
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది.
పల్నాడు
- మాచర్లలో ఘర్షణలను ప్రేరేపించింది టీడీపీనే: మల్లాది విష్ణు
- పోలీస్ అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు
- కుప్పం, మాచర్ల, తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు
- వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసి తిరిగి మాపైనే ఫిర్యాదులు
పల్నాడు
- మాచర్లలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి కుమారుడిపై టీడీపీ నేతల దాడి
- పాల్వాయి గేట్‌లో టీడీపీ నేతలు ఓటర్లను అడ్డుకున్నారు
- విషయం తెలిసి పాల్వాయి గేట్ వద్దకు వెళ్లాం: గౌతంరెడ్డి
- పిన్నెల్లిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు
- అడ్డుకున్న మాపై విచక్షణారహితంగా దాడి చేశారు
- టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి సోదరుడు మాపై దాడి చేశారు
- దాడి జరిగినా కారంపూడి సీఐ స్పందించలేదు
కృష్ణా:
- పోరంకిలో టీడీపీ గూండాల దాడి
- దొంగ ఓట్లు వేయడాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- ప్రశ్నించిన జోగి రమేష్ అనుచరుడిపై కర్రలతో దాడి
- ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌పై టీడీపీ నేత దాడి
- ఎమ్మెల్యేగా మాల, మాదిగ వర్గాలకు కొమ్ము కాస్తున్నారంటూ గొట్టి ముక్కల సుధాకర్ దూషించాడు: అన్నా బత్తుని శివకుమార్
- నా భార్య ఎదుటే అసభ్యంగా దూషించాడు
- బూత్‌లోకి వెళ్తుండగా తిడుతూనే ఉన్నాడు
- నువ్వు అసలు కమ్మవాడివేనా అంటూ అసభ్యంగా మాట్లాడాడు
- పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడు
- పోలింగ్ బూత్ వద్ద దౌర్జన్యం చేస్తున్నట్లు ఓటర్లే చెప్పారు
- టీడీపీ, జనసేన నేతలు వేరే ప్రాంతాల నుంచి వాళ్ల మనుషులను దింపారు
- వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు
అనంతపురం
- తాడిపత్రి లో ఉద్రిక్తత
- వైఎస్సార్ సీపీ శ్రేణులపై జేసీ వర్గీయుల రాళ్ల దాడి
- మూడు వాహనాలు ధ్వంసం
- ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
పల్నాడు:
- మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద వైఎస్ఆర్సిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై టీడీపీ దాడి
- కర్రలు రాడ్లు మారణాయుధాలతో దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు
- పదిమంది వైఎస్ఆర్సిపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు
- తలలు పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావం
- రోడ్డుపైన పడిపోయిన వైఎస్ఆర్సిపీ కార్యకర్తలు
- పిల్లలు రామకృష్ణారెడ్డి వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసం
- పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పై దాడి చేసిన టీడీపీ మూకలు
కృష్ణా
- పెనమలూరు నియోజకవర్గం పోరంకి హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ
- టీడీపీకి ఓటు వెయ్యాలని పార్టీ గుర్తు చూపిస్తున్న కార్యకర్తలు
- టీడీపీ ప్రలోభాల పై నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
- టీడీపీ పై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
ప్రకాశం
- ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 10 వాహనాల కాన్వాయ్ తో హల్చల్,
- ఎన్నికల నిబంధనలు కు విరుద్ధంగా కాన్వాయ్
- పట్టించుకోని పోలీసులు ,ఎన్నికల అధికారులు
- ఎస్పీ సుమిత్ కి పిర్యాదు చేసిన బాలినేని
బాపట్ల
- పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెంలో టీడీపీ అరాచకం
- బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడి
- దాడి సమయంలో కారులో లేని నందిగం సురేష్
- ఏజెంట్లు మాత్రమే కారులో ఉండడంతో కారుపై దాడి చేసి నందిగం సురేష్ ను దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్తలు
- ఏజెంట్ల ను బెదిరించిన టీడీపీ కార్యకర్తలు
- మూడురోజుల క్రితమే యద్దన పూడి మండలం చింతపల్లిపాడులో సురేష్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు
కాకినాడ
- గొల్లప్రోలు టౌన్ లో ఉద్రిక్తత.
- మహిళలను ఏడిపించిన జనసేన కార్యకర్తలు
- అడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడి
- పరిస్తితి ఉద్రిక్తం
ప్రకాశం
- దర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలు
- దర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తం
- ఏజెంట్ల తలెత్తిన వివాదం
- కిందపడిన ఈవీఎం
- వైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడి
- దేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవ
ప్రకాశం
- దర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలు
- దర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తం
- ఏజెంట్ల తలెత్తిన వివాదం
- కిందపడిన ఈవీఎం
- వైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడి
- దేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవ
అనంతపురం
- తాడిపత్రి లో ఎదురుపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి
- తాడిపత్రి లో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం
- అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ రౌడీషీటర్ పొట్టి రవి
- ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- తాడిపత్రి పట్టణంలో జేసీ ఇరువర్గాల మొహరింపు
- లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
పల్నాడు - మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం
- పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
- తాము లోపలికి వెళ్తామని టీడీపీ కార్యకర్తల ఆందోళన
- పోలింగ్ కేంద్రం గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం
- అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదం
- పోలీసులను నెట్టేసిన టీడీపీ కార్యకర్తలు

అనంతపురం
- గుత్తిలో టీడీపీ నేతల దౌర్జన్యం
- పోలింగ్ కేంద్రం లో ప్రచారం నిర్వహించిన టీడీపీ నేతలు
- ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలు

కర్నూలు
- కర్నూలు 17వ వార్డు టిడిపి పార్టీ కార్పోరేటర్ పద్మలతా రెడ్డి ప్రలోభాలు...
- పోలింగ్ కేంద్రం వద్ద చేరుకొని టిడిపికి ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్న కార్పొరేటర్..
- ఎన్నికల నిబంధన ఉల్లంఘించి ప్రచారానికి పాల్పడుతున్న టిడిపి కార్పొరేటర్ పద్మలత రెడ్డి
చిత్తూరు
- కుప్పం నియోజవర్గంలో దొంగ ఓటర్లు
- కుప్పం మున్సిపాలిటీ పాతపేట 163 పోలింగ్ బూత్ లో తన ఓటు వేరే ఎవరో దొంగ ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రీ అనే ఓటర్
- మొదటి సారి ఓటు హక్కు వినయోగించుకోవాలని చూసిన యువతీ తన ఓటు వేరొకరు వేసేయడంతో కన్నీళ్లు పెట్టుకొన్న యువతీ
కృష్ణా
- బాపులపాడులో జనసేన,టీడీపీ నాయకులు ఓవర్ యాక్షన్.
- పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న జనసేన,టీడీపీ నాయకులు.
- జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత గోసుల శివ భరత్ రెడ్డి.
ఏలూరు
- దెందులూరు నియోజకవర్గం పెదవేగి గ్రామంలో టిడిపి నాయకుల దౌర్జన్యం.
- పోలింగ్ బూత్ నెంబర్ 54 లోకి ఒక్కసారిగా చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చింతమనేని అనుచరులు.
- ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భయభ్రాంతులకు గురైన ఓటర్లు
- విధుల్లో ఉన్న పోలీసుల అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడిన టిడిపి నాయకులు
- పారా మిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయటంతో సద్దుమణిగిన పరిస్థితులు.
నంద్యాల
- నందికొట్కూరు పట్టణంలోని 46,47,48 పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేత మాండ్రా శివనంద రెడ్డి హాల్ చల్
- క్యూలైన్లో ఉన్న ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాల పర్వం
- క్యూలైన్లలో ఉన్న ఓటర్లను పక్కకు పిలిచి ఓటు వేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ నేత మాండ్రా శివానంద రెడ్డి,
- ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ శివానంద రెడ్డికి పోలీసుల వార్నింగ్
- 100 మీటర్లు బయటఉండాలని సూచన
- పోలీసుల మాట లెక్క చేయకుండా నేను చీఫ్ ఎలక్షన్ ఏజంట్ అని బూత్ పరిశీలించి వెళ్తానని పోలీసులతో వాదించారు టీడీపీ నేత
చిత్తూరు
- టీడీపీ గుండాల రౌడీయిజం
- మండికృష్ణాపురం పంచాయతీ లో టిడిపి గుండాల అరాచకం
- వైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్స్ పై కత్తితో దాడి ఆపై పరారీ
- ఓటమి భయంతో నీచ రాజకీయాలకు తెరతీసిన చిత్తూరు టీడీపీ శ్రేణులు
వైఎస్సార్ జిల్లా
- బద్వేల్ టీడీపీ కార్యాలయం వద్ద కూటమి నాయకుల ఘర్షణ
- అగ్రహారం గ్రామానికి సంబంధించి ఓటర్లకు డబ్బు మేము పంచుతాము అంటే మేము పంచుతాము అంటూ గొడవ
- జనసేన నేత వేలును టీడీపీ నాయకుడు
- ఇరు వర్గాలు పోలీసుల అదుపులో