April 13th AP Elections 2024 News Political Updates..
08:40PM, April 13th 2024
నెల్లూరు:
నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి
- రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోటంరెడ్డి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ద్వజం
- రూరల్ నియోజకవర్గ ప్రజలను పీడించి.. బిల్డర్స్ ను బెదిరించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపాటు
- ఎన్నికల సమయంలో కోటంరెడ్డి.. జిమ్మిక్కుల రాజకీయం చేస్తారని.. ప్రజలెవ్వరు నమ్మొద్దని విజ్ఞప్తి.
08: 15PM, April 13th 2024
ఏలూరు జిల్లా:
నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై ముద్ర బోయిన వెంకటేశ్వరరావు ఫైర్
- నేను వైఎస్సార్‌సీపీకి అమ్ముడుపోయానని పార్థసారథి వ్యాఖ్యానించటం పద్ధతి కాదు
- ఇప్పుడు నువ్వు టీడీపీకి, గతంలో నీ తండ్రి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అమ్ముడుపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
- పార్థసారథి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజలే నీకు బుద్ధి చెబుతారు
- నా కార్యకర్తలని ఫోన్లో బెదిరించటం పద్ధతి కాదు
- ఇద్దరం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పెనమలూరులో గాని నూజివీడులో గాని పోటీ చేద్దాం రా
- రెండు చోట్ల నా మీద ఒక ఓటు ఎక్కువ వచ్చినా నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా
- మళ్లీ నా కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటి ముందు బైఠాయిస్తా
03: 15PM, April 13th 2024
తిరుపతి జిల్లా:
తిరుపతిలో వైఎస్సార్‌పీపీలోకి భారీగా చేరికలు
- రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరిన బిజేపి నాయకులు, నగర యువత
- తిరుపతి 19వ డివిజన్‌లోని బీజేపీ నాయకులు, నగర యువత పద్మావతీపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
- వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూమన అభియన్ రెడ్డి
- రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
- తిరుపతి నగరాభివృద్ధిని చూసి వారంతా వైఎస్సార్‌సీపీలో చేరారు
02: 25PM, April 13th 2024
బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని లేఖ రాశావు మర్చిపోయావా చంద్రబాబు: మంత్రి వేణుగోపాలకృష్ణ
- ప్రలోభాలు పెట్టి బీసీలను లొంగ తీసుకోవాలనుకున్నావు
- కులగణన పూలే జయంతి నాడు ప్రకటించాం... సజావుగా పూర్తి చేస్తాం.. కులగణన వివరాలు ప్రజలకు పంపిస్తాం
- కమిషన్‌లకు కక్కుర్తి పడి గతంలో నాణ్యత లోపం ఉన్న పనిముట్లను సరఫరా చేసావ్
- సామాజిక సాధికారతకు నిలువెత్తు దర్పణం సీఎం జగన్
- కులగణనకు భారతీయ జనతా పార్టీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి
02: 10PM, April 13th 2024
విశాఖపట్నం:
బొత్స సత్యనారాయణ పాయింట్స్..
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు వ్యతిరేకమని కూటమి నేతలు చెప్పగలరా
- స్టీల్ ప్లాంట్పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి
- స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి
- టిడిపి జనసేన బీజేపీకీ ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే
- లాబీయింగ్ చేసే సీఎం రమేష్కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాను
- అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడానికి స్థానికంగా ఉన్న బీసీ నేత టీడీపీకి దొరకలేదా
- వాలంటీర్లపై చంద్రబాబు మాటలు చూస్తుంటే నాలిక తాటిమట్ట అనే విధంగా ఉన్నాయి
02: 00PM, April 13th 2024
వైఎస్ఆర్ జిల్లా:
పులివెందులలో షర్మిల, సునీత విమర్శలపై భగ్గుమన్న మహిళా కౌన్సిలర్లు
- షర్మిల, సునీత విమర్శలను తీవ్రంగా ఖండించిన కౌన్సిలర్లు
- అక్కచెల్లెల్లు ఇద్దరు కాంగ్రెస్ గెలిస్తే పులివెందులకు ఏం చేస్తారో చెప్పడం లేదు
- ఎప్పుడు హత్యలు, హంతుకులు అంటూ విమర్శలు చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు
- వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి
- అంతేగానీ ఎంపి అవినాష్ రెడ్డి హంతకుడు.. సీఎం వైఎస్ జగన్ కాపాడాడు అంటూ మాట్లాడుతున్నారు
- షర్మిల ఒక్కరే కాదు.. మేము కూడా వైఎస్ఆర్ కుమార్తెలాంటి వారమే
- సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి చూడండి
- ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలతో ఆదుకున్నారు
- రాష్టంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పదకాలు అమలువుతుంటే పధకాలు లేవంటున్నారు?
- ఎంపీ, సీఎంలపై అపనిందలు మోపడం మానుకోండి
- ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడని అంటున్నారు.. మీరు చూశారా చెప్పండి?
- మీ లబ్ది కోసం వైఎస్ఆర్ కూతురినని తెలంగాణాకు వెళ్లి పార్టీ పెట్టారు
- అక్కడ పార్టీ మూసేసి మళ్లీ ఇక్కడికి వచ్చారు
- మీరు మాట్లాడినంత మాత్రనా ఇక్కడ వినేవారు ఎవరు లేరు
- మీ నీచపు రాజకీయాలు ఇక్కడ తరం కావు
- 2024 ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు
- ఎంపీ అవినాష్రెడ్డి 5 లక్షల మెజార్టీతోను, సీఎం వైఎస్ జగన్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం
01: 10PM, April 13th 2024
కాకినాడ జిల్లా కాకినాడ:
మిధున్ రెడ్డి, రిజినల్ కోఆర్డినేటర్ కామెంట్లు
- పిఠాపురంలో వంగా గీతా బలమైన అభ్యర్ధి
- పవన్ కళ్యాణ్ రాకముందే ఆమె అక్కడ అభ్యర్ధిగా ఉన్నారు
- గతంలో ఎమ్మెల్యే గా వంగా గీతా పని చేశారు... నిత్యం ప్రజల్లో ఉంటారు
- యిబ్బందులు వస్తే ఎవరూ అందుబాటులో ఉంటారు అని ప్రజలు కోరుకుంటారు
- పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దత్తు ఇస్తారు
- పవన్ కళ్యాణ్ ను వాళ్ళ క్యాడరే చేరుకోలేరు
- ఆయన ఎక్కడ ఉండాడో తెలియదు.. ఎప్పుడు వస్తాడో తెలియదు
- పిఠాపురం పై మేము ప్రత్యేక దృష్టి పెట్టానవసరం లేదు
- 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి
- పిఠాపురం లో వైఎస్ఆర్ సిపి బలంగా ఉంది
- పిఠాపురంలో కష్టపడుకొవాల్సింది పవన్ కళ్యాణ్
- డబ్బులకు ప్రజలు ఓట్లు వెయ్యరు
- నా సీటు నాకు ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను
- ఇంత వరకు నేను పిఠాపురం లో అడుగు పెట్టింది లేదు
- తాను ఓడిపోతే చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు
- పవన్ కళ్యాణ్ కోసం పట్టించుకోనవసరం లేదు
01: 00PM, April 13th 2024
విశాఖపట్నం:
బొత్స సత్యనారాయణ పాయింట్స్..
- జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడని నాయకులు
- బీసీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ వంటివారు
- బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇస్తున్నారు
- మాత్యకారులను ఎమ్మేల్యేలుగా, మంత్రులుగా చేసే ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్
- రానున్న ఎన్నికల్లో మత్స్యకారులకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు
- ఒక మత్స్యకారుడిని రాజ్య సభకు పంపించారు
- బలహీనవర్గాలంటే చంద్రబాబుకు, పవన్కు చిన్న చూపు
- మాయలు చేసే మాటలు మేము చెప్పము
- నా రాజకీయ భవిష్యత్తులో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదు
- మన పార్టీ బలహీనవర్గాల పార్టీ అని జగన్ నాతో అనేవారు
12: 30PM, April 13th 2024
చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి
- 58 నెలల మన పాలనను మీరు చూశారు
- గత చంద్రబాబు పాలనను మీరు చూశారు
- నాయకుడి ఎన్నికలో పొరపాటు చేస్తే
- మనం చేసేదీ ఏమీ ఉండదు
- మనం తీసుకునే నిర్ణయం సరైంది అయితే, మన అడుగులు ముందుకు పడతాయి
- చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు
- సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు
- గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు
- చంద్రబాబు గతంలో 98శాతం హామీలను ఎగ్గొట్టారు
- ఆప్కోకు కూడా చంద్రబాబు బకాయిలు పెట్టారు
- ఒక్కరికైనా చంద్రబాబు సెంట్ స్థలం ఇచ్చారా?
- మనం స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు
- ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు
- నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3,706 కోట్లు ఖర్చు చేశాం
- లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో డబ్బు జమ చేశాం
- నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం
- 1.06 లక్షల మందికి లబ్ధి జరిగింది
- అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేశాం
- పెన్షన్ రూ.3వేలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే
- చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది
- మంగళగిరిలో చేనేతలు ఎక్కువుగా ఉన్నారని, చేనేత మహిళకు సీటు ఇచ్చాం
- బీసీలు ఎక్కువగా ఉన్నా... చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు
- కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు ఇవ్వరు
- 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం
- చేనేతలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం
- రెండు ఎమ్మెల్సీలు చేనేతలకు ఇచ్చాం
- 8 మంది మున్సిపల్ చైర్మన్లు చేనేతలకు ఇచ్చాం
- 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే
- దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు
- నామినేటెడ్ పదవుల్లోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం
- చేనేత వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలిచాం
- మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ధి జరిగింది
- అక్కా చెల్లెమ్మలకు రూ.1530 కోట్ల లబ్ధి
- నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్ల లబ్ధి
- టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి
- ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి
- మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా
12: 00PM, April 13th 2024
విశాఖపట్నం:
వాసుపల్లి గణేష్ పాయింట్స్..
- చంద్రబాబుకు జగన్కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది
- సీఎం జగన్ కాలి గోటికి చంద్రబాబు సరిపోడు
- మత్స్య కారులు తోలు తీస్తానని చంద్రబాబు బెదిరించారు
- నలుగురు మత్స్య కారులు కు ఎంఎల్ఏ సీట్లు సీఎం జగన్ ఇచ్చారు
- 50 ఏళ్లకే ఫించన్ ఇస్తున్నారు
- మత్స్య కారులను చంద్రబాబు మోసం చేశారు
- మత్స్య కారులు చంద్రబాబు తోలు తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి
11:30AM, April 13th 2024
చిత్తూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్
- నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని చూడలేదు
- సిఎం శ్రీ వైఎస్ జగన్ కు పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరు
- జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు ది
- శ్రీ వైఎస్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అని నెరవేర్చారు
- 600 హామీలు ఇచ్చి, గెలిచిన వెంటనే మానిఫెస్టో కూడా కనపడకుండా చేశారు
- బాబు వస్తె జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగానే 2.5 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు
- 14 వేల కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు
- దానికి అదనంగా 10 వేల కోట్లు వడ్డీ కావడంతో సిఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఆ రుణాలు చెల్లించారు
- చంద్రబాబు మన ప్రాంతంలో మొయిస్తున్న మూడు ప్రాజెక్టులు అడ్డుకున్నారు
- ఎన్నికలు పూర్తి అవగానే ఆ కేసులు గెలిచి మళ్ళీ పనులు చేపడతాం
- కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బిజెపి నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు
- జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, రాష్ట్రాన్ని విడగొడతాను అని డిల్లోలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారు
- హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి
- కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారు
- రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి
- అలాంటి వ్యక్తి నేడు బిజెపి నుండి రాజంపేట ఎంపిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు
- నాకంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మిథున్ భారీ మెజారిటీతో గెలిపించాలి
- కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలని ప్రజలే సిద్దం గా ఉన్నారు
- ఎమ్మెల్యేగా నన్ను, ఎంపిగా శ్రీ మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా
- మీ రెండు అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుకుంటున్నా
11:00AM, April 13th 2024
విశాఖపట్నం:
విశాఖ సౌత్ నియోజకవర్గంలో మళ్లీ మొదటకి వచ్చిన జనసేన పరిస్థితి
- వంశీకృష్ణకు వ్యతిరేకంగా సాదిక్ మీడియా సమావేశం
- మహ్మద్ సాదిక్ జనసేన నేత పాయింట్స్..
- సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ వెనకబడి ఉన్నారు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాకెట్లా దూసుకు వెళ్తున్నారు
- వంశీకృష్ణ సౌత్లో గెలిచే పరిస్థితి లేదు
- వంశీకృష్ణను సౌత్ నియోజకవర్గం నుంచి తప్పించాలి
- సౌత్ నియోజకవర్గంలో స్థానికులకే సీటు కేటాయించాలి
- వంశీ కృష్ణను అభ్యర్థిగా పెట్టడం వల్ల సౌత్లో జనసేన ఓడిపోతుంది
10:30AM, April 13th 2024
శ్రీ సత్యసాయి జిల్లా:
కదిరిలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
- సెల్ఫీ ఫోటో కోసం వచ్చిన అభిమానిపై బాలకృష్ణ దురుసు ప్రవర్తన
- కదిరి నుంచి సైకిల్ రావాలి యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ
- బాలకృష్ణ తీరుపై మండిపడుతున్న కదిరి వాసులు
10:00AM, April 13th 2024
తిరుపతి జిల్లా
చంద్రగిరి పట్టణంలో పచ్చబ్యాచ్(టీడీపీ నాయకులు) బరితెగింపు
- అభివృద్ధిని చూసి ఓర్వలేక శిలాఫలకాలు ధ్వంసం
- చంద్రగిరి అక్కగార్ల కాలనీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు
- వాటి పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్ రోడ్డు శిలాఫలకాలు
- రాత్రికిరాత్రి సుమారు నాలుగు ఫలకాలను ధ్వంసం చేసిన పచ్చమూకలు
- మండిపడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు
9:30AM, April 13th 2024
విశాఖపట్నం:
వరుదు కళ్యాణి పాయింట్స్..
- సీఎం జగన్ ప్రచారానికి విశేషమైన స్పందన లభిస్తోంది
- ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు
- ఎన్డీఏ అంటే నారా డిజాస్టర్ ఏలియన్స్గా మారింది
- కాల కూటమి విషంగా చంద్రబాబు, పవన్ పురంధేశ్వరి తయారయ్యారు
- ఎన్ని కూటములు వచ్చిన సీఎం జగన్ను ఏమీ చేయలేరు
- వాలాంటిర్లను గంజాయి దొంగలుగా చంద్రబాబు విమర్శించారు
- 650 హామీలు ఇచ్చి ఒక హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు
- తల్లిని తిట్టించిన వారితో పవన్ ఎలా కలుస్తారు
9:00AM, April 13th 2024
విజయవాడ
షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ను నమ్మవద్దు: వైఎస్ విమలారెడ్డి
- షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు
- మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు
- మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను
- షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూశాను
- అవినాష్ హత్య చేయడం ఎవరైనా చూసారా
- నిత్యం షర్మిల అవినాష్ను విమర్శిస్తున్నారు
- వాళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు
- హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు
- అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా
- అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు.. అతనికి కుటుంబం ఉంది
- ఏ పాపం చేయని భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు
- అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు
- హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు
- మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది
- శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి
- వైఎస్సార్ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు
- వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం
- షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు
- జగన్పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు
- వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ఉన్నారు
- రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు
- ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు
- మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి
- పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు
- అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది
- షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు
- మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు
- మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు
- వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు
- కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా
- వైఎస్సార్ ఉన్నపుడు వివేకానందరెడ్డి కడప చూసుకున్నారు
- ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు
- నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు
- మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు
- శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు
- అవినాష్పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను
- మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది
- షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు
- నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు
- షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు
- గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
- డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి ఇదంతా చేస్తున్నారు
- జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు
- బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు
- వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా
- అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు
- అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానందరెడ్డి పనిచేశారు
- ప్రజలంతా సీఎం జగన్కి అండగా ఉండాలి
- మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి
- అవినాష్‌కు, జగన్కు ఓట్లు వేసి గెలిపించాలి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి
8:30AM, April 13th 2024
చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా: సీఎం జగన్
- చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు.
- మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క.
- అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది.
- ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను.
చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు. మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని… pic.twitter.com/0HTBkdXBch
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2024
8:00AM, April 13th 2024
విజయవాడ
బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా
- ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైఖరితో బీజేపీలో మరో కీలకనేత రాజీనామా
- బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా
- ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా చందు సాంబశివరావు
- ఏపీ బీజేపీ పురందేశ్వరి వైఖరి పట్ల బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తులు
7:40AM, April 13th 2024
తిరుపతి
గ్రాండ్ రిడ్జి హోటల్ లో రాత్రి బిజెపి నేతలకు చేదు అనుభవం
- ఉమ్మడి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపుకు సహకరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం
- బిజెపి నేతల్ని పట్టించుకోక పోవడంతో రాత్రి అలిగి వెళ్లిపోయిన నాయకులు భానుప్రకాష్, శాంతారెడ్డి
- ఈరోజు ఉదయం 8.30 గంటలకు బిజెపి నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్
- తిరుపతి అసెంబ్లీ స్థానం గెలుపుకు సహకరించాలని టిడిపి, జనసేన పార్టీ నాయకులను కోరిన పవన్
- పవర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రాకులాట
- జనసేన, టిడిపి నాయకులును బ్రతిమలాడిన పవన్
- తిరుపతి అసెంబ్లీ సీటు చంద్రబాబు స్వయంగా జనసేనకు ఇచ్చారు అని టిడిపి నేతలకు స్పష్టం చేసిన పవన్
- ఖంగుతిన్న టీడిపి నేతలు
7:20AM, April 13th 2024
ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్‌ఆర్‌సీపీ జెండానే!
- 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి
- చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే
ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్‌ఆర్‌సీపీ జెండానే!
— YSR Congress Party (@YSRCParty) April 12, 2024
21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి
చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/LNccqje4Px
7:00AM, April 13th 2024
నెల్లూరు జిల్లా..
చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదు: విజయసాయిరెడ్డి
- రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి
- 2024 లో గెలిచిన తర్వాత సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కూడా ముందుంటుంది
- 2024 -2029 లోపల కందుకూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా కందుకూరులో పరిశ్రమలు తీసుకువస్తాం
- ఆ బాధ్యత మాదే
6:50AM, April 13th 2024
క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
- ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య
క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు.. ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
— YSR Congress Party (@YSRCParty) April 12, 2024
-ఎంపీ వైవీ సుబ్బారెడ్డి #TDPJSPBJPCollapse#TDPAgainistVolunteers#EndOfTDP pic.twitter.com/aNZoTdc6Ij
6:40AM, April 13th 2024
మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?
- పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయి: సీఎం జగన్
- మీరే నా స్టార్ క్యాంపైనర్లు..
- ప్రతి ఇంటికీ వెళ్లి మంచికి అండగా నిలబడమని కోరాలి
- చంద్రబాబుకు ఓటు వేయడమంటే.. మరోసారి మోసపోవడమే
- ఇంటికొస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది
- అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు, వదినమ్మ వంత పాట
- ముగ్గురూ కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు
- ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్
6:25AM, April 13th 2024
వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేకపోతున్నాం..
- మన సభలకు స్పందన లేదు.. ఇలాగైతే ఎలా?
- కూటమి నేతల తర్జనభర్జన
- హాజరైన పవన్, బాబు, బీజేపీ ముఖ్య నేతలు
- కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ
6:20AM, April 13th 2024
ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా
- లోకేశ్ ఐ ఫోన్ ట్యాపింగ్ అంటూ టీడీపీ కొత్త నాటకం
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం
- అసలు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్ చేసే టెక్నాలజీనే లేదు
- కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది
- ఫోన్ ట్యాపింగ్, ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబే సిద్ధహస్తుడు
6:15 AM, April 13th 2024
దొరికాడు దొంగ
- ‘స్కిల్’బెడిసికొట్టి కటకటాల్లోకి..
- సీమెన్స్ కంపెనీ ముసుగులో భారీ దోపిడీ
- కుట్రదారు,లబ్దిదారు చంద్రబాబే
- A1 చంద్రబాబు అరెస్ట్...
- అవినీతి నెట్‌వర్క్ ద్వారాచంద్రబాబు బంగ్లాకు రూ.241కోట్లు
- రాజమహేంద్రవరంసెంట్రల్ జైల్లో 52 రోజులు
- సీఐడీ దర్యాప్తుల్లో ఆధారాలతోసహా వెల్లడి
- 17ఏ కింద చంద్రబాబుకు రక్షణ లభించదన్న సుప్రీంకోర్టు
- షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు
- కేజ్రీవాల్ అరెస్ట్ తరహా లోనే చంద్రబాబుపై ఈడీ కన్ను
- ఇదీ చంద్రబాబు అవినీతి ‘స్కిల్’
6:00 AM, April 13th 2024
రౌడీఛీటర్ చింతమనేని
- ..ఇది తప్పన్న పాపానికి మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళతాడొకడు..
- అధిక వడ్డీలకు అప్పులిచ్చి,గడువులోగా తీర్చలేదన్న సాకుతో పక్కకు రమ్మంటున్న వారిని వెనకేసుకొస్తాడు ఇంకొకడు..
- ప్రకృతిని చెరబట్టడానికే పుట్టామన్నట్లు వ్యవహరిస్తాడు మరొకడు.. చిన్నారులని కూడా చూడకుండా లైంగికంగా వేధించే వెధవలకు అండగా నిలుస్తాడొక దుర్మార్గుడు..
- ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదంటే కడుపైనా చేయాలని నిస్సిగ్గుగా, సందేశంగా చెబుతాడో నేత..
- ‘అసలు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని స్వయంగా పార్టీ అధినేతే హేళన చేస్తాడు.. ఇలాంటి వాళ్లంతా ప్రజలను ఉద్దరిస్తారట!
- ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో వీరందరిదీ అందె వేసిన చేయి. ఇలాంటి టీడీపీలో ఒక్కో నేతది ఒక్కో చీకటి చరిత్ర.నేటి నుంచి ఒక్కొక్కరి బాగోతాన్ని‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
- ఎమ్మెల్యే హోదాలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి
- తహసీల్దార్ వనజాక్షి జుట్టుపట్టి ఈడ్చి దాడి చేసిన వైనం.. చంద్రబాబు హయాంలోనే రౌడీషిట్
- అత్యంత వివాదాస్పద రాజకీయ నేతగా ముద్ర
- ఎస్సీలకు రాజకీయాలు ఎందుకురా.. అంటూ తీవ్ర స్థాయిలో దూషణ
- పవన్ కళ్యాణ్.. వాళ్ల అన్న చిరంజీవినే గెలిపించలేనివాడు అంటూ వ్యక్తిగత విమర్శలు
- ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో పోలవరం కుడికాల్వ విధ్వంసం
- 5 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ మింగిన మహా అవినీతిపరుడు
- కొల్లేరులోనూ వందల ఎకరాల్లో సొంతంగా అక్రమ సాగు
- 1,860 ఎకరాల అక్రమ సాగులో అడ్డగోలుగా కమీషన్ల దందా
Comments
Please login to add a commentAdd a comment