
పోలింగ్ కేంద్రాల వైపు కన్నెత్తి చూడని నాయకులు
ఏజెంట్లు లేక టీడీపీని వెంటాడిన ఓటమి భయం
ఓడిపోతే ఇన్‌ఛార్జి పదవి ఇవ్వనన్న చంద్రబాబు
బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఓటరు తీరు.. టీడీపీకి ఝలక్ ఇచ్చింది. సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎ స్సార్పీతో పోటీ పడలేక ప్రతి పక్ష పార్టీ చేతులెత్తేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జయ చంద్రారెడ్డి వైఎస్సార్సీపీతో పోటీ పడలేక అస్త్ర సన్యాసం చేసినట్లయింది. దీనికి తోడు టీడీపీ నాయకులు ఎన్నికలకు పూర్తిగా దూరమవడం, తమకు ఎన్నికల పట్టనట్లు వ్యవహరించడం కనిపించింది.
పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు కనిపించకపోవడం, ఏజెంట్ల పరిస్థితి అలాగే ఉండడం ఇందుకు అద్దం పడుతోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నియమించిన ఏజెంట్లు పోలింగ్ మొదలైన తర్వాత బయటకు వచ్చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో కోలుకునేందుకు పడరాని పాట్లు పడింది. చంద్రబాబు ముందుగానే టిడిపి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరు ప్రకటించినప్పటికీ.. ఆ పార్టీ క్యాడర్ తొలుత వ్యతిరేకత చూపింది. అనంతరంవారిని కలపడం, కులం ఓట్లు అంటూ లెక్కలేసుకుని టీడీపీ సీటు జయచంద్రారెడ్డికి ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పి నా చివరికి ఆ లెక్కలే వారి పార్టీ కొంపముంచాయి.
ఒక సామాజిక వర్గానికి ప్రా ధాన్యం ఇవ్వడం, ఇతర వర్గాలను దూరం పెట్టటడం టీడీపీలో అగ్గి రాజేసింది. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీని ఢీకొనేలా స్థానిక నాయకులు పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ వారి సహకారం తిరస్కరించారు. ఈ ప్ర భావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. సోమవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదు. వారి క దలికలు గాని, హడావుడి కానీ లేకుండాపో యింది. ఓడిపోతున్నాం.. ఇక కష్టపడడం ఎం దుకనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం ఎ న్నికల వ్యవహారాన్ని వదులుకొని చేతులెత్తేసిన చరిత్ర తంబళ్లపల్లెలో టీడీపీకే దక్కింది.
ఓడితే నో ఇన్‌ఛార్జ్
టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోతే తర్వాత ఇన్‌ఛార్జిగా కొనసాగవచ్చునున్న ఆలోచనతో ఉంటే అది నెరవేరదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. తంబళ్లపల్లె నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో జయచంద్రారెడ్డిపై టీడీపీ మండల కనీ్వనర్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పుకున్నారు. దీంతో జయచంద్రారెడ్డి వర్గం అసంతప్తి వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment