మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్‌ | CM YS Jagan Viajayawada To Visit IPac Office Updates | Sakshi
Sakshi News home page

మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్‌

Published Thu, May 16 2024 7:56 AM | Last Updated on Thu, May 16 2024 3:24 PM

CM YS Jagan Viajayawada To Visit IPac Office Updates

ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌

మళ్లీ అధికారంలోకి వస్తున్నాం

మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం

గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం

ఈసారి 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి

ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌

ఎన్టీఆర్‌, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్‌ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. 

‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్‌4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. 

 

‘‘ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్‌ కిషోర్‌ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది.  వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ అన్నారు.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా ఐప్యాక్‌ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్‌.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement