
విశాఖ జనసేన కార్యకర్తలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
సాక్షి, అమరావతి: విశాఖ జనసేన కార్యకర్తలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. విశాఖ జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలైని పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో తేలుస్తామని వెల్లడించింది.
అసలు నిందితుడు కాని మూడో వ్యక్తి ఎఫ్‌ఐఆర్‌ను ఎలా సవాలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ప్యాకేజీల పవన్, బాబులతో ఒరిగేదేమీ లేదు: మంత్రి కాకాణి