ఎగిరెగిరి పడుతున్న చంద్రబాబు
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అదే అహంకారం, అదే లెక్కలేని తనం
కూటమిలో ఉన్నా.. జనసేన, బీజేపీ సీట్లను శాసించిన చంద్రబాబు
తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్న చంద్రబాబు
ప్రతిపక్షంలో ఉన్న వ్యవస్థల్నీ మేనేజ్ చేస్తున్న బాబు
వలంటీర్ వ్యవస్థను ఆపేసి.. సంక్షేమం, పెన్షన్లు ఆపించే యత్నం
చంద్రబాబు ఏజెంట్‌గా పురందేశ్వరి
రామోజీ రాతలు.. దత్తపుత్రుడి పాకులాట
అందరి ప్రయత్నమంతా చంద్రబాబు అధికారం కోసమే
2019 కంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది
షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు
గుంటూరు, సాక్షి: చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని.. ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.
జనసేన, బీజేపీలో ఉన్నవాళ్లకు నిరాశే. కూటమిలో ఉన్నా చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారు అయ్యాయి. కానీ, 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారు. పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంది.
►2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన పాలనను ప్రజలు మరిచిపోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఈవో మీదకు దూకుడుగా వెళ్లారు. దబాయించి మాట్లాడారు.. (అందుకు సంబంధించిన వీడియోను సజ్జల ప్రదర్శించారు). వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. వాటిపై దాడి చేస్తూ వస్తున్నారు.
►చంద్రబాబు అండ్ కో కక్షతో వలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందర ఆ వ్యవస్థను దూరం చేసింది. తన ఏజెంట్ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా కుట్ర చేస్తోంది. వలంటీర్ వ్యవస్థ వల్ల రెండ్రోజుల్లో ఫించన్ల పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడది ఆలస్యం అయ్యింది. దీంతో పెన్షనర్షలోనూ ఆందోళన వ్యక్తం అయ్యింది. దురదృష్టవశాత్తూ.. ఎండలకు తాళలేక కొందరు చనిపోయారు. అధికారులపైనా చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాక్షస మనస్తతత్వం ఏ నాయకుడిలో కనిపించలేదు.
►చంద్రబాబును శాశ్వతంగా సీఎంను చేసేదాకా రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రుడికి మనసు శాంతించదేమోనని సజ్జల అన్నారు. చంద్రబాబు వదిన పురందేశ్వరి జాతీయ పార్టీలో ఉన్నా.. ఎజెండా మాత్రం చంద్రబాబు కోసం పని చేయడమే. అహంకారంతో ఈ మధ్య ఆమె అధికారులపైనే ఫిర్యాదు చేశారు. చంద్రబాబే సీఎం అనుకుని ఆమె లేఖ రాశారా?. ఈసీ తాను చెప్పినట్లు వింటుందని లేఖ రాశారా? తెలియదు. తన మరిదిని సీఎం చేయాలన్నదే ఆమె తాపత్రయంగా కనిపిస్తోంది.
►చంద్రబాబు చేష్టలతో ఏపీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 2014-19 పాలన ఎక్కడ పునరావృతం అవుతుందో అని ఆలోచన చేశారు. రావణుడిలా చంద్రబాబు మారు వేషంలో ఓటర్ల దగ్గరకు వస్తున్నారు. బాబు సాధువు రూపంలో వచ్చి నమ్మించే యత్నం చేశారు. ఏపీ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి.
►వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతీ వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తోంది. కోవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ఒక్క పథకం కూడా ఆపకుండా అందించారు. సచివాలయ ఉద్యోగులు లక్షా పాతిక వేల మంది ఉన్నారని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు.
►షర్మిల ఇవ్వాల్సిన సంజాయిషీలు చాలా ఉన్నాయి. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయం అయ్యారు?. ఇక్కడి(ఏపీ) కాంగ్రెస్ బాధ్యతలు ఎవరిచ్చారు? ఎందుకు షర్మిల తీసుకున్నారు?.. కాంగ్రెస్‌తో కొట్లాడుతానని.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మాట్లాడని ఆమె.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. ఇదంతా.. మరో నెలలో ప్రజా కోర్టులో అది తేలుతుంది అని సజ్జల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment