tamballapalli
-
రచ్చ కోసం రెచ్చగొట్టిన టీడీపీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగటంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారించి పలుసార్లు అడ్డుకున్నా ఖాతరు చేయకుండా నాలుగు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితుల్ని సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచి్చన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి వీరంతా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నివాసం వద్దకు వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.సోమవారం నుంచి ఎమ్మెల్యే ఇంటివద్దే ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు మంగళవారం అక్కడికి వెళ్లి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని భావించారు. ఈ సమాచారం తెలిసి డీఎస్పీ ప్రసాదరెడ్డి పలువురు సీఐలు, ఎస్సైలను రప్పించారు. పోలీసు అధికారులు టీడీపీ శ్రేణులను నిలువరించి వెనక్కి వెళ్లాలని సూచించినా.. పట్టించుకోకుండా మమ్మల్లే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించారు.కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి సమీపంలోని మదనపల్లి రోడ్డులోని లేఅవుట్ ఆర్చ్ వద్దకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులను మళ్లీ అక్కడ పోలీసులు నిలువరించారు. రెండు గంటలకు పైగా వారికి నచ్చజెప్పేందుకు పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నించినా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో టీడీపీ శ్రేణులు ఈలలు, సవాళ్లతో బిగ్గరగా కేకలు వేశారు.దీంతో ఎమ్మెల్యే ఇంటివద్ద ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలతో గొడవలు సృష్టించేందుకు రెచ్చగొడుతున్నారన్న విషయం వారికి అర్థమైంది. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూసేందుకు ములకలచెరువు సీఐ మధు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని వివరించి సంయమనం పాటించాలని కోరారు. తాము ఎమ్మెల్యేని కలిసేందుకు వచ్చామని, టీడీపీ శ్రేణుల వ్యవహారం తమకు తెలియదని వైఎస్సార్సీపీ శ్రేణులు తెలిపాయి. ఇంతలో టీడీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు శృతిమించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పోలీసులు రాత్రి 9 గంటలకు కూడా తంబళ్లపల్లెలో పోలీసు పహారా కొనసాగుతోంది. -
తంబళ్లపల్లెలో టీడీపీకి ఝలక్
బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఓటరు తీరు.. టీడీపీకి ఝలక్ ఇచ్చింది. సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎ స్సార్పీతో పోటీ పడలేక ప్రతి పక్ష పార్టీ చేతులెత్తేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జయ చంద్రారెడ్డి వైఎస్సార్సీపీతో పోటీ పడలేక అస్త్ర సన్యాసం చేసినట్లయింది. దీనికి తోడు టీడీపీ నాయకులు ఎన్నికలకు పూర్తిగా దూరమవడం, తమకు ఎన్నికల పట్టనట్లు వ్యవహరించడం కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు కనిపించకపోవడం, ఏజెంట్ల పరిస్థితి అలాగే ఉండడం ఇందుకు అద్దం పడుతోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నియమించిన ఏజెంట్లు పోలింగ్ మొదలైన తర్వాత బయటకు వచ్చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో కోలుకునేందుకు పడరాని పాట్లు పడింది. చంద్రబాబు ముందుగానే టిడిపి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరు ప్రకటించినప్పటికీ.. ఆ పార్టీ క్యాడర్ తొలుత వ్యతిరేకత చూపింది. అనంతరంవారిని కలపడం, కులం ఓట్లు అంటూ లెక్కలేసుకుని టీడీపీ సీటు జయచంద్రారెడ్డికి ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పి నా చివరికి ఆ లెక్కలే వారి పార్టీ కొంపముంచాయి. ఒక సామాజిక వర్గానికి ప్రా ధాన్యం ఇవ్వడం, ఇతర వర్గాలను దూరం పెట్టటడం టీడీపీలో అగ్గి రాజేసింది. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఢీకొనేలా స్థానిక నాయకులు పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ వారి సహకారం తిరస్కరించారు. ఈ ప్ర భావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. సోమవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదు. వారి క దలికలు గాని, హడావుడి కానీ లేకుండాపో యింది. ఓడిపోతున్నాం.. ఇక కష్టపడడం ఎం దుకనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం ఎ న్నికల వ్యవహారాన్ని వదులుకొని చేతులెత్తేసిన చరిత్ర తంబళ్లపల్లెలో టీడీపీకే దక్కింది. ఓడితే నో ఇన్ఛార్జ్ టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోతే తర్వాత ఇన్ఛార్జిగా కొనసాగవచ్చునున్న ఆలోచనతో ఉంటే అది నెరవేరదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. తంబళ్లపల్లె నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో జయచంద్రారెడ్డిపై టీడీపీ మండల కనీ్వనర్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పుకున్నారు. దీంతో జయచంద్రారెడ్డి వర్గం అసంతప్తి వ్యక్తం చేస్తోంది. -
అమెరికా పింఛనట.. నెలకు రూ.3 వేలట!
సాక్షి, మదనపల్లె: ఒకసారి రూ.12,000 కడితే జీవితాంతం ప్రతినెలా రూ.3,000 అమెరికా పింఛన్ రూపంలో వస్తుందని డబ్బులు కట్టించుకుని నిలువునా మోసం చేశారని తంబళ్లపల్లె మండలం పులసరంవారిపల్లె గ్రామస్తులు సోమవారం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. బాధితుల కథనం..పెద్దమండ్యం మండలం చెరువుకిందపల్లెకు చెందిన చంద్రప్పనాయుడు కుమారుడు రూపేష్‌కుమార్ అమెరికా పింఛన్ పేరిట గ్రామంలోని 137 మంది దగ్గర రూ.12,000 చొప్పున రూ.16,44,000 కట్టించుకున్నాడు. దీనికి సంబంధించి బాండ్లను అందజేశాడు. కట్టిన డబ్బులో కొంతమందికి నెలనెలా కంతుల రూపంలో రూ.5,94,700 వరకు చెల్లించాడు. మిగిలిన సొమ్ము రూ.10,46,600కు సంబంధించి ఏడాదిన్నరగా అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. డబ్బు విషయమై నిలదీస్తే ఈ ఏడాది ఆగష్టు 8న తాను ఇచ్చిన బాండ్లను తీసుకురావాలని, అందులో పెయిడ్ అని రాసి 11, 12 తేదీల్లో ఖాతాలకు డబ్బు చేస్తానని చెప్పాడట! దీంతో నిజమేనని నమ్మి అతను చెప్పినట్లే చేశారు. తీరా అతను గ్రామం నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు గొల్లుమన్నారు. తాము మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సబ్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి తమ డబ్బులు ఇప్పించాలని సబ్ కలెక్టరేట్ ఏఓ షంషేర్‌ఖాన్‌కు వినతిపత్రం సమర్పించారు. (చదవండి: స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు) -
కరువు గడ్డ.. ఆధిపత్యాలకు అడ్డా
సాక్షి, కొత్తకోట(చిత్తూరు) : జిల్లాలోనే కరువుకు పెట్టింది పేరు తంబళ్లపల్లె. వెంటాడే వరుస కరువు.. ఉపాధి కోసం ఊళ్లు విడిచి వెళ్లే జనం..ఇక్కడే కనిపిస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. అయితే తంబళ్లపల్లె అంటే దశాబ్దాల తరబడి రాజకీయ పోరు రాజుకుంటూనే ఉంది. ఇక్కడ ఎన్నికల్లో వర్గపోరు దే కీలకపాత్ర. ఏ ఎన్నిక జరిగినా..ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయం. వర్గరాజకీయాలే కాక, ఆధిపత్యం కోసం జరిగిన హత్యా రాజకీయాలకు ఎందరో బలయ్యారు. 1980–90 దశాబ్దాల మధ్య నడచిన రాజకీయ వర్గపోరుతో ఇక్కడి ప్రజ ల జీవితాలు భయంలోకి నెట్టబడ్డాయి. జీవనప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఆధిపత్యం చెలాయించడానికి జరిగిన రాజకీయ క్రీడలో ఎందరో బలయ్యారు. ఈ పరిస్థితుల్లో పీ పుల్స్వార్ ఉద్యమం తంబళ్లపల్లెలో పురుడు పో సుకుని నక్సల్ ఉద్యమానికి బీజం పడింది. ఇదీ తంబళ్లపల్లె నియోజకవర్గం రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఘన చరిత్రే ఉంది. కంటిచూపుతో రాజకీయాలు శాసించిన నేతలున్న నియోజకవర్గమిది. జిల్లాలో మారుమూలన, కర్ణాటక, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని ఈ నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు నడిచాయి. 1952లో తొలి నియోజకవర్గంగా బి.కొత్తకోట మండలంలోని గట్టు కేంద్రంగా ఏర్పడింది. తర్వాత 1955లో తంబళ్లపల్లె కేంద్రంగా పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం మండలాలు, బి.కొత్తకోట మండలంలోని ఐదు పంచాయతీలతో నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో జరిగిన పునర్విభజనతో మదనపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండలం, బి.కొత్తకోట మండలంలోని మిగిలిన ఆరు పంచాయతీలను కలిపి ఆరు మండలాలతో తంబళ్లపల్లె నియోజకవర్గం ఏర్పాటు చేశారు. టీఎన్, కలిచర్ల కుటుంబాలదే పైచేయి నిత్య కరువు, వర్గపోరుకు నిలయమైన తంబళ్లపల్లె రాజకీయాల్లో టీఎన్, కలిచర్ల కుటుంబాలదే పైచేయి. తొలిసార్వత్రిక ఎన్నికలు 1952 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే పదవి విషయంలో వీరిమధ్యనే పోటీ. ఎమ్మెల్యే, రాజంపేట ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన చరిత్ర టీఎన్ కుటుంబానిదే. ఈ కుటుంబం నుంచి టీఎన్ రామకృష్ణారెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఈ కుటుంబీకులే గెలిచారు. ఒకసారి టీఎన్ కుటుంబం, ఒకసారి కలిచర్ల కుటుంబం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి ఎమ్మెల్యేలయ్యారు. 1983లో రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం ఉంటే తంబళ్లపల్లెలో టీఎన్.శ్రీనివాసులురెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఈ రెండు కుటుంబాల నడుమ 1978లో సాధారణ కుటుంబానికి చెందిన ఆవుల మోహన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఒకసారి, 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో అనిపిరెడ్డి వెంకట కుటుంబం నుంచి ఏవీ లక్ష్మీదేవమ్మ రెండుసార్లు, ఆమె తనయుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఒకసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు అయ్యారు. 1989 నుంచి తంబళ్లపల్లె రాజకీయాల ను శాసించి ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన టీఎన్ కుటుంబం, నాలుగుసార్లు ఎ మ్మెల్యేగా గెలుపొందిన కలిచర్ల కుటుంబం 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. నక్సలిజానికి ఆజ్యం నియోజకవర్గంలో 1980–90 దశాబ్దాల్లో నక్సలిజం పురుడు పోసుకుంది. జిల్లాలో పీపుల్స్‌వార్ కార్యకలాపాలు పుట్టింది ఇక్కడే. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తంబళ్లపల్లె మండలంలోని అన్నగారిపల్లెలో నక్సలైట్ల ధర్మగంట ఏర్పాటు ఒక అధ్యాయం. అన్యాయానికి గురైన వారు ఈ గంట మోగిస్తే రాత్రివేళల్లో అన్నలు పల్లెలోకి వచ్చి తీర్పులు ఇచ్చేవారు. భూ సమస్యలపై జరిగిన వివాదాల్లో ములకలచెరువు, తంబళ్లపల్లె మండలాల్లో నక్సలైట్లు, వారి వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన సంఘటనల్లో 13 మంది చనిపోయారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా చౌడసముద్రంలో రైతు, రైతు కూలీ సమన్వయ సంఘం ఏర్పాటైన తర్వాత వరుస హత్యలు జరిగాయి. పీపుల్స్‌వార్ దళాలు పేదలతో కలిసి చౌడసముద్రంపై జరిపిన దాడిలో ముగ్గురిని హతమార్చారు. పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శులుగా చౌడసముద్రం ఎల్వీ రమణ, కలిచర్లకు చెందిన కృష్ణప్ప, మల్లూరివాండ్లపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి పనిచేశారు. తర్వాత కృష్ణప్ప రాయలసీమ కార్యదర్శిగా పనిచేశారు. జొన్నచేనువారిపల్లె వేమనారాయణరెడ్డి పీపుల్స్‌వార్‌తో విభేదించి కొత్తగా పీపుల్స్‌వార్ విముక్తి పథం ఏర్పాటు చేశారు. 1984లో తంబళ్లపల్లె సమీపంలో జిల్లా వార్ ప్లీనరీలో కొండపల్లె సీతారామయ్య హాజరయ్యారు. -
పంచాయతీ భవనం కోసం సెల్‌టవర్ ఎక్కాడు
తంబళ్లపల్లి: తమ గ్రామానికి మంజూరైన పంచాయతీ భవనాన్ని తమ గ్రామంలో నిర్మించకుండా వేరే గ్రామంలో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ టీడీపీ కార్యకర్త సెల్‌టవర్ ఎక్కాడు. ఏడు గంటలుగా అక్కడే ఉండి హల్చల్ చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో గల బురుజుపల్లికి పంచాయతీ భవనం లేదు. దానిని వేరే గ్రామంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. అయితే బురుజుపల్లి పంచాయతీ అని పేరుందని, అందువల్ల ఆ భవనాన్ని ఇక్కడే నిర్మించాలని గ్రామస్థులు పంచాయతీ అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. ఎవరూ స్పందించకపోగా పనులను మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్త అయిన రాజశేఖర్ అనే యువకుడు మంగళవారం ఉదయం తంబల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సాయంత్రానికి పంచాయతీ అధికారి నుంచి తాత్కాలిక నిలుపుదల ఉత్త్ర్వులు జారీ చేసినా వినకుండా టవర్‌పైనే ఉండిపోయాడు. నీళ్లు, ఆహారం స్వీకరించకుండా నిరసన కొనసాగిస్తున్నాడు. . -
వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెడతా: ద్వారకానాథ్
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె పార్టీ సమన్వయకర్తగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. పార్టీ బలోపేతమే తన థ్యేయమన్నారు. కార్యకర్తలను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకు వెళతానని ద్వారకానాథ్ పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తంబళ్లపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వైఎస్ఆర్ సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయ కర్తగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న సాయంత్రం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.