‘సీఎం జగన్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది’ | AP Elections 2024 Political News In Telugu On April 14th Updates | Sakshi
Sakshi News home page

‘సీఎం జగన్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది’

Published Sun, Apr 14 2024 6:53 AM | Last Updated on Sun, Apr 14 2024 6:28 PM

AP Elections 2024 Political News In Telugu On April 14th Updates - Sakshi

06:15 PM, April 14th 2024

సీఎం జగన్‌పై దాడి దారుణం: కేశినేని నాని

  • అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది
  • చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు
  • దీని వెనుక పెద్ద కుట్ర ఉంది
  • బోండా ఉమా రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు
  • దాడికి చంద్రబాబు, లోకేష్‌, బోండా ఉమానే కారణం
  • విజయవాడలో అల్లర్లు సృష్టించాలన్నదే చంద్రబాబు కుట్ర
  • దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం
  • దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
     

05:50 PM, April 14th 2024

సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌

  • ఎస్పీ హరికృష్ణ నేతృత్వంలో ఆరుగురు ఏసీపీలతో టాస్క్‌ఫోర్స్‌
  • ఘటనా స్థలంలో ఇప్పటికే పలు దఫాలు విచారణ చేపట్టిన పోలీసులు
  • సీసీ కెమెరాలు, సెల్‌ టవర్ల లోకేషన్ల ఆధారంగా పోలీసుల విచారణ
  • ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు

05:46 PM, April 14th 2024

సీఎం జగన్‌పై అక్కసుతోనే దాడికి పాల్పడ్డారు: వెల్లంపల్లి

  • జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు
  • సీఎం జగన్‌కు తీవ్ర గాయమైంది
  • నా కంటికి కూడా గాయమైంది
  • టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు
  • చంద్రబాబు, బోండా ఉమా రౌడియిజానికి తెరలేపారు
  • అధికారం లేనప్పుడే వాళ్లు ఇలా చేశారు
  • రేపు వాళ్లకు అధికారం ఇస్తే ఏమవుద్ది.. ఆలోచించండి
  • ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి
  • దాడులకు తెగబడటం దారణం
  • చంద్రబాబు ఎందుకు ఇంత దిగజారిపోయారు
  • చంద్రబాబు హయాంలోనే వంగవీటి రంగ హత్య జరిగింది
  • దేవుడి ఆశీస్సుల వల్లే సీఎం జగన్‌కు ప్రమాదం తప్పింది
  • ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలు తీసుకోవాలి
     

05:18 PM, April 14th 2024

సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన: ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

  • సీఈవోతో సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైఎస్సార్‌సీపీ నేతల భేటీ
  • సీఎంపై దాడి వెనుక కుట్ర కోణం ఉందన్న వైఎస్సార్‌సీపీ నేతలు

ఈసీకి ఫిర్యాదు అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

  • సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం
  • జగన్‌ ఎడమ కన్నుపై దాడి జరిగింది
  • రాజకీయాలకు అతీతంగా పలు రాష్ట్రాల నేతలు ఖండించారు
  • ఈ ఘటనను ప్రధాని సహా అందరూ ఖండించారు
  • విపక్ష నేతలు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు
  • దాడి ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు హేయం
  • ఈ దాడి పథకం ప్రకారమే జరిగినట్టు స్పష్టం అవుతోంది
  • ఆబ్జెక్ట్ చాలా ఫోర్స్‌తో జగన్ కంటిపై తగిలి వెల్లంపల్లి కంటికి తగిలింది
  • కొంచెం ఉంటే వెల్లంపల్లి కన్నుపోయేది
  • షార్ప్ షూటర్ గురి తప్పకుండా ఏదైనా ఎయిర్‌గన్‌ నుండి షూట్ చేసినట్టు తెలుస్తోంది
  • పవర్ ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇది చేయలేరు
  • ఈ అంశాలన్నీ ఈసీ దృష్టికి తీసుకెళ్లాం
  • చంద్రబాబు, టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని ఈసీని కోరాం

05:07 PM, April 14th 2024

ఎన్టీఆర్ జిల్లా:

ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే సామినేని ఉదయభాను
సీఎం జగన్‌పై దాడిని నిరసిస్తూ జగ్గయ్య పేట బైపాస్‌ రోడ్డుపై నల్ల జెండాలతో నిరసన
పాల్గొన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

  • ఏపీలో సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు అండ్ కో రాళ్ల దాడి చేయిస్తున్నారు
  • సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకోవడం చంద్రబాబు తరం కాదు
  • సీఎం జగన్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యం, రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడే
  • ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.
  • సార్వత్రిక ఎన్నికల్లో కూటమి  ఓటమి పాలు అవుతుంది.
  • ప్రజలు చంద్రబాబు ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు.
  • దాడిపై ఉన్నత స్థాయి కమిటీలతో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి.

03:40 PM, April 14th 2024

విశాఖ: 

టీడీపీ నేతలకు దాడులు చేయడం కొత్త కాదు: వైవీ సుబ్బారెడ్డి

  • సీఎం జగన్‌ను అంతమొందించాలని కూటమి నేతలు చూస్తున్నారు
  • దాడులు అనేది టీడీపీ నేతల సంస్కృతి
  • సీఎం జగన్ పై రాయితో చేసిన దాడి కాదు
  • ఎయిర్ గన్ లాంటి బలమైన వస్తువుతో హత్యాయత్నం చేశారు
  • 2019 ఎన్నికలకు ముందు ఇదేవిధంగా హత్యాయత్నం చేశారు
  • సీఎం ప్రాణాలను కాపాడుకునే పనిలో మేముంటే, స్క్రిప్ట్లు రాసుకునే పనిలో టీడీపీ నేతలు ఉన్నారు
  • వారే హత్యాయత్నానికి పాల్పడి వారే మళ్లీ మా పైన నెపం నెడుతున్నారు
  • టీడీపీ నేతలకు దాడులు చేయడం కొత్త కాదు
  • గతంలో కుటుంబ సభ్యులతో వచ్చిన అమిత్ షా పై రాళ్లదాడికి టీడీపీ నేతలు తెగబడ్డారు
  • కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల దీవెనలు సీఎం జగన్ కు ఎన్నడూ ఉంటాయి
     

03:29 PM, April 14th 2024

విజయవాడ:

సీఎం జగన్ పై దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలోనే ఉన్నాము
సాక్షి టీవీతో ప్రత్యక్ష సాక్షి, డాబా కొట్టుల సెంటర్ నివాసి మహమ్మద్ షఫీ

  • సింగ్ నగర్ ఫ్లై ఓవర్ నుండి ఆయనను ఫాలో అయ్యాము 
  • దాడికి పాల్పడిన వ్యక్తి దొరికి ఉంటే మహిళలే అతనికి తగిన శాస్తి చేసేవారు
  • సీఎం కు దెబ్బ తగలగానే మహిళలంతా దాడి చేసిన వ్యక్తిని దూషించారు
  • సీఎం జగన్ తో పాటే వెల్లంపల్లికి దెబ్బ తగలడం స్పష్టంగా కనిపించింది
  • బలమైన దెబ్బ తగలగానే సీఎం జగన్ ఎంతో బాధకు గురయ్యారు
  • సీఎం బాధకు లోనవడం మేమంతా స్పష్టంగా చూశాం

02:45 PM, April 14th 2024

తాడేపల్లి :

సీఎం జగన్‌పై దాడి దుర్మార్గపు చర్య : ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

  • టీడీపీలోని పెద్దల ప్రోత్సాహం లేనిదే సీఎంపై దాడికి దిగలేరు
  • దాడులకు పాల్పడాలనే ఆలోచనలే అమానుషం
  • ఎన్ని కుట్రలు పన్నినా మళ్ళీ సీఎం జగనే
  • భగవంతుడు, ప్రజలే జగన్ని కాపాడుకుంటారు

02:40 PM, April 14th 2024
విజయవాడ
సీఎం వైఎస్ జగన్‌పై హత్నాయత్నం చాలా దారుణం:  ఎమ్మెల్యే మల్లాది విష్ణు

  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  • సింగ్ నగర్ గంగానమ్మ‌గుడి వద్ద వివేకానంద సెంటినరీ హైస్కూలు ప్రాంతంలో మల్లాది‌విష్ణు పరిశీలన
  • రాజకీయమనగా సీఎం వైఎస్ జగన్ ని ఎదుర్కోలేక హత్నాయత్నానికి పాల్పడ్డారు
  • సీఎం వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దాడి వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది
  • సీఎంపై హత్యాయత్నం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉంది
  • సీఎం వైఎస్ జగన్పై గత కొన్ని రోజులగా చంద్రబాబు చేస్తున్న దారుణ వ్యాఖ్యలు.. రెచ్చగొట్టే మాటలు చేస్తున్నాం
  • ఇప్పటికే ఆధారాలతో చంద్రబాబు తీరుపై ఎన్నికల కమీషన్కి ఫిర్యాదు చేశాం
  • సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఎన్నికల కమీషన్కి ఫిర్యాదు చేస్తాం

02:26 PM, April 14th 2024
సీఎం జగన్‌ మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు

  • వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఫిర్యాదుతో సింగ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు
  • నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు
  • ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు
  •  ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు
  • నాన్‌ బెయిల్‌బుల్‌ కేసు నమోదు
  • ప్లాన్‌ ప్రకారం దాడి చేసినట్టు పోలీసుల ప్రాథమిక నిర్థారణ
  • క్లూస్‌ టీమ్‌, సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం
  • ఏసీపీ స్థాయి అధికారులతో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు
  • టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు 

02:12 PM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడి వెనక టీడీపీ: మంత్రి బొత్స సత్యనారాయణ

  • సీఎం జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా..
  • వారిలా మేము కూడా సహనం కోల్పోతే.. టీడీపీ వారు రోడ్లపై తిరగగలరా..? 
  • నేను ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు
  • దాడి జరిగిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర ఓ సారి పరిశీలించాలి
  • టీడీపీ సోషల్ మీడియాలో చేసే పోస్టులు వారి నైజాన్ని తెలియజేస్తుంది
  • సీఎం జగన్ ప్రజలను నమ్ముకున్నారు
  • ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు
  • ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సీఎం జగన్ ను ఏమీ చెయ్యలేరు
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది..

02:04 PM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన కామెంట్స్‌

  • సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారు
  • పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగింది
  • చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు దాడులు జరిగాయి
  • నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టాలని చెప్పాడు
  • చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో దాడి చేశారు
  • చాలా పకడ్బంధీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్‌తో దాడి చేశారు
  • ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్నుకు తగిలింది
  • దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్‌తో గాయంతో బయటపడ్డారు
  • దీన్ని ఖండించాల్సిన కొందరు వ్యక్తులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు
  • ఎన్నికల సందర్బంగా గుర్తింపు పొందిన తొమ్మిది సంస్థల సర్వేల్లో వైఎస్సార్‌సీపీకి భారీ మోజార్టీలు వస్తాయని చెప్పాయి.
  • దీంతో, సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఇలా చేశారు
  • విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహం నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి ఇలా దాడి చేశాయి
  • ఒక సీఎం ప్రాణాలు తీయడానికే ప్రయత్నం జరిగిందంటే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉంది
  • ఎంతో పక్కగా దాడి చేయబట్టే సీఎం జగన్‌కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలింది
  • ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రోడ్‌ షోగా వెళ్లేటప్పుడు పగలైనా, రాత్రి సమయంలోనైనా కరెంట్‌ తీసేస్తారు?
  • ఈ విషయం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా?
  • చంద్రబాబు బస్సుపై రోడ్‌ షోలు చేసేటప్పుడు కరెంట్‌ తీయలేదా?
  • సీఎం జగనే కరెంట్‌ తీయించారని టీడీపీ నేత పిచ్చివాగుడు వాగుతున్నారు
  • అధికారులపై యాక్షన్‌ తీసుకోవాలని చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నాడ
  • సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను

01:30 PM, April 14th 2024
సీఎం జగన్‌పై రాళ్ల దాడి దారుణం.. సజ్జల రామకృష్ణారెడ్డి

  • ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది 
  •  సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారు.. ఇది పిరికిపందల చర్య
  • కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది
  • కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేది
  • ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు
  • ఎయిర్‌గన్‌ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది
  • చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు
  • ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారు
  • ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారు
  • ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెబుతారు
  • ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది
  • టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడారు
  • కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరు
  • ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదు. పక్కా ప్లాన్‌ మర్డర్‌ అటెంప్ట్‌
  • దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఇలా మాట్లాడతారా?.
  • ప్రతీ చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు.
  • ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
  • దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్‌ క్షేమంగా ఉన్నారు
  • వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారు
  • నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్‌కు లేదు
  • సింపతీతో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు
  • వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి
  • సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగింది
  • చంద్రబాబు కూడా అందుకే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు
  • కొట్టండి అంటూ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు
  • అధికారం రాదన్న అసహనంతో ఇలా రెచ్చగొడుతున్నాడు
  • చంద్రబాబు రాజకీయ సిద్దాంతంలోనే ద్వేషం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం ఉన్నాయి.
  • చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు
  • ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేతికి కట్టుతో వెళ్లి పాల్గొన్నాడు
  • కానీ చంద్రబాబు డ్రామాలకు ప్రజలు బుద్ధి చెప్పారు
  • చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తాడో దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఒక పుస్తకంలో రాశాడు
  • సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని ఉన్న నాయకుడు
  • ప్రజలతో ఇలానే మమేకం అవుతూ ముందుకు సాగుతారు

12:13 PM, April 14th 2024
సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు

  • కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ
  • రెండు రకాలుగా దాడి జరగొచ్చని పోలీసులు అనుమానం
  • వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య నుంచి రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం
  • మరో వైపు వివేకానంద స్కూల్ నుండి దాడి చేసి ఉండొచ్చని అనుమానం
  • తెరుచుకుని ఉన్న వివేకానంద స్కూల్‌లోని కొన్ని కిటికీలు
  • వాటి నుండి ఎయిర్ గన్స్ తో క్యాటర్ బాల్ తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం
  • దీంతో స్కూల్ నుండి దాడి జరగొచ్చన్న కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు
  • స్కూల్‌కి గుడికి మధ్య నుండి చెట్ల మధ్య నుండి దాడి జరగొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు
  • కుడివైపు జన సమూహం ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుండి దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం
  • పూర్తిగా చీకటిగా, చెట్లు ఉండడంతో ఎవరికీ కనిపించని నిందితుడు
  • దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానం
  • కేవలం 20 నుండి 30 అడుగుల దూరం నుండే సీఎం జగన్ ని టార్గెట్ చేసిన టీడీపీ గుండాలు
  • సీఎం జగన్‌ని బలంగా కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే దాడి

10:44 AM, April 14th 2024
సీఎం జగన్ పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

  • సీఎం జగన్‌కి తగిలిన వెంటనే నాకు గాయమైంది
  • ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు
  • నాకు కను గుడ్డు మీద రేష్ అయ్యింది
  • నాకు విపరీతంగా నొప్పి వస్తోంది
  • సీఎం జగన్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు
  • సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకి ఫిర్యాదు చేశాను
  • పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారించాలి
  • చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు
  • గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు
  • సీఎం జగన్ పైన ఈరోజు కుట్ర చేశాడు
  • సిగ్గులేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు
  • ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే
  • అలిపిరి బాంబు దాడిలో ఒక చేతికి గాయమైతే.. మరో చేతికి కట్టు కట్టించుకుని డ్రామా ఆడింది చంద్రబాబు కాదా
  • స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయితే ఒంటి నిండా జబ్బులు ఉన్నాయని డ్రామా ఆడింది చంద్రబాబు కాదా
  • ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని జైలులో పెడితే ఫైల్స్ ఉన్నాయని డ్రామా ఆడాడు
  • వాళ్లు మా ముఖ్యమంత్రిని విమర్శిస్తారా?
  • టీడీపీ నాయకులు నెల రోజుల్లోనే దీనికి మూల్యం చెల్లించక తప్పదు

10:54 AM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ మంత్రి రోజా రోడ్డుపై నిరసన

  • పుత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మంత్రి ఆర్కే రోజా
  • దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్
  • ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు పై చర్యలు తీసుకోవాలి
  • సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర దాడి చేయించారు
  • చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి

10:47 AM, April 14th 2024
లోకేష్, అచ్చెన్నాయుడు నోరు అదుపులోకి పెట్టుకోవాలి: ఎమ్మెల్యే కురసాల కన్నబాబు

  • బస్సు యాత్రలో సీఎం జగన్‌కి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు
  • ఎన్టీఆర్ పై చెప్పులు, అమీత్ షా పై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుది
  • నాకు తెలిసి రాజకీయాల్లో అత్యంత ధైర్యశాలి సీఎం జగన్‌
  • దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలి

10:30 AM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడి పిరికపంద చర్య: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

  • సీఎం జగన్‌పై దాడిని ఖండించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
  • విజయవాడ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రోడ్‌షో జరిగింది
  • జగన్‌ వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు
  • రోడ్‌ షోకు ఆటంకం కలిగించేందుకు దాడికి పాల్పడ్డారు.

10:20 AM, April 14th 2024
సీఎం జగన్‌పై జరిగిన దాడి వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నాడు
  • అధికారం కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు

10:15 AM, April 14th 2024
సీఎం జగన్‌పై పథకం ప్రకారమే దాడి: వైవీ సుబ్బారెడ్డి

  • ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలి
  • దాడి చేసిన వెంటనే చంద్రబాబు మార్క్ రాజకీయం మొదలు పెట్టారు..
  • సీఎంపై దాడిని కూడా డ్రామా అనడం బాబు నైజం
  • విచారణ వేగంగా జరుగుతుంది..
  • వాస్తవాలు బయటకు వస్తాయి..

9:58 AM, April 14th 2024
కుట్ర కోణంలోనే సీఎం జగన్‌పై దాడి: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

  • దాడి ఘటనను కూడా  టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారు
  • దాడి తీవ్రత పెద్దదైనప్పటికీ.. సీఎం జగన్ మొక్కవోని సంకల్పంతో యాత్రను కొనసాగిస్తున్నారు
  • ప్రజల్లో ఆదరణ కలిగిన వంగవీటి రంగాను సైతం చంద్రబాబు హత్య చేయించారు
  • ప్రజల్లో సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక చంద్రబాబు, పవన్ ఈ తరహా దాడులకు పాల్పడ్డారు

9:50 AM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడి అత్యంత భయానకం: మంత్రి మేరుగ నాగార్జున 

  • అదృష్టవశాత్తూ సీఎం ప్రాణాలతో బయటపడ్డారు
  • సీఎం జగన్‌ను మట్టుబెట్టడానికే పక్కా ప్లాన్‌తో దాడి
  • చంద్రబాబు రక్తచరిత్రలో ఇదో టైప్ హత్యాయత్నం
  • దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉంది.. ఆ కోణంలోనే విచారణ జరపాలి
  • సీఎం పై జరిగిన దాడి కేసును అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ విచారణ జరపాలి 
  • ఎల్లో మీడియా పిచ్చి రాతలు మానుకోవాలి

9:48 AM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడి.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి: మంత్రి వేణు

  • పేదవాడిని సమర్థించే వ్యక్తిని దెబ్బతీయటానికి ప్రతిపక్షాలు చేసిన కుట్ర
  • ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూడలేకే దాడులకు పాల్పడుతున్న ప్రతిపక్షాలు
  • ప్రతిపక్షాల కుట్రలతో సీఎం జగన్‌కు మరింత ప్రజాదరణ పెరుగుతుంది 
  • జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి

9:46 AM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ తిరుపతిలో భూమన నిరసన దీక్ష

  • సీఎం జగన్‌పై దాడిని ఖండించిన భూమన కరుణాకర్‌రెడ్డి
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ హత్య రాజకీయాలు నశించాలి
  • రెండు మూడు నెలలు నుంచి సీఎం జగన్‌ను అంతం చేస్తామన్న మాటలు నిజం చేస్తున్నారు
  • చంద్రబాబు హస్తాలు రక్తసిక్తమైనవి
  • వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడు
  • సీఎం జగన్‌ను అంతం చేయాలనే లక్ష్యంగా ఈ దాడి చేశారు

9:11 AM, April 14th 2024
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం

  • ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్లూస్‌ టీం
  • ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు
  • వివేకానంద స్కూల్‌, గంగానమ్మ గుడి  మధ్య నుంచి దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారించిన పోలీసులు
  • 30 అడుగులు దూరం నుంచి దాడి చేసిన ఆగంతకుడు

9:01 AM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడిని ఖండించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

  • లోకేష్ వ్యాఖ్యలను గమనిస్తే దాడికి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తుంది
  • ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్‌పై దాడి చేశారు
  • చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారు
  • సిద్దం సభలు, బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదు
  • లోకేష్ ట్విట్టర్‌లో 2019 లో కోడి కత్తి, 2024లో రాయి దాడి అని పెట్టారు
  • అయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతుంది
  • ఎవరైనా రాయితో దూరం నుంచి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా?
  • అదే రాయిని లోకేష్‌కి ఇస్తాం, అదే ప్రాంతంలో బస్సు ఎక్కి ఎవరితో అయినా రాయితో కొట్టించుకోవాలి
  • అప్పుడు కరెక్ట్‌గా ప్లాన్ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యం అవుతుందో లేదో తెలుస్తుంది
  • ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం
  • గతంలో పాదయాత్రకు గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోందన్నారు
  • కృష్ణా జిల్లా ఇంచార్జ్‌గా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశాం
  • మళ్లీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో స్పందన రావడంతో ఈ కుట్రకు తెరలేపారు

8:10 AM, April 14th 2024
పాఠశాల నుంచే దాడి?

  • దాడి జరిగిన ప్రాంతానికి 20 అడుగుల దూరంలోనే వివేకానంద స్కూలు 
  • మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉన్నట్లు గుర్తింపు
  • పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే సెంట్రల్‌ టీడీపీ ఆఫీసు
  • ఓ టీడీపీ నేత అనుచరుల వద్ద ఎయిర్‌గన్‌ వంటి మారణాయుధాలు 

7:32 AM, April 14th 2024
సీఎం జగన్‌పై దాడి: స్పందించిన ప్రధాని మోదీ.. వైఎస్సార్సీపీ నేతలు.. 

  • జగన్‌ త్వరగా కోలుకోవాలి 
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  త్వరగా కోలుకోవాలని  భగవంతుడిని ప్రార్థిస్తున్నాను -‘ఎక్స్‌’లో ప్రధాని మోదీ  
  • ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు 
  • రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు.  మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షిస్తున్నాను- స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
  • సీఎం జగన్‌పై దాడి గురించి విని షాక్‌ అయ్యా.. 
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై జరిగిన  దాడి గురించి విని షాక్‌ అయ్యా.  ఆయన త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నా-మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి   
  • హింసకు తావు లేదు
  • ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కఠినమైన ముందస్తు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. జగనన్నా.. జాగ్రత్తగా ఉండండి-కేటీఆర్, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 
  • చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడి 
  • చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగింది
  • ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు
  • చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు
  • సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే దాడి చేస్తున్నారు
  • చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ కలిసినా జగన్‌ను ఏమీ చేయలేకపోతున్నామని, చివరికి దాడులకు పాల్పడుతున్నారు
  • సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలతో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు- మంత్రి అంబటి రాంబాబ
  • ఓటమి భయంతోనే సీఎం జగన్‌పై దాడి  
  • ఓటమి భయంతోనే సీఎం వైఎస్‌ జగన్‌పైన టీడీపీ దాడులకు తెగబడుతోంది.
  • సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుండటాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి
  • ఇలాంటి దాడులకు, ఉడత ఊపులకు సీఎం భయపడరు
  • రాజకీయంగా జగన్‌ను ఒంటరిగా ఢీకొట్టలేని టీడీపీ.. జనసేనను, బీజేపీని వెంట తెచ్చుకుంది- తానేటి వనిత, హోం శాఖ మంత్రి  

7:13 AM, April 14th 2024
నేడు బస్సు యాత్రకు విరామం

  • విజయవాడలో సింగ్‌నగర్‌ డాబా కొట్ల సెంటర్‌లో టీడీపీ మూకల దాడిలో సీఎం జగన్‌ ఎడమ కంటి కనుబొమ్మపై బలమైన గాయం
  • వైద్యుల సలహా మేరకు ఆదివారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం
  • తదుపరి షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటిస్తామని వైఎస్సార్‌సీపీ వెల్లడి 

7:05 AM, April 14th 2024
వ్యూహం కాదిది.. ద్రోహం!

  • కూటమిలో త్యాగం చేయాల్సి వస్తే బలవుతున్నది బీజేపీ, జనసేనే 
  • చంద్రబాబు, ఆయన బంధువర్గంలో మాత్రం అందరికీ టికెట్లు
  • రాత్రికి రాత్రి వచ్చేవారిని కూడా.. అటూ ఇటూ పంపిస్తున్న బాబు
  • ‘పచ్చ’ నేతలకు టికెట్లిచ్చి సొంత నేతలకు బీజేపీ, జనసేన ద్రోహం
  • ప్రకటించిన వారిని కూడా బాబు ఆదేశాలతో మార్చేస్తున్న తీరు
  • ఆఖరికి మాజీ సైనికుడికి ఇచ్చామంటున్న అనపర్తిపైనా బాబు కన్ను
  • ఆ సీటును బీజేపీ నుంచి తీసుకోవటానికి ఎత్తుగడ.. వదినమ్మ ఓకే! 
  • బాలకృష్ణ వియ్యంకుడి కోసం విశాఖ నుంచి బీజేపీని పంపేసిన వైనం
  • అనకాపల్లి ఇచ్చి.. అది తన బంటు సీఎం రమేశ్‌కే వచ్చేలా ఎత్తుగడ
  • మొదటి నుంచీ బీజేపీని నమ్ముకున్న అగ్రనేతలకూ మొండిచెయ్యి
  • జనసేనకు ఇచ్చిన సీట్లలో 70 శాతం టీడీపీ, ఇతర పార్టీల వారికే
  • ఆరణి శ్రీనివాసులను బాబే పంపినట్లు తిరుపతిలో చెప్పిన పవన్‌
  • బాబు మార్కు రాజకీయాలతో కుదేలవుతున్న బీజేపీ, జనసేన శ్రేణులు
  • అందుకే ఆగ్రహంతో వరసగా రాజీనామాలు 

6:56 AM, April 14th 2024
జగన్‌కు భద్రత పెంచాలి: ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి  

  • ఇది కూటమి కుట్రే..
  • ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దాడులు 
  • కుట్రలు, కుతంత్రాలు పన్నినా జగన్‌ను ఎదుర్కొనటం సాధ్యం కాదు 
     

6:55 AM, April 14th 2024
ధ్వంస రచనే కూటమి కుతంత్రం

  • సీఎం జగన్‌పై దాడి వెనుక చంద్రబాబు ముఠా భారీ కుట్ర
  • ముందస్తు పన్నాగంతోనే పోలీసు అధికారులపై ఫిర్యాదులు
  • పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొనే లక్ష్యం
  • తద్వారా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహ రచన
  • అందులో భాగంగానే ఐపీఎస్‌లపై పురందేశ్వరి ద్వారా చంద్రబాబు ఫిర్యాదు
  • ఎవర్ని నియమించాలో కూడా చెప్పిన పచ్చ ముఠా
  • తీవ్రంగా స్పందించిన అధికారులు.. పారని బాబు పాచిక
  • దాంతో సీఎం యాత్రలో దాడులకు కుతంత్రం
  • తద్వారా శాంతిభద్రతల సమస్య సృష్టించే కుట్ర
  • దెబ్బ తగిలినా చిరునవ్వుతో సీఎం జగన్‌ శాంతి సందేశం
  • సీఎం జగన్‌ సందేశంతో సంయమనం పాటించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • బెడిసికొట్టిన చంద్రబాబు కూటమి కుతంత్రం
     

6:53 AM, April 14th 2024
సీఎం జగన్‌పై హత్యాయత్నం!

  • సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర 
  • వారధి దాటిన దగ్గర్నుంచీ అడుగడుగునా జనం నీరాజనాలు 
  • రాత్రి 8.10 సమయంలో సింగ్‌నగర్లో జగన్‌ టార్గెట్‌గా దుశ్చర్య 
  • పథకం ప్రకారం ఒక స్కూల్‌ రెండో అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు
  • అక్కడి నుంచి జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి
  • ప్రజలకు అభివాదం చేస్తూ జగన్‌ పక్కకు తిరగటంతో.. తప్పిన గురి
  • కనుబొమపై తీవ్ర గాయం.. పక్కకు తూలి.. గాయాన్ని అదిమి పట్టుకున్న జగన్‌
  • జనానికి అభివాదం చేస్తూనే బస్సులోకి.. ఆ వెంటనే ప్రథమ చికిత్స
  • అనంతరం గాయంతోనే యాత్రను కొనసాగించిన ముఖ్యమంత్రి
  • జగన్‌ కనుబొమ పైన తగిలాక.. పక్కనున్న వెలంపల్లికీ గాయం
  • ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి... పలు రకాలుగా నిపుణుల వ్యాఖ్యలు
  • రాయి, గ్రానైట్‌ పలక, పెల్లెట్, ఎయిర్‌ బుల్లెట్‌... ఏదైనా కావచ్చని వ్యాఖ్యలు
  • ఆ వేగాన్ని బట్టి చూస్తే.. అది కచ్చితంగా హత్యాయత్నమేనన్న వెలంపల్లి 
  • ఈ దురాగతానికి పాల్పడింది చంద్రబాబు నాయుడేనంటూ విమర్శలు 
  • ‘టప్‌’మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశినేని నాని
  • షెడ్యూలు ప్రకారం రాత్రి 10.38 వరకూ సాగి... ముగిసిన యాత్ర
  • అనంతరం నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • లోకల్‌ అనస్తీషియా ఇచ్చి.. కుట్లు వేసిన వైద్యులు
  • విశ్రాంతి తీసుకోవాలని జగన్‌కు సూచన.. నేడు యాత్రకు విరామం
  • దాడిని.. బాబు వైఖరిని మూకుమ్మడిగా ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలు 
  • రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసనలు
  • ప్లాన్‌ చేసి చేయాల్సిన అవసరం రాజకీయ ప్రత్యర్థులదేనని వ్యాఖ్యలు 
  • దాడిని తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌
  • జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, బెంగాల్‌ సీఎం మమత ఆకాంక్ష 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement