ఏపీ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్‌సీపీ సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. ప్రతిపక్షాలు, పచ్చ బ్యాచ్ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్ ప్రకటన చేశారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్ క్యాంపైనయిర్స్ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేనని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు.
అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే భారీగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడం కూడా ఇందుకు ఒక ఉదాహారణ. ఇక, 2019లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్ ఇప్పటి వరకు చేసిన ఏ ప్రకటన అయినా ఆచితూచి మాత్రమే చేశారు.
పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన సీఎం జగన్.. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. సీఎం జగన్ సంచలన ప్రకటనతో కూటమి నేతలు డీలా పడినట్టు తెలుస్తోంది.
అయితే, ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే వ్యక్తి. ఆయన ఏ పని చేసినా పూర్తి పారదర్శకంగా ఉంటారు. వేర్వేరు సమీకరణాలు అన్నీ పరిశీలించి ముందడుగు వేస్తారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పు సమయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రతిపక్షాలు, సీఎం జగన్ అంటే గిట్టని వారు ఎన్ని కామెంట్స్ చేసినా ఆయన అవేవీ పట్టించుకోకుండా ముందుకుసాగారు. ఎంతో దమ్ము, ధైర్యంతో అభ్యర్థులను మార్చారు. ఒక నాయకుడిగా తన నాయకత్వం మీద, పార్టీ మీద, పాలన మీద ఉన్న నమ్మకాన్ని ఈ ప్రకటన సంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక, ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఫస్ట్ రియాక్షన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్ ఫైట్, ఎవరికి ఎడ్జ్ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్ చేసిన ప్రకటన పట్ల షాక్ తిన్నాయి. ఒక నాయకుడు.. ఎంతో నమ్మకంగా చేసిన ఒక ధృడమైన ప్రకటన.. వైనాట్ 175 నినాదాన్ని చర్చనీయాంశం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment