తంబళ్లపల్లి: తమ గ్రామానికి మంజూరైన పంచాయతీ భవనాన్ని తమ గ్రామంలో నిర్మించకుండా వేరే గ్రామంలో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ టీడీపీ కార్యకర్త సెల్‌టవర్ ఎక్కాడు. ఏడు గంటలుగా అక్కడే ఉండి హల్‌చల్ చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో గల బురుజుపల్లికి పంచాయతీ భవనం లేదు. దానిని వేరే గ్రామంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. అయితే బురుజుపల్లి పంచాయతీ అని పేరుందని, అందువల్ల ఆ భవనాన్ని ఇక్కడే నిర్మించాలని గ్రామస్థులు పంచాయతీ అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. ఎవరూ స్పందించకపోగా పనులను మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్త అయిన రాజశేఖర్ అనే యువకుడు మంగళవారం ఉదయం తంబల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సాయంత్రానికి పంచాయతీ అధికారి నుంచి తాత్కాలిక నిలుపుదల ఉత్త్ర్వులు జారీ చేసినా వినకుండా టవర్‌పైనే ఉండిపోయాడు. నీళ్లు, ఆహారం స్వీకరించకుండా నిరసన కొనసాగిస్తున్నాడు.
.
Published Tue, Dec 19 2017 8:38 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment