jenasena
-
జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు
-
ఈ ‘బరితెగింపు’.. ఎల్లో మీడియాకు కనబడలేదా?
ఏమిటి ఈ బరి తెగింపు.. ఏమిటీ అరాచకం. చివరికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలిపెట్టరా! ఏపీలో జరుగుతున్న దుష్టపాలనకు ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున భాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం. అక్కడే ఉన్న పార్కు, లైబ్రరీ అంతా ఒక విజ్ఞాన సంపదగా ఉన్న టూరిస్టు స్పాట్‌పై గురువారం రాత్రి దాడి జరగడం అత్యంత శోచనీయం.ఏపీ సమాజంలో అశాంతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి మరింత ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు గవర్నర్ బంగళా, మరో వైపు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్న విజయవాడ స్వరాజ్మైదాన్లోని అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడికి సాహసించారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉందన్న అనుమానం సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడానికి జరిగిన యత్నం చూస్తే ఇది టీడీపీ అల్లరి మూకల పనేనన్న సంగతి అర్ధం అవుతుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల ప్రమేయంతోనే ఇలాంటి నీచమైన అకృత్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. అంబేద్కర్‌ను దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన పట్ల మానవ సమాజం ఎంత అభిమానంతో ఉండేదో తెలుస్తుంది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రావడం, దానిని ఎక్కడో మారుమూల కాకుండా విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి జగన్ ప్రభుత్వం సంకల్పించి పూర్తి చేసింది. వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి తరలిరాగా, విగ్రహం.. అంబేద్కర్ లైబ్రరీ, పార్కు మొదలైనవాటిని జగన్ ఆవిష్కరించారు.నిత్యం వేలాది మంది అక్కడకు వెళ్లి అనుభూతి పొందుతారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని, ఆయన పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని విజయవాడ వంటి సెంటర్లో కాకుండా, అమరావతిలో ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం చివరికి దానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన. జగన్ ప్రభుత్వం ఏదో కుగ్రామంలో కాకుండా, విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితంగా ఉంటుందని భావించింది. స్వరాజ్మైదాన్ను అటు అంబేద్కర్ కేంద్రంగాను, ఇటు పార్కు, వాకింగ్ ట్రాక్ మొదలైనవాటితో టూరిస్టు స్పాట్‌గా అభివృద్ది చేయాలని ప్లాన్ చేసి సుమారు రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసింది.సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ను అంతా చూసుకుంటారు. పేదల గుండెల్లో, ప్రత్యేకించి దళితుల హృదయాలలో ఆయన కొలువై ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. స్వరాజ్మైదాన్ను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చైనా మాల్గా మార్చాలని ప్రయత్నించింది. కాని విజయవాడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ముందుకు వెళ్లలేదు. జగన్ ప్రజలందరికి ఉపయోగపడేలా దానిని తీర్చిదిద్దారు. అంతే కాక అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రాజకీయం జరిగింది.తొలుత అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కోనసీమ జిల్లా అని పేరు పెట్టగా దళితవర్గాలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఆందోళనలకు దిగాయి. ఆ ఉద్యమంలో టీడీపీ, జనసేన వంటివి కూడా పాల్గొని దళితవర్గాలను రెచ్చగొట్టాయి. జగన్ ప్రభుత్వం అందరి అభిప్రాయాల మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జత చేసింది. అప్పుడు ఇదే టీడీపీ, జనసేన నేతలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించాయి. చివరికి అప్పటి మంత్రి, ఒక ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టి అరాచకానికి పాల్పడ్డాయి. టీడీపీ, జనసేనలు డబుల్‌గేమ్ ఆడినా జగన్ ప్రభుత్వం నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్లింది. దాని వల్ల వైఎస్సార్సీపీకి కొంత నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాతకాలంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టారు.విజయవాడకు ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నా విగ్రహం కనబడుతుంటుంది. అలాంటి టూరిస్ట్ స్పాట్ పై టీడీపీకి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా ఉంది. అంబేద్కర్ కేంద్ర సిబ్బంది నుంచి సెల్ పోన్లు లాక్కుని మరీ టీడీపీ కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. ఈ విగ్రహాన్ని ప్రారంబించిన జగన్ పేరు అక్కడ ఉండడం వారికి నచ్చలేదు. అంతే ఆ అక్షరాలను పీకేశారట. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమాచారం అంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం శోచనీయం. టీడీపీ గూండాలు హత్యలు, దాడులు, విద్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి-చూడనట్లు ఉండడం, పైగా వాటిని ప్రోత్సహించే విదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ రౌడీలకు అడ్డు, ఆపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.ఇక తెలుగుదేశం మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి. చివరికి ఆంద్రజ్యోతి మీడియా ఈ దాడిని సైతం సమర్ధించే రీతిలో కదనాలు ఇస్తోందంటే అది ఏ రకంగా తయారైంది అర్థం చేసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వారు ఎంత అరాచకం చేసినా కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. ఆయనకు పదవి రావడం పరమాన్నంగా మారింది. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. గతంలో ఎప్పుడూ ఇలా విగ్రహాలపై, శిలాఫలకాలపై ఏ రాజకీయ పార్టీ దాడి చేయలేదు. ఒక్కడైనా ఒకటి, అరా జరిగినా, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం, జగన్ పేరు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న శిలాఫలకాలను ద్వసం చేయడం వంటి అల్లర్లతో టీడీపీ అరాచక శక్తులు రెచ్చిపోయాయి.గుంటూరులో స్వయంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేనే గుణపం పట్టుకుని శిలాఫలకాన్ని కూల్చుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ ఆద్వర్యంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా టీడీపీ గూండాలు ద్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలు నీచంగా వ్యవహరిస్తుంటే నిరోధించవలసిన నాయకత్వం వారిని ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తూ వచ్చింది. టీడీపీ దళిత నేతలు సైతం నోరు విప్పడం లేదు. గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎవరైనా కొద్దిపాటి అపచారం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. అలా వార్తలు ఇవ్వడం తప్పు కాదు. ఏ నాయకుడి విగ్రహంపైన ఎవరూ దాడులు చేయకూడదు. కాని వైఎస్ విగ్రహాలను ద్వంసం చేసినా, చివరికి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రముఖంగా వార్త ఇవ్వలేదంటే వారు ఏ స్థాయికి దిగజారింది అర్ధం చేసుకోవచ్చు.టీడీపీ మీడియాలో ఈ ఘటనలు రిపోర్టు చేయకపోతే, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు, టీడీపీ మీడియా మాఫియా మాదిరి ప్రవర్తిస్తున్న తీరు ఏపీ బ్రాండే ఇమేజీని నాశనం చేస్తున్నాయి. చంద్రబాబు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోకపోతే మానే, ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు. ఇదంతా ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నలలో జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడితే, అప్పటి సీఎం పేరును, మంత్రుల పేర్లను ఫలకాల నుంచి తొలగించి ఆనందపడితే, భవిష్యత్తులో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు ఇదే పరిస్తితి వారికి ఎదురు కాదా అన్న ప్రశ్న వస్తుంది. కాని సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు అనుభవం అవుతున్నా, టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘సీఎం జగన్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది’
06:15 PM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి దారుణం: కేశినేని నాని అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు దీని వెనుక పెద్ద కుట్ర ఉంది బోండా ఉమా రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు దాడికి చంద్రబాబు, లోకేష్, బోండా ఉమానే కారణం విజయవాడలో అల్లర్లు సృష్టించాలన్నదే చంద్రబాబు కుట్ర దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలి 05:50 PM, April 14th 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ హరికృష్ణ నేతృత్వంలో ఆరుగురు ఏసీపీలతో టాస్క్‌ఫోర్స్ ఘటనా స్థలంలో ఇప్పటికే పలు దఫాలు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు, సెల్ టవర్ల లోకేషన్ల ఆధారంగా పోలీసుల విచారణ ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు 05:46 PM, April 14th 2024 సీఎం జగన్‌పై అక్కసుతోనే దాడికి పాల్పడ్డారు: వెల్లంపల్లి జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు సీఎం జగన్‌కు తీవ్ర గాయమైంది నా కంటికి కూడా గాయమైంది టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు, బోండా ఉమా రౌడియిజానికి తెరలేపారు అధికారం లేనప్పుడే వాళ్లు ఇలా చేశారు రేపు వాళ్లకు అధికారం ఇస్తే ఏమవుద్ది.. ఆలోచించండి ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి దాడులకు తెగబడటం దారణం చంద్రబాబు ఎందుకు ఇంత దిగజారిపోయారు చంద్రబాబు హయాంలోనే వంగవీటి రంగ హత్య జరిగింది దేవుడి ఆశీస్సుల వల్లే సీఎం జగన్‌కు ప్రమాదం తప్పింది ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి 05:18 PM, April 14th 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన: ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సీఈవోతో సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైఎస్సార్సీపీ నేతల భేటీ సీఎంపై దాడి వెనుక కుట్ర కోణం ఉందన్న వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం జగన్ ఎడమ కన్నుపై దాడి జరిగింది రాజకీయాలకు అతీతంగా పలు రాష్ట్రాల నేతలు ఖండించారు ఈ ఘటనను ప్రధాని సహా అందరూ ఖండించారు విపక్ష నేతలు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు దాడి ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు హేయం ఈ దాడి పథకం ప్రకారమే జరిగినట్టు స్పష్టం అవుతోంది ఆబ్జెక్ట్ చాలా ఫోర్స్‌తో జగన్ కంటిపై తగిలి వెల్లంపల్లి కంటికి తగిలింది కొంచెం ఉంటే వెల్లంపల్లి కన్నుపోయేది షార్ప్ షూటర్ గురి తప్పకుండా ఏదైనా ఎయిర్‌గన్ నుండి షూట్ చేసినట్టు తెలుస్తోంది పవర్ ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇది చేయలేరు ఈ అంశాలన్నీ ఈసీ దృష్టికి తీసుకెళ్లాం చంద్రబాబు, టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని ఈసీని కోరాం 05:07 PM, April 14th 2024 ఎన్టీఆర్ జిల్లా: ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సీఎం జగన్‌పై దాడిని నిరసిస్తూ జగ్గయ్య పేట బైపాస్ రోడ్డుపై నల్ల జెండాలతో నిరసన పాల్గొన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, వైఎస్సార్సీపీ శ్రేణులు ఏపీలో సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు అండ్ కో రాళ్ల దాడి చేయిస్తున్నారు సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకోవడం చంద్రబాబు తరం కాదు సీఎం జగన్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యం, రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడే ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఓటమి పాలు అవుతుంది. ప్రజలు చంద్రబాబు ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. దాడిపై ఉన్నత స్థాయి కమిటీలతో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. 03:40 PM, April 14th 2024 విశాఖ: టీడీపీ నేతలకు దాడులు చేయడం కొత్త కాదు: వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్‌ను అంతమొందించాలని కూటమి నేతలు చూస్తున్నారు దాడులు అనేది టీడీపీ నేతల సంస్కృతి సీఎం జగన్ పై రాయితో చేసిన దాడి కాదు ఎయిర్ గన్ లాంటి బలమైన వస్తువుతో హత్యాయత్నం చేశారు 2019 ఎన్నికలకు ముందు ఇదేవిధంగా హత్యాయత్నం చేశారు సీఎం ప్రాణాలను కాపాడుకునే పనిలో మేముంటే, స్క్రిప్ట్‌లు రాసుకునే పనిలో టీడీపీ నేతలు ఉన్నారు వారే హత్యాయత్నానికి పాల్పడి వారే మళ్లీ మా పైన నెపం నెడుతున్నారు టీడీపీ నేతలకు దాడులు చేయడం కొత్త కాదు గతంలో కుటుంబ సభ్యులతో వచ్చిన అమిత్ షా పై రాళ్లదాడికి టీడీపీ నేతలు తెగబడ్డారు కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల దీవెనలు సీఎం జగన్ కు ఎన్నడూ ఉంటాయి 03:29 PM, April 14th 2024 విజయవాడ: సీఎం జగన్ పై దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలోనే ఉన్నాము సాక్షి టీవీతో ప్రత్యక్ష సాక్షి, డాబా కొట్టుల సెంటర్ నివాసి మహమ్మద్ షఫీ సింగ్ నగర్ ఫ్లై ఓవర్ నుండి ఆయనను ఫాలో అయ్యాము దాడికి పాల్పడిన వ్యక్తి దొరికి ఉంటే మహిళలే అతనికి తగిన శాస్తి చేసేవారు సీఎం కు దెబ్బ తగలగానే మహిళలంతా దాడి చేసిన వ్యక్తిని దూషించారు సీఎం జగన్ తో పాటే వెల్లంపల్లికి దెబ్బ తగలడం స్పష్టంగా కనిపించింది బలమైన దెబ్బ తగలగానే సీఎం జగన్ ఎంతో బాధకు గురయ్యారు సీఎం బాధకు లోనవడం మేమంతా స్పష్టంగా చూశాం 02:45 PM, April 14th 2024 తాడేపల్లి : సీఎం జగన్‌పై దాడి దుర్మార్గపు చర్య : ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీలోని పెద్దల ప్రోత్సాహం లేనిదే సీఎంపై దాడికి దిగలేరు దాడులకు పాల్పడాలనే ఆలోచనలే అమానుషం ఎన్ని కుట్రలు పన్నినా మళ్ళీ సీఎం జగనే భగవంతుడు, ప్రజలే జగన్‌ని కాపాడుకుంటారు 02:40 PM, April 14th 2024 విజయవాడ సీఎం వైఎస్ జగన్‌పై హత్నాయత్నం చాలా దారుణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సింగ్ నగర్ గంగానమ్మగుడి వద్ద వివేకానంద సెంటినరీ హైస్కూలు ప్రాంతంలో మల్లాదివిష్ణు పరిశీలన రాజకీయమనగా సీఎం వైఎస్ జగన్ ని ఎదుర్కోలేక హత్నాయత్నానికి పాల్పడ్డారు సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది సీఎంపై హత్యాయత్నం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉంది సీఎం వైఎస్ జగన్‌పై గత కొన్ని రోజులగా చంద్రబాబు చేస్తున్న దారుణ వ్యాఖ్యలు.. రెచ్చగొట్టే మాటలు చేస్తున్నాం ఇప్పటికే ఆధారాలతో చంద్రబాబు తీరుపై ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేశాం సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేస్తాం 02:26 PM, April 14th 2024 సీఎం జగన్ మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు ప్లాన్ ప్రకారం దాడి చేసినట్టు పోలీసుల ప్రాథమిక నిర్థారణ క్లూస్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం ఏసీపీ స్థాయి అధికారులతో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు 02:12 PM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి వెనక టీడీపీ: మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. వారిలా మేము కూడా సహనం కోల్పోతే.. టీడీపీ వారు రోడ్లపై తిరగగలరా..? నేను ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు దాడి జరిగిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర ఓ సారి పరిశీలించాలి టీడీపీ సోషల్ మీడియాలో చేసే పోస్టులు వారి నైజాన్ని తెలియజేస్తుంది సీఎం జగన్ ప్రజలను నమ్ముకున్నారు ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సీఎం జగన్ ను ఏమీ చెయ్యలేరు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది.. 02:04 PM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన కామెంట్స్ సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారు పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగింది చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు దాడులు జరిగాయి నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టాలని చెప్పాడు చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో దాడి చేశారు చాలా పకడ్బంధీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్‌తో దాడి చేశారు ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్నుకు తగిలింది దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్‌తో గాయంతో బయటపడ్డారు దీన్ని ఖండించాల్సిన కొందరు వ్యక్తులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు ఎన్నికల సందర్బంగా గుర్తింపు పొందిన తొమ్మిది సంస్థల సర్వేల్లో వైఎస్సార్సీపీకి భారీ మోజార్టీలు వస్తాయని చెప్పాయి. దీంతో, సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఇలా చేశారు విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి ఇలా దాడి చేశాయి ఒక సీఎం ప్రాణాలు తీయడానికే ప్రయత్నం జరిగిందంటే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉంది ఎంతో పక్కగా దాడి చేయబట్టే సీఎం జగన్‌కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలింది ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు పగలైనా, రాత్రి సమయంలోనైనా కరెంట్ తీసేస్తారు? ఈ విషయం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా? చంద్రబాబు బస్సుపై రోడ్ షోలు చేసేటప్పుడు కరెంట్ తీయలేదా? సీఎం జగనే కరెంట్ తీయించారని టీడీపీ నేత పిచ్చివాగుడు వాగుతున్నారు అధికారులపై యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నాడ సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను 01:30 PM, April 14th 2024 సీఎం జగన్‌పై రాళ్ల దాడి దారుణం.. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఘటనను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారు.. ఇది పిరికిపందల చర్య కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేది ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు ఎయిర్‌గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారు ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారు ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెబుతారు ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడారు కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరు ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదు. పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఇలా మాట్లాడతారా?. ప్రతీ చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారు నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్‌కు లేదు సింపతీతో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగింది చంద్రబాబు కూడా అందుకే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు కొట్టండి అంటూ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు అధికారం రాదన్న అసహనంతో ఇలా రెచ్చగొడుతున్నాడు చంద్రబాబు రాజకీయ సిద్దాంతంలోనే ద్వేషం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం ఉన్నాయి. చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేతికి కట్టుతో వెళ్లి పాల్గొన్నాడు కానీ చంద్రబాబు డ్రామాలకు ప్రజలు బుద్ధి చెప్పారు చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తాడో దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఒక పుస్తకంలో రాశాడు సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని ఉన్న నాయకుడు ప్రజలతో ఇలానే మమేకం అవుతూ ముందుకు సాగుతారు 12:13 PM, April 14th 2024 సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ రెండు రకాలుగా దాడి జరగొచ్చని పోలీసులు అనుమానం వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య నుంచి రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం మరో వైపు వివేకానంద స్కూల్ నుండి దాడి చేసి ఉండొచ్చని అనుమానం తెరుచుకుని ఉన్న వివేకానంద స్కూల్లోని కొన్ని కిటికీలు వాటి నుండి ఎయిర్ గన్స్ తో క్యాటర్ బాల్ తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం దీంతో స్కూల్ నుండి దాడి జరగొచ్చన్న కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు స్కూల్‌కి గుడికి మధ్య నుండి చెట్ల మధ్య నుండి దాడి జరగొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు కుడివైపు జన సమూహం ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుండి దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం పూర్తిగా చీకటిగా, చెట్లు ఉండడంతో ఎవరికీ కనిపించని నిందితుడు దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానం కేవలం 20 నుండి 30 అడుగుల దూరం నుండే సీఎం జగన్ ని టార్గెట్ చేసిన టీడీపీ గుండాలు సీఎం జగన్‌ని బలంగా కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే దాడి 10:44 AM, April 14th 2024 సీఎం జగన్ పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్‌కి తగిలిన వెంటనే నాకు గాయమైంది ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు నాకు కను గుడ్డు మీద రేష్ అయ్యింది నాకు విపరీతంగా నొప్పి వస్తోంది సీఎం జగన్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకి ఫిర్యాదు చేశాను పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారించాలి చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు సీఎం జగన్ పైన ఈరోజు కుట్ర చేశాడు సిగ్గులేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే అలిపిరి బాంబు దాడిలో ఒక చేతికి గాయమైతే.. మరో చేతికి కట్టు కట్టించుకుని డ్రామా ఆడింది చంద్రబాబు కాదా స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయితే ఒంటి నిండా జబ్బులు ఉన్నాయని డ్రామా ఆడింది చంద్రబాబు కాదా ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని జైలులో పెడితే ఫైల్స్ ఉన్నాయని డ్రామా ఆడాడు వాళ్లు మా ముఖ్యమంత్రిని విమర్శిస్తారా? టీడీపీ నాయకులు నెల రోజుల్లోనే దీనికి మూల్యం చెల్లించక తప్పదు 10:54 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ మంత్రి రోజా రోడ్డుపై నిరసన పుత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మంత్రి ఆర్కే రోజా దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు పై చర్యలు తీసుకోవాలి సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర దాడి చేయించారు చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి 10:47 AM, April 14th 2024 లోకేష్, అచ్చెన్నాయుడు నోరు అదుపులోకి పెట్టుకోవాలి: ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బస్సు యాత్రలో సీఎం జగన్‌కి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు ఎన్టీఆర్ పై చెప్పులు, అమీత్ షా పై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుది నాకు తెలిసి రాజకీయాల్లో అత్యంత ధైర్యశాలి సీఎం జగన్ దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలి 10:30 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి పిరికపంద చర్య: వైఎస్ అవినాష్‌రెడ్డి సీఎం జగన్‌పై దాడిని ఖండించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విజయవాడ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రోడ్‌షో జరిగింది జగన్ వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు రోడ్ షోకు ఆటంకం కలిగించేందుకు దాడికి పాల్పడ్డారు. 10:20 AM, April 14th 2024 సీఎం జగన్‌పై జరిగిన దాడి వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నాడు అధికారం కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు 10:15 AM, April 14th 2024 సీఎం జగన్‌పై పథకం ప్రకారమే దాడి: వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలి దాడి చేసిన వెంటనే చంద్రబాబు మార్క్ రాజకీయం మొదలు పెట్టారు.. సీఎంపై దాడిని కూడా డ్రామా అనడం బాబు నైజం విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకు వస్తాయి.. 9:58 AM, April 14th 2024 కుట్ర కోణంలోనే సీఎం జగన్‌పై దాడి: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాడి ఘటనను కూడా టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారు దాడి తీవ్రత పెద్దదైనప్పటికీ.. సీఎం జగన్ మొక్కవోని సంకల్పంతో యాత్రను కొనసాగిస్తున్నారు ప్రజల్లో ఆదరణ కలిగిన వంగవీటి రంగాను సైతం చంద్రబాబు హత్య చేయించారు ప్రజల్లో సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక చంద్రబాబు, పవన్ ఈ తరహా దాడులకు పాల్పడ్డారు 9:50 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి అత్యంత భయానకం: మంత్రి మేరుగ నాగార్జున అదృష్టవశాత్తూ సీఎం ప్రాణాలతో బయటపడ్డారు సీఎం జగన్‌ను మట్టుబెట్టడానికే పక్కా ప్లాన్‌తో దాడి చంద్రబాబు రక్తచరిత్రలో ఇదో టైప్ హత్యాయత్నం దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉంది.. ఆ కోణంలోనే విచారణ జరపాలి సీఎం పై జరిగిన దాడి కేసును అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ విచారణ జరపాలి ఎల్లో మీడియా పిచ్చి రాతలు మానుకోవాలి 9:48 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి: మంత్రి వేణు పేదవాడిని సమర్థించే వ్యక్తిని దెబ్బతీయటానికి ప్రతిపక్షాలు చేసిన కుట్ర ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూడలేకే దాడులకు పాల్పడుతున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాల కుట్రలతో సీఎం జగన్‌కు మరింత ప్రజాదరణ పెరుగుతుంది జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి 9:46 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ తిరుపతిలో భూమన నిరసన దీక్ష సీఎం జగన్‌పై దాడిని ఖండించిన భూమన కరుణాకర్‌రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్ హత్య రాజకీయాలు నశించాలి రెండు మూడు నెలలు నుంచి సీఎం జగన్‌ను అంతం చేస్తామన్న మాటలు నిజం చేస్తున్నారు చంద్రబాబు హస్తాలు రక్తసిక్తమైనవి వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడు సీఎం జగన్‌ను అంతం చేయాలనే లక్ష్యంగా ఈ దాడి చేశారు 9:11 AM, April 14th 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్లూస్ టీం ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుంచి దాడి జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారించిన పోలీసులు 30 అడుగులు దూరం నుంచి దాడి చేసిన ఆగంతకుడు 9:01 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడిని ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోకేష్ వ్యాఖ్యలను గమనిస్తే దాడికి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తుంది ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్‌పై దాడి చేశారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారు సిద్దం సభలు, బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదు లోకేష్ ట్విట్టర్లో 2019 లో కోడి కత్తి, 2024లో రాయి దాడి అని పెట్టారు అయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతుంది ఎవరైనా రాయితో దూరం నుంచి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా? అదే రాయిని లోకేష్‌కి ఇస్తాం, అదే ప్రాంతంలో బస్సు ఎక్కి ఎవరితో అయినా రాయితో కొట్టించుకోవాలి అప్పుడు కరెక్ట్‌గా ప్లాన్ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యం అవుతుందో లేదో తెలుస్తుంది ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం గతంలో పాదయాత్రకు గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోందన్నారు కృష్ణా జిల్లా ఇంచార్జ్‌గా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశాం మళ్లీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో స్పందన రావడంతో ఈ కుట్రకు తెరలేపారు 8:10 AM, April 14th 2024 పాఠశాల నుంచే దాడి? దాడి జరిగిన ప్రాంతానికి 20 అడుగుల దూరంలోనే వివేకానంద స్కూలు మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉన్నట్లు గుర్తింపు పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే సెంట్రల్ టీడీపీ ఆఫీసు ఓ టీడీపీ నేత అనుచరుల వద్ద ఎయిర్‌గన్ వంటి మారణాయుధాలు 7:32 AM, April 14th 2024 సీఎం జగన్‌పై దాడి: స్పందించిన ప్రధాని మోదీ.. వైఎస్సార్సీపీ నేతలు.. జగన్ త్వరగా కోలుకోవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను -‘ఎక్స్’లో ప్రధాని మోదీ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను- స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై దాడి గురించి విని షాక్ అయ్యా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నా-మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హింసకు తావు లేదు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కఠినమైన ముందస్తు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. జగనన్నా.. జాగ్రత్తగా ఉండండి-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడి చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగింది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే దాడి చేస్తున్నారు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ కలిసినా జగన్‌ను ఏమీ చేయలేకపోతున్నామని, చివరికి దాడులకు పాల్పడుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలతో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు- మంత్రి అంబటి రాంబాబ ఓటమి భయంతోనే సీఎం జగన్‌పై దాడి ఓటమి భయంతోనే సీఎం వైఎస్ జగన్‌పైన టీడీపీ దాడులకు తెగబడుతోంది. సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుండటాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి ఇలాంటి దాడులకు, ఉడత ఊపులకు సీఎం భయపడరు రాజకీయంగా జగన్‌ను ఒంటరిగా ఢీకొట్టలేని టీడీపీ.. జనసేనను, బీజేపీని వెంట తెచ్చుకుంది- తానేటి వనిత, హోం శాఖ మంత్రి 7:13 AM, April 14th 2024 నేడు బస్సు యాత్రకు విరామం విజయవాడలో సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటర్లో టీడీపీ మూకల దాడిలో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై బలమైన గాయం వైద్యుల సలహా మేరకు ఆదివారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం తదుపరి షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటిస్తామని వైఎస్సార్సీపీ వెల్లడి 7:05 AM, April 14th 2024 వ్యూహం కాదిది.. ద్రోహం! కూటమిలో త్యాగం చేయాల్సి వస్తే బలవుతున్నది బీజేపీ, జనసేనే చంద్రబాబు, ఆయన బంధువర్గంలో మాత్రం అందరికీ టికెట్లు రాత్రికి రాత్రి వచ్చేవారిని కూడా.. అటూ ఇటూ పంపిస్తున్న బాబు ‘పచ్చ’ నేతలకు టికెట్లిచ్చి సొంత నేతలకు బీజేపీ, జనసేన ద్రోహం ప్రకటించిన వారిని కూడా బాబు ఆదేశాలతో మార్చేస్తున్న తీరు ఆఖరికి మాజీ సైనికుడికి ఇచ్చామంటున్న అనపర్తిపైనా బాబు కన్ను ఆ సీటును బీజేపీ నుంచి తీసుకోవటానికి ఎత్తుగడ.. వదినమ్మ ఓకే! బాలకృష్ణ వియ్యంకుడి కోసం విశాఖ నుంచి బీజేపీని పంపేసిన వైనం అనకాపల్లి ఇచ్చి.. అది తన బంటు సీఎం రమేశ్‌కే వచ్చేలా ఎత్తుగడ మొదటి నుంచీ బీజేపీని నమ్ముకున్న అగ్రనేతలకూ మొండిచెయ్యి జనసేనకు ఇచ్చిన సీట్లలో 70 శాతం టీడీపీ, ఇతర పార్టీల వారికే ఆరణి శ్రీనివాసులను బాబే పంపినట్లు తిరుపతిలో చెప్పిన పవన్ బాబు మార్కు రాజకీయాలతో కుదేలవుతున్న బీజేపీ, జనసేన శ్రేణులు అందుకే ఆగ్రహంతో వరసగా రాజీనామాలు 6:56 AM, April 14th 2024 జగన్‌కు భద్రత పెంచాలి: ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి ఇది కూటమి కుట్రే.. ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దాడులు కుట్రలు, కుతంత్రాలు పన్నినా జగన్‌ను ఎదుర్కొనటం సాధ్యం కాదు నువ్వు నిజంగానే సీఎం @ysjagan గారిపై జరిగిన దాడిని ఖండిచాలనుకుంటే మీ టీడీపీ అధికారిక అకౌంట్ నుంచి ఇంత నీచంగా ఎందుకు పోస్ట్ చేపించావ్ @ncbn? దాడి జరిగిన వెంటనే వరుసపెట్టి ఇంత నీచంగా మీ పార్టీ అకౌంట్ లో పోస్ట్ చేయించడం వెనుక నీ ఉద్దేశం ఏంటి చంద్రబాబూ? pic.twitter.com/mesAPqD7AF — YSR Congress Party (@YSRCParty) April 13, 2024 6:55 AM, April 14th 2024 ధ్వంస రచనే కూటమి కుతంత్రం సీఎం జగన్‌పై దాడి వెనుక చంద్రబాబు ముఠా భారీ కుట్ర ముందస్తు పన్నాగంతోనే పోలీసు అధికారులపై ఫిర్యాదులు పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొనే లక్ష్యం తద్వారా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహ రచన అందులో భాగంగానే ఐపీఎస్‌లపై పురందేశ్వరి ద్వారా చంద్రబాబు ఫిర్యాదు ఎవర్ని నియమించాలో కూడా చెప్పిన పచ్చ ముఠా తీవ్రంగా స్పందించిన అధికారులు.. పారని బాబు పాచిక దాంతో సీఎం యాత్రలో దాడులకు కుతంత్రం తద్వారా శాంతిభద్రతల సమస్య సృష్టించే కుట్ర దెబ్బ తగిలినా చిరునవ్వుతో సీఎం జగన్ శాంతి సందేశం సీఎం జగన్ సందేశంతో సంయమనం పాటించిన వైఎస్సార్సీపీ శ్రేణులు బెడిసికొట్టిన చంద్రబాబు కూటమి కుతంత్రం వైద్యులు సూచనల మేరకు కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళిన సీఎం @ysjagan. జగనన్న కు తగిలిన గాయాన్ని పరిశీలించి కుట్లు వేసిన వైద్యులు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందకండి, దయచేసి అందరూ సంయమనం పాటించండి. 🙏🏻 pic.twitter.com/L44H0sTSsY — YSR Congress Party (@YSRCParty) April 13, 2024 6:53 AM, April 14th 2024 సీఎం జగన్‌పై హత్యాయత్నం! సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర వారధి దాటిన దగ్గర్నుంచీ అడుగడుగునా జనం నీరాజనాలు రాత్రి 8.10 సమయంలో సింగ్‌నగర్‌లో జగన్ టార్గెట్‌గా దుశ్చర్య పథకం ప్రకారం ఒక స్కూల్ రెండో అంతస్తులో దాక్కున్న ఆగంతకుడు అక్కడి నుంచి జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగటంతో.. తప్పిన గురి కనుబొమపై తీవ్ర గాయం.. పక్కకు తూలి.. గాయాన్ని అదిమి పట్టుకున్న జగన్ జనానికి అభివాదం చేస్తూనే బస్సులోకి.. ఆ వెంటనే ప్రథమ చికిత్స అనంతరం గాయంతోనే యాత్రను కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్ కనుబొమ పైన తగిలాక.. పక్కనున్న వెలంపల్లికీ గాయం ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి... పలు రకాలుగా నిపుణుల వ్యాఖ్యలు రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్... ఏదైనా కావచ్చని వ్యాఖ్యలు ఆ వేగాన్ని బట్టి చూస్తే.. అది కచ్చితంగా హత్యాయత్నమేనన్న వెలంపల్లి ఈ దురాగతానికి పాల్పడింది చంద్రబాబు నాయుడేనంటూ విమర్శలు ‘టప్’మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఎంపీ కేశినేని నాని షెడ్యూలు ప్రకారం రాత్రి 10.38 వరకూ సాగి... ముగిసిన యాత్ర అనంతరం నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోకల్ అనస్తీషియా ఇచ్చి.. కుట్లు వేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని జగన్‌కు సూచన.. నేడు యాత్రకు విరామం దాడిని.. బాబు వైఖరిని మూకుమ్మడిగా ఖండించిన వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసనలు ప్లాన్ చేసి చేయాల్సిన అవసరం రాజకీయ ప్రత్యర్థులదేనని వ్యాఖ్యలు దాడిని తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమత ఆకాంక్ష -
April 13th : ఏపీ ఎన్నికల సమాచారం..
April 13th AP Elections 2024 News Political Updates.. 08:40PM, April 13th 2024 నెల్లూరు: నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోటంరెడ్డి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ద్వజం రూరల్ నియోజకవర్గ ప్రజలను పీడించి.. బిల్డర్స్ ను బెదిరించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపాటు ఎన్నికల సమయంలో కోటంరెడ్డి.. జిమ్మిక్కుల రాజకీయం చేస్తారని.. ప్రజలెవ్వరు నమ్మొద్దని విజ్ఞప్తి. 08: 15PM, April 13th 2024 ఏలూరు జిల్లా: నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై ముద్ర బోయిన వెంకటేశ్వరరావు ఫైర్ నేను వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయానని పార్థసారథి వ్యాఖ్యానించటం పద్ధతి కాదు ఇప్పుడు నువ్వు టీడీపీకి, గతంలో నీ తండ్రి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అమ్ముడుపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పార్థసారథి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజలే నీకు బుద్ధి చెబుతారు నా కార్యకర్తలని ఫోన్లో బెదిరించటం పద్ధతి కాదు ఇద్దరం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పెనమలూరులో గాని నూజివీడులో గాని పోటీ చేద్దాం రా రెండు చోట్ల నా మీద ఒక ఓటు ఎక్కువ వచ్చినా నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా మళ్లీ నా కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటి ముందు బైఠాయిస్తా 03: 15PM, April 13th 2024 తిరుపతి జిల్లా: తిరుపతిలో వైఎస్సార్పీపీలోకి భారీగా చేరికలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరిన బిజేపి నాయకులు, నగర యువత తిరుపతి 19వ డివిజన్లోని బీజేపీ నాయకులు, నగర యువత పద్మావతీపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూమన అభియన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుపతి నగరాభివృద్ధిని చూసి వారంతా వైఎస్సార్సీపీలో చేరారు 02: 25PM, April 13th 2024 బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని లేఖ రాశావు మర్చిపోయావా చంద్రబాబు: మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రలోభాలు పెట్టి బీసీలను లొంగ తీసుకోవాలనుకున్నావు కులగణన పూలే జయంతి నాడు ప్రకటించాం... సజావుగా పూర్తి చేస్తాం.. కులగణన వివరాలు ప్రజలకు పంపిస్తాం కమిషన్లకు కక్కుర్తి పడి గతంలో నాణ్యత లోపం ఉన్న పనిముట్లను సరఫరా చేసావ్ సామాజిక సాధికారతకు నిలువెత్తు దర్పణం సీఎం జగన్ కులగణనకు భారతీయ జనతా పార్టీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి 02: 10PM, April 13th 2024 విశాఖపట్నం: బొత్స సత్యనారాయణ పాయింట్స్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు వ్యతిరేకమని కూటమి నేతలు చెప్పగలరా స్టీల్ ప్లాంట్‌పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి టిడిపి జనసేన బీజేపీకీ ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే లాబీయింగ్ చేసే సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాను అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడానికి స్థానికంగా ఉన్న బీసీ నేత టీడీపీకి దొరకలేదా వాలంటీర్లపై చంద్రబాబు మాటలు చూస్తుంటే నాలిక తాటిమట్ట అనే విధంగా ఉన్నాయి 02: 00PM, April 13th 2024 వైఎస్ఆర్ జిల్లా: పులివెందులలో షర్మిల, సునీత విమర్శలపై భగ్గుమన్న మహిళా కౌన్సిలర్లు షర్మిల, సునీత విమర్శలను తీవ్రంగా ఖండించిన కౌన్సిలర్లు అక్కచెల్లెల్లు ఇద్దరు కాంగ్రెస్ గెలిస్తే పులివెందులకు ఏం చేస్తారో చెప్పడం లేదు ఎప్పుడు హత్యలు, హంతుకులు అంటూ విమర్శలు చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి అంతేగానీ ఎంపి అవినాష్ రెడ్డి హంతకుడు.. సీఎం వైఎస్ జగన్ కాపాడాడు అంటూ మాట్లాడుతున్నారు షర్మిల ఒక్కరే కాదు.. మేము కూడా వైఎస్ఆర్ కుమార్తెలాంటి వారమే సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి చూడండి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలతో ఆదుకున్నారు రాష్టంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పదకాలు అమలువుతుంటే పధకాలు లేవంటున్నారు? ఎంపీ, సీఎంలపై అపనిందలు మోపడం మానుకోండి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడని అంటున్నారు.. మీరు చూశారా చెప్పండి? మీ లబ్ది కోసం వైఎస్ఆర్ కూతురినని తెలంగాణాకు వెళ్లి పార్టీ పెట్టారు అక్కడ పార్టీ మూసేసి మళ్లీ ఇక్కడికి వచ్చారు మీరు మాట్లాడినంత మాత్రనా ఇక్కడ వినేవారు ఎవరు లేరు మీ నీచపు రాజకీయాలు ఇక్కడ తరం కావు 2024 ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు ఎంపీ అవినాష్‌రెడ్డి 5 లక్షల మెజార్టీతోను, సీఎం వైఎస్ జగన్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం 01: 10PM, April 13th 2024 కాకినాడ జిల్లా కాకినాడ: మిధున్ రెడ్డి, రిజినల్ కోఆర్డినేటర్ కామెంట్లు పిఠాపురంలో వంగా గీతా బలమైన అభ్యర్ధి పవన్ కళ్యాణ్ రాకముందే ఆమె అక్కడ అభ్యర్ధిగా ఉన్నారు గతంలో ఎమ్మెల్యే గా వంగా గీతా పని చేశారు... నిత్యం ప్రజల్లో ఉంటారు యిబ్బందులు వస్తే ఎవరూ అందుబాటులో ఉంటారు అని ప్రజలు కోరుకుంటారు పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దత్తు ఇస్తారు పవన్ కళ్యాణ్ ను వాళ్ళ క్యాడరే చేరుకోలేరు ఆయన ఎక్కడ ఉండాడో తెలియదు.. ఎప్పుడు వస్తాడో తెలియదు పిఠాపురం పై మేము ప్రత్యేక దృష్టి పెట్టానవసరం లేదు 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి పిఠాపురం లో వైఎస్ఆర్ సిపి బలంగా ఉంది పిఠాపురంలో కష్టపడుకొవాల్సింది పవన్ కళ్యాణ్ డబ్బులకు ప్రజలు ఓట్లు వెయ్యరు నా సీటు నాకు ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ఇంత వరకు నేను పిఠాపురం లో అడుగు పెట్టింది లేదు తాను ఓడిపోతే చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు పవన్ కళ్యాణ్ కోసం పట్టించుకోనవసరం లేదు 01: 00PM, April 13th 2024 విశాఖపట్నం: బొత్స సత్యనారాయణ పాయింట్స్.. జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడని నాయకులు బీసీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ వంటివారు బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇస్తున్నారు మాత్యకారులను ఎమ్మేల్యేలుగా, మంత్రులుగా చేసే ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్ రానున్న ఎన్నికల్లో మత్స్యకారులకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు ఒక మత్స్యకారుడిని రాజ్య సభకు పంపించారు బలహీనవర్గాలంటే చంద్రబాబుకు, పవన్‌కు చిన్న చూపు మాయలు చేసే మాటలు మేము చెప్పము నా రాజకీయ భవిష్యత్తులో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదు మన పార్టీ బలహీనవర్గాల పార్టీ అని జగన్ నాతో అనేవారు 12: 30PM, April 13th 2024 చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి 58 నెలల మన పాలనను మీరు చూశారు గత చంద్రబాబు పాలనను మీరు చూశారు నాయకుడి ఎన్నికలో పొరపాటు చేస్తే మనం చేసేదీ ఏమీ ఉండదు మనం తీసుకునే నిర్ణయం సరైంది అయితే, మన అడుగులు ముందుకు పడతాయి చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు చంద్రబాబు గతంలో 98శాతం హామీలను ఎగ్గొట్టారు ఆప్కోకు కూడా చంద్రబాబు బకాయిలు పెట్టారు ఒక్కరికైనా చంద్రబాబు సెంట్ స్థలం ఇచ్చారా? మనం స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3,706 కోట్లు ఖర్చు చేశాం లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో డబ్బు జమ చేశాం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం 1.06 లక్షల మందికి లబ్ధి జరిగింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేశాం పెన్షన్ రూ.3వేలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది మంగళగిరిలో చేనేతలు ఎక్కువుగా ఉన్నారని, చేనేత మహిళకు సీటు ఇచ్చాం బీసీలు ఎక్కువగా ఉన్నా... చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు ఇవ్వరు 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం చేనేతలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం రెండు ఎమ్మెల్సీలు చేనేతలకు ఇచ్చాం 8 మంది మున్సిపల్ చైర్మన్లు చేనేతలకు ఇచ్చాం 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు నామినేటెడ్ పదవుల్లోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం చేనేత వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలిచాం మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ధి జరిగింది అక్కా చెల్లెమ్మలకు రూ.1530 కోట్ల లబ్ధి నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్ల లబ్ధి టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా 12: 00PM, April 13th 2024 విశాఖపట్నం: వాసుపల్లి గణేష్ పాయింట్స్.. చంద్రబాబుకు జగన్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది సీఎం జగన్ కాలి గోటికి చంద్రబాబు సరిపోడు మత్స్య కారులు తోలు తీస్తానని చంద్రబాబు బెదిరించారు నలుగురు మత్స్య కారులు కు ఎంఎల్ఏ సీట్లు సీఎం జగన్ ఇచ్చారు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తున్నారు మత్స్య కారులను చంద్రబాబు మోసం చేశారు మత్స్య కారులు చంద్రబాబు తోలు తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి 11:30AM, April 13th 2024 చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని చూడలేదు సిఎం శ్రీ వైఎస్ జగన్ కు పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరు జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు ది శ్రీ వైఎస్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అని నెరవేర్చారు 600 హామీలు ఇచ్చి, గెలిచిన వెంటనే మానిఫెస్టో కూడా కనపడకుండా చేశారు బాబు వస్తె జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగానే 2.5 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు 14 వేల కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు దానికి అదనంగా 10 వేల కోట్లు వడ్డీ కావడంతో సిఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఆ రుణాలు చెల్లించారు చంద్రబాబు మన ప్రాంతంలో మొయిస్తున్న మూడు ప్రాజెక్టులు అడ్డుకున్నారు ఎన్నికలు పూర్తి అవగానే ఆ కేసులు గెలిచి మళ్ళీ పనులు చేపడతాం కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బిజెపి నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, రాష్ట్రాన్ని విడగొడతాను అని డిల్లోలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారు హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారు రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తి నేడు బిజెపి నుండి రాజంపేట ఎంపిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు నాకంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మిథున్ భారీ మెజారిటీతో గెలిపించాలి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలని ప్రజలే సిద్దం గా ఉన్నారు ఎమ్మెల్యేగా నన్ను, ఎంపిగా శ్రీ మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా మీ రెండు అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుకుంటున్నా 11:00AM, April 13th 2024 విశాఖపట్నం: విశాఖ సౌత్ నియోజకవర్గంలో మళ్లీ మొదటకి వచ్చిన జనసేన పరిస్థితి వంశీకృష్ణకు వ్యతిరేకంగా సాదిక్ మీడియా సమావేశం మహ్మద్ సాదిక్ జనసేన నేత పాయింట్స్.. సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ వెనకబడి ఉన్నారు వైఎస్సార్సీపీ అభ్యర్థి రాకెట్లా దూసుకు వెళ్తున్నారు వంశీకృష్ణ సౌత్‌లో గెలిచే పరిస్థితి లేదు వంశీకృష్ణను సౌత్ నియోజకవర్గం నుంచి తప్పించాలి సౌత్ నియోజకవర్గంలో స్థానికులకే సీటు కేటాయించాలి వంశీ కృష్ణను అభ్యర్థిగా పెట్టడం వల్ల సౌత్‌లో జనసేన ఓడిపోతుంది 10:30AM, April 13th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సెల్ఫీ ఫోటో కోసం వచ్చిన అభిమానిపై బాలకృష్ణ దురుసు ప్రవర్తన కదిరి నుంచి సైకిల్ రావాలి యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ బాలకృష్ణ తీరుపై మండిపడుతున్న కదిరి వాసులు 10:00AM, April 13th 2024 తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో పచ్చబ్యాచ్(టీడీపీ నాయకులు) బరితెగింపు అభివృద్ధిని చూసి ఓర్వలేక శిలాఫలకాలు ధ్వంసం చంద్రగిరి అక్కగార్ల కాలనీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు వాటి పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్ రోడ్డు శిలాఫలకాలు రాత్రికిరాత్రి సుమారు నాలుగు ఫలకాలను ధ్వంసం చేసిన పచ్చమూకలు మండిపడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు 9:30AM, April 13th 2024 విశాఖపట్నం: వరుదు కళ్యాణి పాయింట్స్.. సీఎం జగన్ ప్రచారానికి విశేషమైన స్పందన లభిస్తోంది ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు ఎన్డీఏ అంటే నారా డిజాస్టర్ ఏలియన్స్‌గా మారింది కాల కూటమి విషంగా చంద్రబాబు, పవన్ పురంధేశ్వరి తయారయ్యారు ఎన్ని కూటములు వచ్చిన సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు వాలాంటిర్లను గంజాయి దొంగలుగా చంద్రబాబు విమర్శించారు 650 హామీలు ఇచ్చి ఒక హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు తల్లిని తిట్టించిన వారితో పవన్ ఎలా కలుస్తారు 9:00AM, April 13th 2024 విజయవాడ షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్‌ను నమ్మవద్దు: వైఎస్ విమలారెడ్డి షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూశాను అవినాష్ హత్య చేయడం ఎవరైనా చూసారా నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు వాళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు.. అతనికి కుటుంబం ఉంది ఏ పాపం చేయని భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి వైఎస్సార్‌ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు జగన్‌పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్‌కి వ్యతిరేకంగా ఉన్నారు రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా వైఎస్సార్ ఉన్నపుడు వివేకానందరెడ్డి కడప చూసుకున్నారు ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు అవినాష్‌పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి ఇదంతా చేస్తున్నారు జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానందరెడ్డి పనిచేశారు ప్రజలంతా సీఎం జగన్‌కి అండగా ఉండాలి మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి అవినాష్‌కు, జగన్‌కు ఓట్లు వేసి గెలిపించాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి 8:30AM, April 13th 2024 చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా: సీఎం జగన్ చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు. మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు. మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని… pic.twitter.com/0HTBkdXBch — YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2024 8:00AM, April 13th 2024 విజయవాడ బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైఖరితో బీజేపీలో మరో కీలకనేత రాజీనామా బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా చందు సాంబశివరావు ఏపీ బీజేపీ పురందేశ్వరి వైఖరి పట్ల బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తులు 7:40AM, April 13th 2024 తిరుపతి గ్రాండ్ రిడ్జి హోటల్ లో రాత్రి బిజెపి నేతలకు చేదు అనుభవం ఉమ్మడి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపుకు సహకరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం బిజెపి నేతల్ని పట్టించుకోక పోవడంతో రాత్రి అలిగి వెళ్లిపోయిన నాయకులు భానుప్రకాష్, శాంతారెడ్డి ఈరోజు ఉదయం 8.30 గంటలకు బిజెపి నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్ తిరుపతి అసెంబ్లీ స్థానం గెలుపుకు సహకరించాలని టిడిపి, జనసేన పార్టీ నాయకులను కోరిన పవన్ పవర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రాకులాట జనసేన, టిడిపి నాయకులును బ్రతిమలాడిన పవన్ తిరుపతి అసెంబ్లీ సీటు చంద్రబాబు స్వయంగా జనసేనకు ఇచ్చారు అని టిడిపి నేతలకు స్పష్టం చేసిన పవన్ ఖంగుతిన్న టీడిపి నేతలు 7:20AM, April 13th 2024 ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే! 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే! 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/LNccqje4Px — YSR Congress Party (@YSRCParty) April 12, 2024 7:00AM, April 13th 2024 నెల్లూరు జిల్లా.. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదు: విజయసాయిరెడ్డి రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి 2024 లో గెలిచిన తర్వాత సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కూడా ముందుంటుంది 2024 -2029 లోపల కందుకూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా కందుకూరులో పరిశ్రమలు తీసుకువస్తాం ఆ బాధ్యత మాదే 6:50AM, April 13th 2024 క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు.. ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. -ఎంపీ వైవీ సుబ్బారెడ్డి #TDPJSPBJPCollapse#TDPAgainistVolunteers#EndOfTDP pic.twitter.com/aNZoTdc6Ij — YSR Congress Party (@YSRCParty) April 12, 2024 6:40AM, April 13th 2024 మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ? పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయి: సీఎం జగన్ మీరే నా స్టార్ క్యాంపైనర్లు.. ప్రతి ఇంటికీ వెళ్లి మంచికి అండగా నిలబడమని కోరాలి చంద్రబాబుకు ఓటు వేయడమంటే.. మరోసారి మోసపోవడమే ఇంటికొస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు, వదినమ్మ వంత పాట ముగ్గురూ కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ 6:25AM, April 13th 2024 వైఎస్సార్సీపీని ఎదుర్కోలేకపోతున్నాం.. మన సభలకు స్పందన లేదు.. ఇలాగైతే ఎలా? కూటమి నేతల తర్జనభర్జన హాజరైన పవన్, బాబు, బీజేపీ ముఖ్య నేతలు కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ 6:20AM, April 13th 2024 ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా లోకేశ్ ఐ ఫోన్ ట్యాపింగ్ అంటూ టీడీపీ కొత్త నాటకం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అసలు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్ చేసే టెక్నాలజీనే లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఫోన్ ట్యాపింగ్, ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబే సిద్ధహస్తుడు 6:15 AM, April 13th 2024 దొరికాడు దొంగ ‘స్కిల్’బెడిసికొట్టి కటకటాల్లోకి.. సీమెన్స్ కంపెనీ ముసుగులో భారీ దోపిడీ కుట్రదారు,లబ్దిదారు చంద్రబాబే A1 చంద్రబాబు అరెస్ట్... అవినీతి నెట్వర్క్ ద్వారాచంద్రబాబు బంగ్లాకు రూ.241కోట్లు రాజమహేంద్రవరంసెంట్రల్ జైల్లో 52 రోజులు సీఐడీ దర్యాప్తుల్లో ఆధారాలతోసహా వెల్లడి 17ఏ కింద చంద్రబాబుకు రక్షణ లభించదన్న సుప్రీంకోర్టు షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు కేజ్రీవాల్ అరెస్ట్ తరహా లోనే చంద్రబాబుపై ఈడీ కన్ను ఇదీ చంద్రబాబు అవినీతి ‘స్కిల్’ 6:00 AM, April 13th 2024 రౌడీఛీటర్ చింతమనేని ..ఇది తప్పన్న పాపానికి మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళతాడొకడు.. అధిక వడ్డీలకు అప్పులిచ్చి,గడువులోగా తీర్చలేదన్న సాకుతో పక్కకు రమ్మంటున్న వారిని వెనకేసుకొస్తాడు ఇంకొకడు.. ప్రకృతిని చెరబట్టడానికే పుట్టామన్నట్లు వ్యవహరిస్తాడు మరొకడు.. చిన్నారులని కూడా చూడకుండా లైంగికంగా వేధించే వెధవలకు అండగా నిలుస్తాడొక దుర్మార్గుడు.. ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదంటే కడుపైనా చేయాలని నిస్సిగ్గుగా, సందేశంగా చెబుతాడో నేత.. ‘అసలు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని స్వయంగా పార్టీ అధినేతే హేళన చేస్తాడు.. ఇలాంటి వాళ్లంతా ప్రజలను ఉద్దరిస్తారట! ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో వీరందరిదీ అందె వేసిన చేయి. ఇలాంటి టీడీపీలో ఒక్కో నేతది ఒక్కో చీకటి చరిత్ర.నేటి నుంచి ఒక్కొక్కరి బాగోతాన్ని‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఎమ్మెల్యే హోదాలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి తహసీల్దార్ వనజాక్షి జుట్టుపట్టి ఈడ్చి దాడి చేసిన వైనం.. చంద్రబాబు హయాంలోనే రౌడీషిట్ అత్యంత వివాదాస్పద రాజకీయ నేతగా ముద్ర ఎస్సీలకు రాజకీయాలు ఎందుకురా.. అంటూ తీవ్ర స్థాయిలో దూషణ పవన్ కళ్యాణ్.. వాళ్ల అన్న చిరంజీవినే గెలిపించలేనివాడు అంటూ వ్యక్తిగత విమర్శలు ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో పోలవరం కుడికాల్వ విధ్వంసం 5 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ మింగిన మహా అవినీతిపరుడు కొల్లేరులోనూ వందల ఎకరాల్లో సొంతంగా అక్రమ సాగు 1,860 ఎకరాల అక్రమ సాగులో అడ్డగోలుగా కమీషన్ల దందా -
మరిదిని కాపాడేందుకే ఢిల్లీకి పురందేశ్వరి: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని, స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ‘‘టెక్నికల్ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు తప్ప.. నేరం చేయలేదని చెప్పడం లేదు. చట్టంలో లొసుగులున్నాయా అని చంద్రబాబు వెతుకులాడుతున్నారు. గతంలోనే అనేక సార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు. సీఐడీ అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసింది.. దొంగ అన్ని సార్లు తప్పించుకోలేడు.. బాబు విషయంలో రుజువైంది’’ అని అన్నారు. ‘‘లోకేష్ దొరికిపోయారని ప్రజలకు అర్థమవుతోంది. ఇన్ని రోజులు లోకేశ్ ఢిల్లీ ఓపెన్ జైలులోనే ఉన్నారు. పురందేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారు. పురందేశ్వరి తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును కాపాడేందుకే పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారు. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలను పురందేశ్వరి ఖండించలేదు. దత్తపుత్రుడు పీకే కాదు కేకే.. కిరాయి కోటిగాడిలా తయారయ్యారు. చంద్రబాబు పార్టీని కాపాడుకునేందుకే పవన్ రాజకీయాలు. అది జనసేన కాదు.. బాబు సేన అని ప్రజలు గమనించారు. కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకే పవన్ పార్టీ పెట్టారు.’’ అని మంత్రి దుయ్యబట్టారు. చదవండి: నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ -
జనసేనకు హైకోర్టు షాక్.. ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరణ
సాక్షి, అమరావతి: విశాఖ జనసేన కార్యకర్తలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. విశాఖ జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలైని పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో తేలుస్తామని వెల్లడించింది. అసలు నిందితుడు కాని మూడో వ్యక్తి ఎఫ్ఐఆర్ను ఎలా సవాలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ప్యాకేజీల పవన్, బాబులతో ఒరిగేదేమీ లేదు: మంత్రి కాకాణి -
ప్యాకేజీల పవన్, బాబులతో ఒరిగేదేమీ లేదు: మంత్రి కాకాణి
సాక్షి న్యూస్, నెల్లూరు: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ లా విన్యాసాలు చేస్తున్నాడని, చంద్రబాబు స్నేహంతో పవన్‌కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు ఓకే చెప్పిన నోటితోనే నేడు పవన్ వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నాడని గుర్తు చేశారు మంత్రి కాకాణి. మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి.. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో జీరో అంటూ దుయ్యబట్టారు. ‘ప్యాకేజీల పవన్‌గా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారు. ఒక్కచోట కూడా ఆయనని ప్రజలు గెలిపించలేదు. నారా వారి రాజ్యాంగంలో విశాఖ ఎయిర్‌పోర్టులోనే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్‌ని పోలీసులు అడ్డుకొన్నారు. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉండబట్టే పవన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చంద్రబాబుకి సుపుత్రుడిపై నమ్మకం లేదు. దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకొని లబ్ధిపొందాలని చూస్తున్నాడు.. 2024లో కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదు. చంద్రబాబు, పవన్ లాలూచీ వల్ల ఒరిగేదేమీ లేదు. వారి మధ్య రహస్య ఒప్పందం జగమెరిగిన సత్యం. సంక్షేమ సారథి వైఎస్ జగన్‌ని విమర్శించే అర్హత పవన్‌కి లేదు. జగన్ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రస్ గల్లంతైపోయింది. రాజకీయ ఓనమాలు రాని నువ్వు గాలికి కొట్టుకుపోతావు. పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం. పొరపాటు చేస్తే ఎవరినీ విడిచి పెట్టం.’ అని హెచ్చరించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ రాజ్యాంగానికేమైనా అతీతుడా అంటూ ప్రశ్నించారు. సీఎం కావాలని పగటి కలలు కంటే సరిపోదని, హుందాగా వ్యవహరించి మర్యాద కాపాడుకోవాలని సూచించారు. ఇదీ చదవండి: అమరావతి యాత్ర ముసుగులో టీడీపీ, జనసేన రౌడీయిజం.. స్థానికులపై దాడి -
అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర: మంత్రి బొత్స
సాక్షి, శ్రీకాకుళం: చంద్రబాబు దివాళాకోరు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ మంత్రి, ఎమ్మెల్యేపై తాము దాడి చేయిస్తామా అని ప్రశ్నించారు. మామపై రాళ్లు వేయించి.. అల్లర్లు సృష్టించిన చరిత్ర మాది కాదన్నారు. చదవండి: అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉంది. అల్లర్ల వెనుక ఎవరున్నారో వెలికితీస్తామని’’ మంత్రి బొత్స అన్నారు. పవన్‌కల్యాణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. తుని ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రతిపక్షాలు కోరలేదా? ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని’’ మంత్రి బొత్స హెచ్చరించారు. -
ఆయనకి అత్తారింటికి దారి ఎటో తెలియదు..
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు మూకుమ్మడి ఎదురుదాడి చేయడమే కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారు. వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణరెడ్డి ...పవన్‌పై ధ్వజమెత్తారు. ‘పవన్‌కు రాజకీయం ఒక సరదా. రాజకీయాలు సినిమా అనుకుని మాట్లాడుతున్నాడు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అందుకే వేచి చూశాం. పవన్‌కి అత్తారింటికి దారి ఎటో తెలియదు. ఏ అత్త ఇంటికి పోవాలో కూడా తెలియని పవన్...లోకేశ్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలను పవన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాపులు భయపడుతున్నారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపులను కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ జనసేనతో కాపులను ఎవరికి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని మంత్రి నారాయణ సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను చూసి కాపులందరు భయపడుతున్నారని అన్నారు. బీజేపీ పవన్‌ను పావులా వాడుకుంటుందని, నాలుగేళ్లు పాటు టీడీపీ అవినీతిపై ఆయన ఎందుకు మాట్లాడలేదన్నారు. పవన్ దీక్ష ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని, ఇన్నాళ్లు ఏం పోరాటం చేశారని ... ఏపీ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. తక్షణమే క్షమాపణ చెప్పాలి ప్రశ్నిస్తాను అంటున్న పవన్ కల్యాణ్.. సోదరుడు చిరంజీవి హోదాపై రాజ్యసభలో ఎందుకు పోరాటం చేయడంలేదో ముందుగా ప్రశ్నించాలని మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. ‘ఎంతోమంది నాయకులను మోసం చేసిన చిరంజీవిని పవన్ ప్రశ్నించాలి. మీ అన్నని మీరు ప్రశ్నించకపోతే ప్రజలే కాలర్ పట్టుకుని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. లోకేశ్ అవినీతి చేశాడు అని దారుణంగా మాట్లాడుతున్న పవన్...చిన్న ఇల్లు కోసం మీకు రెండు ఎకరాలు కావాలి కానీ...రాష్ట్ర రాజధానికి ఇన్ని అవసరం లేదని అంటారా?. పవన్‌కి రాజకీయ కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఇప్పటికైనా లోకేశ్, చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి’ అని ఆమె సుజాత డిమాండ్ చేశారు. పవన్‌కు ఒక్కరాత్రిలో జ్ఞానోదయం పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలోప్రజల కోసం ఏమి చెబుతారా అని రాష్ట్రం అంతా వేచి చూసిందని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగల అనిత అన్నారు. అయితే ఒక్క రాత్రిలో ఆయనకు జ్ఞానోదయం అయినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. సభలో కనీసం జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిమాటలో చంద్రబాబుని తిట్టడమే పనిలా మాట్లాడారని అనిత మండిపడ్డారు. ఇన్నేళ్లలో ఎక్కడా మాట్లాడని పవన్ నిన్న జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ మాట్లాడటం వెనుక ఉద్దేశ్యమేమిటో చెప్పాలన్నారు. కేంద్రం చేతుల్లో పవన్ కీలుబొమ్మగా మారారని, ఆయన ఒకసారి పునరాలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు. -
పవన్ కల్యాణ్ తీరుతో కాపులకు నష్టం
-
అప్పుడు - ఇప్పుడు
-
పవన్ ప్రసంగం పై శేఖర్ కమ్ముల కామెంట్స్
-
ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు
-
గాంధీనగర్ లో మోడీని కలవనున్న పవన్
న్యూఢిల్లీ : 'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నాడు. ఈ సందర్బంగా అతడు ఎన్నికల కమిషన్ అధికారులతో పాటు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీకి అపాయింట్ మెంట్ ఖరారు అయ్యింది. పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం గాంధీనగర్ లో మోడీతో సమావేశం కానున్నాడు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అవగాహనపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ ‘జనసేన’కు ప్రస్తుత ఎన్నికల బరిలో చోటు లభించేలా లేదు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు విడుదలవడం, ఎన్నికలకు అతితక్కువ వ్యవధి ఉండడం, పార్టీ కోసం దరఖాస్తు చేసుకుని కొద్దిరోజులే కావడం చూస్తుంటే తక్షణం పార్టీ ఏర్పాటు సాధ్యం కాదని తెలుస్తోంది. అయితే స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులపై పోటీచేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మను మీడియా సంప్రదించినప్పుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘జనసేన పేరుతో మార్చి 10న ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తులో పవన్‌కల్యాణ్‌ను అధ్యక్షుడిగా పేర్కొన్నారు. జనసేన పార్టీతో పోటీ చేస్తామని ఉంది. రెండు రోజులే అయింది ఆ లెటర్ వచ్చి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అది కష్టం. నోటిఫై చేయాలి. పబ్లిక్ హియరింగ్ కావాలి. ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఈ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దానిలోపే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కష్టం..’’ అని తెలిపారు. రిజిస్ట్రేషన్ జరగకుండా ఆ పార్టీ ఎన్నికలలోకి వెళ్లవచ్చా? అన్న ప్రశ్నకు బదులుగా ‘పార్టీ పేరు మీద వెళ్లకూడదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా పార్టీ ఎలా పెడతారు? రిజిస్ట్రేషన్ తప్పకుండా ఉండాలి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. పార్టీ పేరును ఉపయోగించుకోవచ్చా? అన్న ప్రశ్నకు బదులుగా ‘రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటిస్తే.. వేరే పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. రిజిస్ట్రేషన్ లేకుండా అసలు ప్రకటించకూడదు. పబ్లిక్‌గా వాడుకోకూడదు..’ అని స్పష్టం చేశారు. -
జనసేన పార్టీ నమోదు కాలేదు: బ్రహ్మ
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయతలపెట్టిన పార్టీ ‘జనసేన’కు ప్రస్తుత ఎన్నికల బరిలో చోటు లభించేలా లేదు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు విడుదలవడం, ఎన్నికలకు అతితక్కువ వ్యవధి ఉండడం, పార్టీ కోసం దరఖాస్తు చేసుకుని రెండు రోజులే కావడం చూస్తుంటే తక్షణం పార్టీ ఏర్పాటు సాధ్యం కాదని తెలుస్తోంది. అయితే స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులపై పోటీచేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. దీనిపై గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మను మీడియా సంప్రదించినప్పుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘జనసేన పేరుతో మార్చి 10న ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తులో పవన్‌కల్యాణ్‌ను అధ్యక్షుడిగా పేర్కొన్నారు. జనసేన పార్టీతో పోటీ చేస్తామని ఉంది. రెండు రోజులే అయింది ఆ లెటర్ వచ్చి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అది కష్టం. నోటిఫై చేయాలి. పబ్లిక్ హియరింగ్ కావాలి. ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఈ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దానిలోపే రిజిస్ట్రేషన్ చేయడం అనేది కష్టం..’’ అని తెలిపారు. రిజిస్ట్రేషన్ జరగకుండా ఆ పార్టీ ఎన్నికలలోకి వెళ్లవచ్చా? అన్న ప్రశ్నకు బదులుగా ‘పార్టీ పేరు మీద వెళ్లకూడదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా పార్టీ ఎలా పెడతారు? రిజిస్ట్రేషన్ తప్పకుండా ఉండాలి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. పార్టీ పేరును ఉపయోగించుకోవచ్చా? అన్న ప్రశ్నకు బదులుగా ‘రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటిస్తే.. వేరే పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. రిజిస్ట్రేషన్ లేకుండా అసలు ప్రకటించకూడదు. పబ్లిక్‌గా వాడుకోకూడదు..’ అని స్పష్టం చేశారు.