
విశాఖపట్నం : జూన్ 4వ తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గం,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన సిబ్బంది నియామకం,రౌండ్లు వివరాలు,టేబుల్స్ ఏర్పాటు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున రిటర్నింగ్ అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.ఈటీíపీఎస్ ఓట్లు(సర్వీసెస్) ఓట్లు లెక్కింపు మొదలవుతుంది.ఆ తర్వాత ఉద్యోగులు వేసిన ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ఈవీఎంలను లెక్కింపు మొదలు పెడతారు. జిల్లాలో నాలుగు వేల మంది వరకు పోస్టల్ బ్యాలెట్ ఉండగా, శుక్రవారం నాటికి 891 కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. మొత్తం పోస్టల్ బ్యాలెట్స్,ఉద్యోగుల ఓట్లు లెక్కింపును మూడు రౌండ్లులో పూర్తి చేయవలసి ఉంది.
పశ్చమదే తొలి ఫలితం
మొదటి ఫలితం విశాఖ పశ్చమ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. పోలైన ఓట్లు ఆధారంగా 16 రౌండ్లు విభజించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దక్షిణం 17 రౌండ్లకు విభజించారు. ఆ ఫలితం కూడా 3.30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా భీమిలి ఫలితం వెలువడనుంది. ఇక్కడ 26 రౌండ్లు వచ్చాయి. దీని వల్ల రాత్రి 7.30 గంటలకు ఫలితం వస్తుందని అంచనా వేశారు.