May 23rd AP Elections 2024 News Political Updates..
7:30 PM, May 23rd, 2024
పల్నాడు జిల్లాలో భారీగా అరెస్ట్‌లు
- పోలింగ్ రోజు, తర్వాత జరిగిన విధ్వంసం.. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్
- పిడుగురాళ్లకు చెందిన 47 మంది టీడీపీ నేతల అరెస్ట్
- తంగెడకు చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్
- వీరితో పాటు మరో 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
5:56 PM, May 23rd, 2024
రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు: ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
- సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై టీడీపీ దాడులు చేసింది
- పోలింగ్ రోజు నుంచి టీడీపీ అరాచకాలపై మేము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం
- మేము 60కి పైగా పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని కోరాం
- వెబ్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని కోరాం
- ఈసీ స్పందించకపోతే రిగ్గింగ్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తాం
- ఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చుస్తే పోలీసులు స్పందించలేదు
- ఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారు
- దాని వల్లనే హింస చెలరేగింది
- ఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?
- ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్‌ని గెలిపించాలని నిర్ణయించారు
- మాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసింది
- టీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు
- అయినా భద్రత చర్యలు తీసుకోలేదు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లాం
- ముందస్తు భద్రత కల్పించమని అడిగాం
- అయినా భద్రత చర్యలు తీసుకోలేదు
- పురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారు
- ఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది
4:54 PM, May 23rd, 2024
పల్నాడులో హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ
- రెంటచింతల పీఎస్‌లో కొనసాగుతున్న సిట్ విచారణ
- బెట్టిపాలెం, తమృకోట గ్రామస్తులను విచారిస్తున్న సిట్
- హింసకు పాల్పడిన కొంతమందిని గుర్తించిన సిట్
4:19 PM, May 23rd, 2024
ఈసీలో ఇంటిదొంగలెవరు?
- లోకేష్‌కు చేర్చింది ఈసీలోని ఇంటి దొంగలేనా?
- ఏపీ ఎలక్షన్ కమిషన్ తీరుపై అనుమానాలు
- ఈసీ అనుమతి లేకుండా బయటకు వెళ్లిన వీడియో ఫుటేజ్
- రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారా?
- నారా, దగ్గుబాటి కుటుంబాలకు ఈసీ దాసోహమైందా?
- పచ్చ బ్యాచ్ కంప్లయింట్ చేయడంతో బయటకొచ్చి ప్రెస్‌మీట్ పెట్టిన ఎంకే మీనా
- లోకేష్ ట్విట్టర్‌కు వీడియో ఎలా చేరిందన్న దానిపై ఎంకే మీనా మౌనం
- తాజాగా వీడియో తాము విడుదల చేయలేదంటూ కూల్‌గా చెప్పిన సీఈవో మీనా
- వీడియో ఎవరు రిలీజ్ చేశారో మాత్రం చెప్పని సీఈవో
4:05 PM, May 23rd, 2024
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి
- హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
- కాసేపట్లో విచారణ జరపనున్న హైకోర్టు
3:48 PM, May 23rd, 2024
అంబటి రాంబాబు ట్వీట్
- వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదని ప్రకటించింది
- అంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోంది
పిన్నెల్లిపై ఫేక్ వీడియోను ఎక్స్‌లో రిలీజ్ చేసిన నారా లోకేష్‌పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి
వైరల్ అవుతున్న మాచర్ల MLA Video ఎన్నికల కమిషన్ కు
సంబంధం లేదని ప్రకటించిందంటే
పోలీసులు, అధికారులు తెలుగు దేశంతో
ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తుంది!— Ambati Rambabu (@AmbatiRambabu) May 23, 2024
2:15 PM, May 23rd, 2024
పిన్నెల్లి వీడియో మేము విడుదల చేయలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా
- పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
- ఆ వీడియోను మేము విడుదల చేయలేదు
- ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు
- అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాం.
- దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది
- పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశాం
- మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు
- ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది
- టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం
- వాళ్లు వెళితే వైఎస్సార్‌సీపీ నేతలు కూడా వెళతామంటారు
- మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశముంది.
- బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు
- ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను.
2:00 PM, May 23rd, 2024
అంబటి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
- ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- సత్తెనపల్లిలో రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ జరపాలని పిటిషన్
- ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన అంబటి
- ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి
1:40 PM, May 23rd, 2024
టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్
- ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది
- 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది
- ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు
- ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
- ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు
- పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు
- తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు
- చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు
- పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు
- టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు?
- ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా?
- టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి
- ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం
1:15 PM, May 23rd, 2024
లోకేష్, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు: కోరముట్ల శ్రీనివాసులు
- రైల్వేకోడూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు కామెంట్స్..
- ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక ప్రజానాయకుడు
- అలాంటి నాయకుడిపై లుకౌట్ నోటీస్ జారీచేయడం దారుణం
- ఒకరేమో జీవితఖైదు అని, ఇంకోరేమో కనీసం 10 ఏళ్లు శిక్ష పడుతుంది అంటూ పరిధులు దాటి మాట్లాడుతున్నారు..
- ఏ శిక్ష వేయాలో ఈనాడు, అంధ్రజ్యోతి నిర్ణయిస్తాయా?
- కూటమి అభ్యర్థి గుప్త గుంతకల్‌లో ఈవీఎంను పగలకొడితే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
- పిన్నెల్లిపై లుకౌట్ నోటీస్ జారీ చెయ్యడం కరెక్టా?
- వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ప్రజానాయకుడు పిన్నెలి
- మాచర్ల రెంటచింతలలో జరిగిన సంఘటనపై నివేదిక తెప్పించుకోకుండానే లోకేష్, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు.
- ఆ పోలింగ్ స్టేషన్ లో కూటమి రిగ్గింగ్ చేసింది.
- పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి క్షణికావేశంలో ఈవీఎం పగలకొట్టి ఉండవచ్చు
- దానిపై పోలీసులు స్పందించే తీరు సరికాదు
- మొదటి నుండి కూటమి సభ్యులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నా ఒక్కరిపై కూడా ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు
- ఈసీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది.
12:45 PM, May 23rd, 2024
ఈసీకి సూటిగా ప్రశ్నలు సంధించిన సజ్జల
- మాచర్ల ఘటనపై స్పందించిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
- ఎన్నికల సంఘానికి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్నలు
- పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?
- వీడియో సరైందేనా కాదా అన్నది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?
- ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?
- మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.!
- అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?
- ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?
- అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది
- అంతే కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?
- తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?
- సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే..
- అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
- వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు?
- దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు?.
3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024
12:10 PM, May 23rd, 2024
మచిలీపట్నంలో మాక్ డ్రిల్..
- కృష్ణాజిల్లా..
- మచిలీపట్నం కోనేరు సెంటర్ జిల్లా ఎస్పీ అద్నాన నయీం అస్మి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
- కౌంటింగ్ ప్రక్రియలో అల్లర్లకు పాల్పడితే జరిగే పరిణామాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు చూపించిన పోలీస్ సిబ్బంది.
- ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కామెంట్స్..
- ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించారు
- కౌంటింగ్‌లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం
- కౌంటింగ్ సమయంలో డీజేలకు, టపాసులకు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవు
- అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు
10:22 AM, May 23rd, 2024
సిట్ దర్యాప్తు.. కంటిన్యూ
- ఏపీలో కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ముమ్మరంగా తనిఖీలు
- పోలింగ్ టైంలో, తర్వాత అల్లర్లలో పాల్గొనవారిపై నిఘా
- రాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
- ఏపీలో ఘర్షణలపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
- తిరుపతి, తాడిపత్రి, పల్నాడులో సిట్ మకాం
- జిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న సిట్ బృందాలు
- అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లే యోచన
9:17 AM, May 23rd, 2024
తిరుపతి చంద్రగిరిలో పోలీసుల అలర్ట్
- నారావారిపల్లి,శేషాపురంలో పోలీసుల పికెటింగ్
- చంద్రగిరిలో 144తో పాటు సెక్షన్ 30 అమలు
- సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతు
- సభలు, సమావేశాలు, ఊరేగింపులను నో పర్మిషన్
- పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు
8:10 AM, May 23rd, 2024
పల్నాడులో మరో టెన్షన్
- నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపు
- టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు మాచర్ల యాత్ర చేపట్టిన పచ్చ బ్యాచ్
- మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు.
7:45 AM, May 23rd, 2024
నేడు అంబటి పిటిషన్ విచారణ
- ఏపీ హైకోర్టులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై నేడు విచారణ
- సత్తెనపల్లిలో రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ జరపాలని అంబటి డిమాండ్
- ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన అంబటి
- ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి
7:20 AM, May 23rd, 2024
‘గేటు’లో గూండాగిరి..
- ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది బూత్‌ల నుంచి ఈడ్చివేత
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్ బూత్‌లలో దౌర్జన్యం
పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి
రిగ్గింగ్‌ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు
వెబ్ కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల
ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం
అవసరమైన మేరకు ఎడిటింగ్..
వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల
భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు
రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం
7:00 AM, May 23rd, 2024
ఓటమి బాటలో బాబు
- కుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలు
- ఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే
- రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు
- దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబు
- స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం
- 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం
- వైఎస్సార్‌సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది
- మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ
- ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు
- కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు
- ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు
6:50 AM, May 23rd, 2024
కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం
- ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండ
- వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర
- పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజున అల్లర్లు
- పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్ చేసిన టీడీపీ రౌడీలు
- వెబ్ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు
- టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
- పోలింగ్ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్ గ్యాంగ్ యాగీ
6:40 AM, May 23rd, 2024
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డి
- మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు
- పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాం
- పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది
- మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.
- ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు?
- రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?
- మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి
- మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?
- బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు
- అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం
- రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?
- ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి
- ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి
- మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు
- దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి
- ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది
- మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు
- మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు
- ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం
6:30 AM, May 23rd, 2024
మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలే
- మాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్
- ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలు
- వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలు
- రెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్
- టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు
- ఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలు
- ఓటర్లు బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలు
- టీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులు
- ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment