
సాక్షి, అమరావతి: చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని, స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
‘‘టెక్నికల్ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు తప్ప.. నేరం చేయలేదని చెప్పడం లేదు. చట్టంలో లొసుగులున్నాయా అని చంద్రబాబు వెతుకులాడుతున్నారు. గతంలోనే అనేక సార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు. సీఐడీ అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసింది.. దొంగ అన్ని సార్లు తప్పించుకోలేడు.. బాబు విషయంలో రుజువైంది’’ అని అన్నారు.
‘‘లోకేష్ దొరికిపోయారని ప్రజలకు అర్థమవుతోంది. ఇన్ని రోజులు లోకేశ్ ఢిల్లీ ఓపెన్ జైలులోనే ఉన్నారు. పురందేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారు. పురందేశ్వరి తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును కాపాడేందుకే పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారు. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలను పురందేశ్వరి ఖండించలేదు. దత్తపుత్రుడు పీకే కాదు కేకే.. కిరాయి కోటిగాడిలా తయారయ్యారు. చంద్రబాబు పార్టీని కాపాడుకునేందుకే పవన్ రాజకీయాలు. అది జనసేన కాదు.. బాబు సేన అని ప్రజలు గమనించారు. కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకే పవన్ పార్టీ పెట్టారు.’’ అని మంత్రి దుయ్యబట్టారు.
చదవండి: నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment