
సాక్షి, తాడేపల్లి: టీడీపీ హింసాత్మక చర్యలను వైఎస్సార్‌సీపీ బయటపెట్టింది. పోలింగ్ మరుసటి రోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసం సృష్టించింది. కారంపూడిలో టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. టీడీపీ విధ్వంసానికి ముందే పోలీసులు వెళ్లిపోయారు. ఇదంతా టీడీపీ, పోలీసు అధికారుల కుట్రేనని అంటోన్న వైఎస్సార్‌సీపీ.. సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టింది.


కారంపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లు, షాపుల ధ్వంసమే లక్ష్యంగా టీడీపీ మూకలు రెచ్చిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర పన్నిందని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. ఏదో కేసులో ఎమ్మెల్యే అరెస్టుకు పల్నాడు పోలీసులు ఉత్సాహం చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment