
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో సోమవారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఇది జీరి్ణంచుకోలేని టీడీపీ నాయకులు పలుచోట్ల ఏదో కారణం చూపుతూ ఘర్షణలకు దిగారు. రాళ్లతో దాడులు చేస్తూ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. కొన్ని చోట్ల ఏజెంట్లను బయటికి తరిమే యత్నంలో వారిపైనా దాడులు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పలు చోట్ల తీవ్రంగా గాపడ్డారు. ఓటు వేయాలని వచ్చిన ఓ మహిళ చేయి విరిగింది. ఎలాగైనా గెలవాలంటూ.. టీడీపీ తీవ్ర స్థాయిలో కవి్వంపు చర్యలు దిగింది.
బద్వేలు అర్బన్ : వైఎస్సార్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకేశంపల్లెలో టీడీపీ నాయకులు హల్‌చల్ చేశారు. ఏజెంట్లను బయటికి పంపే యత్నంలో.. వారిపై దాడికి తెగబడ్డారు. మండలంలోని చిన్నకేశంపల్లె గ్రామంలోని 179వ బూత్‌లో పోలింగ్ జరిగింది. ఉదయం వైఎస్సార్‌సీపీ, బీజేపీ, ఇతర పారీ్టల తరఫున 8 మంది ఏజెంట్లు పాల్గొన్నారు. బూత్‌లో మొత్తం 947 ఓట్లు ఉండగా సాయంత్రం 5 గంటలకు 747 పోలయ్యాయి. సాయంత్రం బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఏజెంట్లు వచ్చి మిగతా పారీ్టల ఏజెంట్లు బయటకు వెళ్లాలంటూ హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ, జనసహాయకశక్తి పార్టీల ఏజెంట్లు రవీంద్ర, మల్లికార్జునరెడ్డి ఎందుకు వెళ్లాలంటూ అడ్డు చెప్పారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. అనంతరం తెలుగుదేశంపార్టీ నాయకులు రితీ‹Ùరెడ్డి ఓటు వేసేందుకు తన అనుచరులతో బూత్ వద్దకు రాగా, ఘర్షణ విషయాన్ని ఆయనకు టీడీపీ నాయకులు తచెప్పారు. కోపోద్రిక్తుడైన రితీష్ ఏజెంట్ మల్లికార్జునరెడ్డిని పరుషపదజాలంతో దూషిస్తూ ఊరు విడిపిస్తా అంటూ హెచ్చరించారు. అంతటితో ఊరుకోక ‘కొట్టండిరా అంటూ అరవడంతో ఆయన అనుచరులు మల్లికార్జునరెడ్డిని బయటకు లాగి విచక్షణారహితంగా దాడి చేశారు.
అక్కడి పోలీసులు ఆపాలని యత్నించినా బెదరకుండా దాడికి దిగారు. ఈ ఘటనలో మల్లికార్జునరెడ్డి చొక్కా చినిగిపోవడంతో గాయాలయ్యాయి. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ మాత్రం బెదరకుండా దాడికి యతి్నంచారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏజెంట్ రవీంద్రపై కూడా దాడి చేసేందుకు యతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ చేరుకుని టీడీపీ నాయకులను గ్రామం నుండి పంపించి వేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధ బాధితుడితో కలిసి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఏజెంట్లపై దాడులకు దిగారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి రామసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment