠాపురం ప్రజలు.

 

11:30 AM, May 22nd, 2024
ఓటమి అంచున్న పురంధేశ్వరి!
 

  • ఎన్నికల్లో ఓటమి అంచున నిలుచున్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. 
  • రాజమండ్రి గురించి ఏ మాత్రం తెలియకుండానే అక్కడి నుంచి పోటీ. 
  • ఇక, సీటు ఆశించి భంగపడిన సోము వీర్రాజుతో పురంధేశ్వరికి కుదరని సయోధ్య. 

 

11:00 AM, May 22nd, 2024
బాబు, పవన్‌ హైదరాబాద్‌కే పరిమితం..

  • పవన్‌ కేవలం సినిమాలకే పరిమితమంటున్న సామాన్యులు. 
  • చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితమంటున్న సామాన్య ప్రజలు.

 

 

 

10:30 AM, May 22nd, 2024
గన్నవరంలో పచ్చ బ్యాచ్‌ హల్‌చల్‌

  • కృష్ణా జిల్లా..
  • గన్నవరంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌
  • ఇద్దరు యువకులపై దాడి చేసిన టీడీపీ సానుభూతిపరులు
  • ఐదుగురు టీడీపీ వ్యక్తులున్నట్టు సమాచారం
  • పచ్చ బ్యాచ్‌ దాడిలో యువకులకు తీవ్రగాయాలు 
  • బాధితుల ఫిర్యాదు విచారణ చేపట్టిన పోలీసులు. 

 

8:30 AM, May 22nd, 2024
ఎన్నికల కౌంటింగ్‌పై పోలీసుల ఫోకస్‌.. 

  • విజయవాడ
  • సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై పోలీసులు ప్రత్యేక దృష్టి
  • పోలింగ్ అనంతరం జరిగిన పరిమాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్న పోలీసులు
  • కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులు, మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, నోడల్‌ అధికారులు, ఎన్‌ఐసీ, ఎన్‌కోర్‌ టీమ్‌ అధికారులతో సమావేశాలు
  • కౌంటింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు, కౌన్సెలింగ్
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పగడ్బందీగా బారికేడింగ్‌ పనులు
  • కౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
  • ఏపీ పోలీసులతో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సిఆర్పిఎఫ్, పారా మిలటరీ బలగాలు

 

7:20 AM, May 22nd, 2024
గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం: ఎమ్మెల్యే పిన్నెల్లి

  • పల్నాడులో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. 
  • అందుకే అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ నేతలు గొడవలు చేశారు. 
  • పోలింగ్‌ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధం
  • అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. 

 

 

 

7:00 AM, May 22nd, 2024
ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్‌

  • పోలింగ్‌ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగం
  • కుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘావర్గాలు
  • రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు
  • ఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్ను
  • గూండాలను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు.. అంతా టీడీపీ మూకలే
  • స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
  • రెడ్‌జోన్ల ఏర్పాటు.. నిషేధాజ్ఞలు విధింపు.. డ్రోన్‌ కెమెరాల వినియోగం నిషిద్ధం

 

6:55 AM, May 22nd, 2024
సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం

  • జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి
  • టీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడి
  • ఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారు
  • పారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డి
  • నేను ఎక్కడికి పారిపోలేదు... 
  • ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్‌ వచ్చా 
  • ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

 

6:45 AM, May 22nd, 2024
పవన్‌ ఎక్కడ?

  • పవన్‌ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో చర్చ
  • 14న ప్రధాని మోదీ నామినేషన్‌కు పవన్‌ హాజరు
  • అక్కడి నుంచి హైదరాబాద్‌ రాక
  • ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేని పవన్‌
  • రష్యా లేదా దుబాయ్‌ వెళ్లి ఉంటారంటున్న పార్టీ వర్గాలు

 

6:40 AM, May 22nd, 2024
సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్‌ చేస్తున్నా: మంత్రి కాకాణి

  • బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?
  • నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తా
  • ఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది
  • ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి
  • బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా
  • బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?
  • రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..
  • బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు
  • రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు
  • పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది
  • కుట్ర కోణం పై విచారణ చేయాలని  పోలీసులను కోరాను
  • రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు
  • సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  లోఫర్
  • బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • నాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలి
  • ఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారు
  • రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది
  • సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి
  • నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు
  • యూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది
  • నా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉంది
  • కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి..  కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 

 

6:30 AM, May 22nd, 2024
ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌

  • దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?
  • చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతు
  • టీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.
  • కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారు
  • ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయి
  • చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం
  • చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలి
  • పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement