‘ఓ బోగస్‌ బాబూ.. ఈ జగన్‌లా ఏం చేశావు?’ | AP Elections 2024: CM YS Jagan campaign Speech At Tangutur | Sakshi
Sakshi News home page

‘ఓ బోగస్‌ బాబూ.. ఈ జగన్‌లా ఏం చేశావసలు?’.. టంగుటూరు ప్రచార సభలో సీఎం జగన్‌

Published Tue, Apr 30 2024 12:45 PM | Last Updated on Tue, Apr 30 2024 1:30 PM

AP Elections 2024: CM YS Jagan campaign Speech At Tangutur

నాయకుడంటే ప్రజలకు నమ్మకం ఉండాలి

చంద్రబాబు హామీల పేరుతో మోసం చేశారు

బాబుది బోగస్‌ రిపోర్ట్‌.. మనది సిసలైన ప్రొగ్రెస్‌

బాబుకి ఓటేస్తే.. చంద్రముఖి నిద్ర లేచి రక్తం తాగుతుం 

మంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి

సైకిల్‌ ఇంటి బయట.. తాగేసిన గ్లాస్‌ సింక్‌లో ఉండాలి

చంద్రబాబు హామీలతో మరోసారి మోసపోవద్దు

పథకాలు కొనసాగాలంటే మీ బిడ్డ జగన్‌ మళ్లీ గెలవాలి

టంగుటూరు ప్రచార సభలో సీఎం జగన్‌ ప్రసంగం 

ప్రకాశం, సాక్షి:  నాయకుడంటే  ప్రజల్లో  ఒక నమ్మకం ఉండాలని.. ఒక మాట చెబితే కచ్చితంగా చేసి తీరతాడని ప్రజలు భావించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అయితే  చంద్రబాబుకి ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని తేల్చి చెప్పారాయన. మంగళవారం ఒంగోలు పార్లమెంట్‌ స్థానం పరిధిలోని కొండేపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌  ప్రసంగించారు. 

జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపు. చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి నిద్ర  లేస్తుంది.  ఐదేళ్లపాటు ప్రజల రక్తం తాగుగుతుంది. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తులను నిర్ణయించేది.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.  

.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. ఓటేసే ముందు ఎవరిది బోగస్‌ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్‌ రిపోర్టు అనేది చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాల రిపోర్టు పరిశీలిస్తే.. 

జాబ్‌ రావాలంటే బాబు రావాలి అనే మాటలు గుర్తున్నాయా?. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ముష్టిలాగా ఉద్యోగాలిచ్చారు. కేవలం 31 వేల ఉద్యోగాలిచ్చారు. మన ప్రభుత్వం 58 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్‌ కార్డు.. చంద్రబాబుది బోగస్‌ కార్డు.

వ్యవసాయం, రైతుల విషయంలో  హామీలను చూద్దాం. రైతుల రుణమాఫీ అని మోసం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించలేదు. పెట్టుబడి సాయం ఇచ్చారా?. రైతులకు సమయానికి సబ్సిడీ ఇచ్చింది ఏనాడైనా ఉందా?. సున్నా వడ్డీ ఈ పెద్ద మనిషి ఇచ్చాడా?. మీ బిడ్డ జగన్‌ ఇచ్చాడా?. కనీసం పెట్టుబడితో రైతులకు భరోసా నిలిచారా?. వ్యవసాయం దండగా అని చంద్రబాబు మాట్లాడింది నిజం కాదా?. బషీర్‌బాగ్‌లో రైతులపైకాల్పులు జరిపించింది. ఉచిత కరెంట్‌ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అంది చంద్రబాబు కాదా?. రైతుల్ని నిట్టనిలువుగా ముంచిన చంద్రబాబుది బోగస్‌ రిపోర్ట్‌ కాదా?

మీ జగన్‌ రైతులకు ఏం చేశాడో చూద్దాం. రైతు భరోసా ఇచ్చాం. పెట్టుబడికి సాయంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది, ఉచిత పంటల బీమా, పంటల కొనుగోలు ఇలా అన్నీ ఈ 58 నెలలకాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా?. ఇది కళ్లకు కనిపిస్తున్న ప్రోగ్రెస్‌.

యెల్లో మీడియా చంద్రబాబుని డెవలప్‌మెంట్‌ కింగ్‌ అని పొగుడుతుంది. మరి చంద్రబాబు ఏం చేశారు?. మన పాలనలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విలేజ్‌ క్లినిక్‌లు కట్టించింది ఎవరు?. వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు?. ఉద్దానం సమస్యను తీర్చింది ఎవరు?. ఎయిర్‌పోర్టు విస్తరణ చేపట్టింది ఎవరు?. ఈ జగన్‌లా ఏదైనా అభివృద్ధి చేశావా? అని చంద్రబాబును సీఎం జగన్‌ నిలదీశారు. ఇలాంటి చంద్రబాబు డెవలప్‌మెంట్‌ విషయంలోనూ బోగస్‌రిపోర్టు ఇచ్చుకుంటున్నారు.

బాబు చరిత్రే మోసం

ఓ చంద్రబాబూ.. ఇంటింటా ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపింది ఎవరు?. పేదల సంకెళ్లను తెంచుకునేలా చదువుతో బాగు చేయించింది ఎవరు?. నాడు నేడుతో విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది ఎవరు? మీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అని అడుగుతున్నా. పచ్చ కామెర్లు వచ్చాయా?. కళ్లెదుట కనిపిస్తున్న రిపోర్టు కనిపించడం లేదా? అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

బోగస్‌ బాబు చేస్తున్న మరో దుర్మార్గం. పెన్షన్ల విషయంలో కుట్రను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉండి అవ్వాతాతల కష్టాలను ఏనాడైనాపట్టించుకున్నాడా?. పెన్షన్లను ఇంటికే అందిస్తున్న ఘనత మీ బిడ్డది. చంద్రబాబు కుట్రలు చేస్తూనే నెపం మీ బిడ్డ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ మనపై ఆరోపణలు చేయడం కంటే దిగజారుడు తనం ఉందా?. 

చంద్రబాబు హయాంలో ఏనాడూ మంచి చేసిన చరిత్రలేదు.  చంద్రబాబు ధ్యాస దోచుకోవడం, దోచుకోవడం పంచుకోవడం మీద కాబట్టే అక్కాచెల్లెమ్మలకు న్యాయం జరగలేదు. ఎవరి విశ్వసనీయత ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలు..  చేసిన మోసం  గుర్తున్నాయా?. ఇంటింటికి జాబ్‌ అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తా అన్నారు. కనీసం ఒక్క రూపాయికూడా చంద్రబాబు ఇవ్వలేదు.  ఇది మోసం కాదా?. 

వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా. మన బతుకులు బాగుపడాలన్నా. మన ఆస్పత్రులు, బడులు బాగుపడాలన్నా. ప్రతీ ఒక్కరం ఫ్యాన్‌ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు తగ్గేలేదు. సిద్ధమేనా?.. మన గుర్తు ఫ్యాన్‌. మంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లో, చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయట, తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లో ఉండాలి.  మీ చల్లని దీవెనలతో..  ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్‌, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను గెలిపించాలని కోరుకుంటున్నా  ప్రజలకు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement