Tangutur
-
టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
-
చంద్రబాబు చేసిన వెదవ పనికి..!
-
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. మీ జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్.. సీఎం జగన్ స్పీచ్
-
‘ఓ బోగస్ బాబూ.. ఈ జగన్‌లా ఏం చేశావు?’
ప్రకాశం, సాక్షి: నాయకుడంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలని.. ఒక మాట చెబితే కచ్చితంగా చేసి తీరతాడని ప్రజలు భావించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అయితే చంద్రబాబుకి ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని తేల్చి చెప్పారాయన. మంగళవారం ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలోని కొండేపి నియోజకవర్గం టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపు. చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది. ఐదేళ్లపాటు ప్రజల రక్తం తాగుగుతుంది. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తులను నిర్ణయించేది.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. .. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. ఓటేసే ముందు ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ రిపోర్టు అనేది చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాల రిపోర్టు పరిశీలిస్తే.. జాబ్ రావాలంటే బాబు రావాలి అనే మాటలు గుర్తున్నాయా?. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ముష్టిలాగా ఉద్యోగాలిచ్చారు. కేవలం 31 వేల ఉద్యోగాలిచ్చారు. మన ప్రభుత్వం 58 నెలల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనది ప్రోగ్రెస్ కార్డు.. చంద్రబాబుది బోగస్ కార్డు.వ్యవసాయం, రైతుల విషయంలో హామీలను చూద్దాం. రైతుల రుణమాఫీ అని మోసం చేశారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించలేదు. పెట్టుబడి సాయం ఇచ్చారా?. రైతులకు సమయానికి సబ్సిడీ ఇచ్చింది ఏనాడైనా ఉందా?. సున్నా వడ్డీ ఈ పెద్ద మనిషి ఇచ్చాడా?. మీ బిడ్డ జగన్ ఇచ్చాడా?. కనీసం పెట్టుబడితో రైతులకు భరోసా నిలిచారా?. వ్యవసాయం దండగా అని చంద్రబాబు మాట్లాడింది నిజం కాదా?. బషీర్‌బాగ్‌లో రైతులపైకాల్పులు జరిపించింది. ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అంది చంద్రబాబు కాదా?. రైతుల్ని నిట్టనిలువుగా ముంచిన చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ కాదా?మీ జగన్ రైతులకు ఏం చేశాడో చూద్దాం. రైతు భరోసా ఇచ్చాం. పెట్టుబడికి సాయంగా ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది, ఉచిత పంటల బీమా, పంటల కొనుగోలు ఇలా అన్నీ ఈ 58 నెలలకాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా?. ఇది కళ్లకు కనిపిస్తున్న ప్రోగ్రెస్.యెల్లో మీడియా చంద్రబాబుని డెవలప్మెంట్ కింగ్ అని పొగుడుతుంది. మరి చంద్రబాబు ఏం చేశారు?. మన పాలనలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విలేజ్ క్లినిక్‌లు కట్టించింది ఎవరు?. వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు?. ఉద్దానం సమస్యను తీర్చింది ఎవరు?. ఎయిర్‌పోర్టు విస్తరణ చేపట్టింది ఎవరు?. ఈ జగన్‌లా ఏదైనా అభివృద్ధి చేశావా? అని చంద్రబాబును సీఎం జగన్ నిలదీశారు. ఇలాంటి చంద్రబాబు డెవలప్మెంట్ విషయంలోనూ బోగస్రిపోర్టు ఇచ్చుకుంటున్నారు.ఓ చంద్రబాబూ.. ఇంటింటా ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపింది ఎవరు?. పేదల సంకెళ్లను తెంచుకునేలా చదువుతో బాగు చేయించింది ఎవరు?. నాడు నేడుతో విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చింది ఎవరు? మీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అని అడుగుతున్నా. పచ్చ కామెర్లు వచ్చాయా?. కళ్లెదుట కనిపిస్తున్న రిపోర్టు కనిపించడం లేదా? అని సీఎం జగన్ మండిపడ్డారు.బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం. పెన్షన్ల విషయంలో కుట్రను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉండి అవ్వాతాతల కష్టాలను ఏనాడైనాపట్టించుకున్నాడా?. పెన్షన్లను ఇంటికే అందిస్తున్న ఘనత మీ బిడ్డది. చంద్రబాబు కుట్రలు చేస్తూనే నెపం మీ బిడ్డ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ మనపై ఆరోపణలు చేయడం కంటే దిగజారుడు తనం ఉందా?. చంద్రబాబు హయాంలో ఏనాడూ మంచి చేసిన చరిత్రలేదు. చంద్రబాబు ధ్యాస దోచుకోవడం, దోచుకోవడం పంచుకోవడం మీద కాబట్టే అక్కాచెల్లెమ్మలకు న్యాయం జరగలేదు. ఎవరి విశ్వసనీయత ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి. 2014లో చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలు.. చేసిన మోసం గుర్తున్నాయా?. ఇంటింటికి జాబ్ అన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తా అన్నారు. కనీసం ఒక్క రూపాయికూడా చంద్రబాబు ఇవ్వలేదు. ఇది మోసం కాదా?. వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా. మన బతుకులు బాగుపడాలన్నా. మన ఆస్పత్రులు, బడులు బాగుపడాలన్నా. ప్రతీ ఒక్కరం ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు తగ్గేలేదు. సిద్ధమేనా?.. మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట, తాగేసిన టీ గ్లాస్ సింక్‌లో ఉండాలి. మీ చల్లని దీవెనలతో.. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను గెలిపించాలని కోరుకుంటున్నా ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. -
CM జగన్ కాన్వాయ్ పై పూల వర్షం...!
-
టీడీపీ నేతల ఓవర్ యాక్షన్
-
టంగుటూరుకు ప్రభాకర్‌రెడ్డి మృతదేహం
యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు గురువారం ఉదయం ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతదేహం చేరుకుంది. అతని మృతదేహాన్ని చూసి బంధువులు, స్నేహితులు శోక సముద్రంలో మునిగిపోయారు. పోలీసు లాంఛనాలతో ప్రభాకర్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీ మనోహర్, యాదగిరిగుట్ట సీఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది నివాళులర్పించారు. నిన్న కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
మరో ఎస్సై ఆత్మహత్య
► రివాల్వర్‌తో కాల్చుకున్న కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ►గతంలో రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు ప్రభాకర్‌రెడ్డి ►పోలీస్‌స్టేషన్ వద్ద బంధువులు, సన్నిహితుల ఆందోళన ►ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఎస్సై భార్య ఆరోపణ ►తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎన్టీవీ ఓబీ వ్యాన్ దహనం ►గజ్వేల్ ఏసీపీ బదిలీ.. విచారణాధికారిగా అదనపు డీజీపీ గోపీకృష్ణ గజ్వేల్: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మరో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే పోలీస్‌స్టేషన్‌లో పది నెలల కింద ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం మరువకముందే.. ఆయన స్థానంలో వచ్చిన ఎస్సై పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి (34) బుధవారం బలన్మరణానికి పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలోని తన క్వార్టర్‌లోనే కణతపై రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారుల వేధింపులే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు కారణమంటూ బంధువులు, సన్నిహితులు ఆందోళనకు దిగడంతో కుకునూర్‌పల్లి అట్టుడికింది. కానిస్టేబుల్‌గా చేసి.. ఎస్సై పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు. ఆయనకు ఏడాదిన్నర కిందే వివాహమైంది. భార్య రచన, ఐదు నెలల బాబు ఉన్నారు. ఆయనకు ఇద్దరు సోదరులు. వారిలో సంజీవరెడ్డి హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తుండగా.. భాస్కర్‌రెడ్డి టంగుటూరులో పాల కేంద్రం నడుపుతున్నారు. తొలుత కానిస్టేబుల్‌గా ఎంపికైన ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో కొన్నేళ్లు విధులు నిర్వర్తించారు. అనంతరం 2012లో ఎస్సైగా ఎంపికయ్యారు. మల్కాజిగిరి, శామీర్‌పేట, కౌడిపల్లి పోలీస్స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు. 2016 ఆగస్టులో కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. 15 రోజులకు అక్కడికి బదిలీ అయ్యారు. కొబ్బరినీళ్లు తెమ్మని చెప్పి.. నాలుగు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి భార్య రచన పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉంటున్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌లో రూల్‌కాల్ నిర్వహించి.. తిరిగి క్వార్టర్‌కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత గజ్వేల్‌లో ఉన్న కానిస్టేబుల్ మురళికి ఫోన్ చేసి తనకు కొబ్బరి నీళ్లు తీసుకుని రావాలని సూచించారు. మురళి ఉదయం 11 గంటల సమయంలో కొబ్బరినీళ్లు తీసుకుని ఎస్సై క్వార్టర్ వద్దకు వచ్చారు. గడియపెట్టి ఉండడంతో కొంతసేపు తలుపు తట్టారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీ నుంచి చూడగా.. రక్తపుమడుగులో పడి ఉన్న ఎస్సై కనిపించారు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపగా.. గజ్వేల్, సిద్దిపేట ఏసీపీలు గిరిధర్, నర్సింహారెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు. కొంతసేపటికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ వచ్చి సంఘటన వివరాలు సేకరించారు. బంధువులు, స్నేహితుల ఆందోళన ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య విషయం దావాన లంలా వ్యాపించడంతో ప్రభాకర్‌రెడ్డి తల్లి వెంకటమ్మ, బంధువులు, సన్నిహితులతో పాటు పెద్ద సంఖ్యలో జనం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని.. గతంలో రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాక కూడా పరిస్థితిలో మార్పు లేదని ఆగ్రహిస్తూ ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్ ఎదుట రాజీవ్ రహదారిపై బైఠాయించారు. వారికి మద్దతుగా టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ప్రభాకర్‌రెడ్డి మృతికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని, ఆయన సూసైడ్ నోట్ రాసి చనిపోతే దానిని అధికారులు మాయం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సూసైడ్ నోట్‌ను బయటపెట్టే వరకు ఆందోళన విరమించబోమంటూ భీష్మించారు. గజ్వేల్ ఏసీపీ, సిద్దిపేట సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనతో రాజీవ్ రహదారిపై కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. ఉన్నతాధికారుల వేధింపులే కారణం ‘‘ఉన్నతాధికా రుల వేధింపులే నా భర్త ఆత్మహత్యకు కారణం. పైఅధికా రులు టార్చర్ చేస్తు న్నారని, ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నానని కొన్ని రోజుల నుంచి నా భర్త చెబుతున్నాడు. గజ్వేల్ ఏసీపీ గిరిధర్ తరచూ ఇబ్బంది పెడుతున్నాడని కూడా చెప్పేవాడు. ములుగు పోలీస్‌స్టేష న్కు బదిలీపై వెళ్లే అవకాశం వచ్చిందని.. ఉన్నతాధికారులు కొద్దిరోజులు ఉండాలని చెప్పడంతో ఇక్కడ పనిచేస్తున్నానని చెప్పా డు. ఇప్పుడీ దారుణం జరిగిపోయింది..’’ – ఎస్సై ప్రభాకర్‌రెడ్డి భార్య రచన గజ్వేల్ ఏసీపీపై బదిలీ వేటు.. విచారణాధికారిగా అదనపు డీజీపీ గోపీకృష్ణ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనకు సంబంధించి గజ్వేల్ ఏసీపీ గిరిధర్‌పై వేటు పడింది. ఆయనను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో పాటు ఉన్నతాధికారుల వేధింపులు, శిరీష వ్యవహారం.. ఇలా అన్నింటిపై పూర్తి విచారణ జరిపేందుకు అదనపు డీజీపీ గోపికృష్ణను విచారణాధికారిగా నియమించారు. అయితే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులు కాకుండా ఇతర కారణాలు ఉంటే.. బదిలీ ఎందుకు చేశారన్న చర్చ జరుగుతోంది. ఇదే పోలీస్‌స్టేషన్ ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య సమయంలో అప్పటి సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌పై బదిలీ వేటు పడింది. అయితే రామకృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్లో డీఎస్పీ వేధింపులను స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గజ్వేల్ ఏసీపీ వేధింపులే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎస్సై ఆత్మహత్య విషయం తెలిసినా రెండు గంటల వరకు ఘటనా స్థలానికి వెళ్లకపోవడం వల్లే ఏసీపీపై బదిలీ వేటు పడేలా చేసిందని ఓ సీనియర్ ఐపీఎస్ అభిప్రాయపడ్డారు. ఎన్టీవీ ఓబీ వ్యాన్ దహనం ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఉన్నతాధికారుల వేధింపుల వల్ల చనిపోతే.. టీవీ చానళ్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్ ముందు ఉన్న ఎన్టీవీ ఓబీ వ్యాన్‌పై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. డీజిల్ ట్యాంకు పగలగొట్టి నిప్పంటించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఐజీ స్టీఫెన్ రవీంద్ర, అదనపు డీజీ గోపీకృష్ణ, జేసీ పద్మాకర్, గజ్వేల్, సిద్దిపేట ఆర్డీవోలు విజయేందర్‌రెడ్డి, ముత్యంరెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాత్రి 9.30 గంటల సమయంలో తీవ్ర ఉద్రిక్తత మధ్య ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని కుకునూర్‌పల్లి నుంచి సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. ప్రభాకర్‌రెడ్డి మృతికి గజ్వేల్ ఏసీపీ గిరిధర్ వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఎస్సై సోదరుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న వెల్లడించారు. -
పెళ్లి మొక్కు కోసం వెళ్లివస్తూ..
► రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ►మరో 8 మందికి గాయాలు టంగుటూరు (కొండపి) : తిరుపతి వెళ్లి పెళ్లి మొక్కు తీర్చుకుని తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం సమీపంలో ఐఓసీ పెట్రోలు బంకుల వద్ద మంగళవారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళ్తే... గుంటూరులోని కొత్తపేటకు చెందిన సాయిరామ్‌కు ఇటీవల నాగరాణితో వివాహమైంది. వీరి పెళ్లి మొక్కు తీర్చుకునేందుకు సాయిరామ్ సోదరుడు అయిన సాయిశంకర్ (35), అతని భార్య హనుమంతి, పిల్లలు తేజ, లక్ష్మీలహరి, తల్లిదండ్రులు రామస్వామి, అనూరాధ, బంధువు అంబటి దేవిలు నూతన దంపతులతో కలిసి కారులో తిరుపతి వెళ్లారు. మొక్కు తీర్చుకుని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తిరిగి గుంటూరు బయలుదేరారు. మంగళవారం వేకువజామున ఐఓసీ పెట్రోలు బంకుల వద్ద ఆగి ఉన్న పత్తి లోడు లారీని వెనుక నుంచి వీరి కారు ఢీకొట్టింది. దీంతో సాయిశంకర్‌తో పాటు డ్రైవర్ చెన్నబోయిన సుబ్బారావు(31) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారందరికీ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు పక్కన పసికందు లభ్యం
టంగుటూరు (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు శిశువును చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిశువును వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పొగాకు రైతు ఆత్మహత్య
టంగుటూరు (ప్రకాశం) : పొగాకుకు గిట్టుబాటు ధర లేక, అప్పుల భారం పెరిగి తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొందూరు పంచాయతీ పొదలవారిపాలెంలో శుక్రవారం ఉదయం జరిగింది. పొందూరుకు చెందిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు (40)కు మూడు ఎకరాల భూమితో పాటు, ఒక పొగాకు బ్యారన్ ఉంది. తన మూడు ఎకరాలతో పాటు 17 ఎకరాల పొలం, రెండు బ్యారన్లు కౌలుకు తీసుకుంటున్నాడు. గత మూడేళ్లుగా ఇదే పద్ధతిలో రెండు బ్యారన్ల పొగాకు సాగు చేస్తున్నాడు. పొగాకు దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక మూడేళ్లుగా నష్టాలు చవిచూస్తున్నాడు. ఏటా నష్టాలు పెరిగి అప్పుల భారం మోయలేని స్థితికి చేరింది. బ్యాంకు రుణం రూ.10 లక్షలు కాగా..వడ్డీ వ్యాపారుల దగ్గర మరో రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాదీ బ్యారన్‌కు రూ.3 లక్షలు నష్టం తప్పేలా లేదు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై ఆరు నెలలు దాటినా ఇప్పటికీ తన పొగాకు దిగుబడిలో కేవలం 60 శాతమే అమ్ముకోగలిగాడు. ఇంకా 40 శాతం పొగాకు నిల్వలు ఇంట్లోనే మూలుగుతున్నాయి. ఈ ఏడాదైనా అప్పులు తీర్చలగనన్న నమ్మకం పోయింది. అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఏం చేయలో దిక్కుతోచక కృష్ణారావు తీవ్ర ఆందోళన చెందాడు. ఇంతకాలం గుట్టుగా ఉన్న పరువు బజారున పడుతుందేమోనని భయపడ్డాడు. ఆ ఆలోచనలతోనే చివరకు తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి నేరుగా బాత్రూంలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. బాత్రూంకు వెళ్లిన భర్త బయటకు రాకపోవడంతో భార్య శారద వెళ్లి చూడగా బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న కృష్ణారావును స్థానికుల సాయంతో బయటకు తెచ్చారు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా..అప్పటికే అతను మృతిచెందాడు. కృష్ణారావుకు భార్యతో పాటు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా ఆత్మహత్య చేసుకున్న కృష్ణారావు కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని పొగాకు బోర్డు (ఆర్ఎం ) కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. మృతదేహంతో కార్యాలయ ఆవరణలోనే నిరసనకు దిగారు. కుటుంబాన్ని ఆదుకుంటామన్న ఆర్ఎం హామీతో ఆందోళన విరమించారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
టంగుటూరు (ప్రకాశం జిల్లా) : మితిమీరిన వేగంతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కేంద్రంలోని టోల్‌ఫ్లాజా వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. నాయుడుపేటకు చెందిన కొంత మంది మూడు టాటా మ్యాజిక్ వాహనాల్లో పుష్కరాలకు బయలుదేరారు. అయితే రెండు వాహనాలు వెళ్లిపోగా, మూడవ వాహనం టంగుటూరు టోల్‌ఫ్లాజా ఫ్లై ఓవర్ దగ్గర ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. డ్రైవర్ మహ్మద్ రాజా అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రొయ్యో.. మొర్రో
టంగుటూరు: వ్యాపారుల మాయాజాలంలో ఆక్వా రైతులు నలిగిపోతున్నారు. వ్యాపారులు కూటమికట్టి ధరలను నియంత్రిస్తున్నారు. మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారు. వ్యాపారులు ఏడాదికి ఒకసారి ధరలపై సీలింగ్ పెట్టి రైతులను దోచుకుంటున్నారు. ఇది ధరల సీజన్: అక్టోబర్, నవంబర్ నుంచి జనవరి వరకూ రొయ్యలకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంటుంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, ముస్లిం పండుగలు ఇదే రోజుల్లో ఉండటంతో విదేశాలకు కంటైనర్ల కొద్దీ రొయ్యలు ఎగుమతవుతాయి. ఎగుమతి చేసేందుకు, కొత్తగా స్టాకు చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడి రొయ్యలు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల్లో పోటీతో సీలింగ్‌కు బ్రేక్ పడుతుంది. ఈ సీజన్లో రొయ్యల అమ్మకానికి వచ్చిన రైతులకు లాభాలపంట పండుతుంది. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా ధరలున్నాయి. రెండు నెలల క్రితం వరకూ 30 కౌంట్ రూ.650 ఉన్న ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 30 కౌంట్ ప్రస్తుతం రూ.500 ఉండగా, 40 కౌంట్ రూ.400, 50 కౌంట్ రూ.360 ఉంది. ఈ ధరలూ ఒకప్పుడు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాయి. పెరిగిన సీడ్, ఫీడ్, విద్యుత్, ఇతర ఖర్చులతో ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు నష్టాలు మిగులుస్తున్నాయి. 30 కౌంట్ రొయ్యలు పెంచాలంటే రైతుకు రూ.500 వరకు, 40 కౌంట్ పెంచేందుకు రూ.400 వరకు ఖర్చవుతుంది. సగానికి పడిపోయిన రొయ్యల సర్వేయల్ (చెరువులో బతికిన రొయ్యలు): సీడ్లో లోపం కారణంగా చెరువులో వేసిన రొయ్యల సీడ్లో సగం కూడా బతకడం లేదు. 40 నుంచి 50 శాతం లోపే రొయ్యల సీడ్ బతికి ఉంటుంది. హేచరీల యాజమాన్యాలు లాభాపేక్షతో రైతులను మోసం చేస్తున్నారు. బ్లూడర్స్(తల్లిరొయ్య)సేకరణలో లోపంతో నాణ్యమైన సీడ్ రావడం లేదు. సీడ్లో నాణ్యత లేదని తెలిసీ రైతులకు అంటగడుతున్నారు. ఒకప్పుడు కేవలం 30 పైసలున్న సీడ్ ధరను నేడు 60 నుంచి 80 పైసలకు పెంచారు. వెనామిలో హెక్టారు చెరువుకు 2 నుంచి 5 లక్షల వరకూ సీడ్ పోస్తున్నారు. రైతులు సీడ్‌కే లక్షలో వ్యయం చేస్తున్నారు. వాతావరణంలో మార్పు, సీడ్ లోపం కారణంగా నెల రోజులకే కొన్ని చోట్ల చెరువులు దెబ్బతింటున్నాయి. దీంతో హెక్టారు చెరువులో రూ.7 నుంచి రూ.10 లక్షల వరకూ నష్టపోతున్నారు. యాంటీ బయాటిక్స్ వల్లే ధరలు పతనం: రైతులు యాంటీబయాటిక్స్ వాడకం వలన అంతర్జాతీయంగా మన రొయ్యలకు గిరాకీ తగ్గిందని, దీంతో రొయ్యల ధరలు పతనమవుతున్నాయని వ్యాపారి అల్లూరి వెంకట సత్యనారాయణరాజు అన్నారు. ఇతర దేశాలకు వెళ్లిన కొన్ని రొయ్యల లోడు కంటైనర్లు యాంటీ బయాటిక్స్ అవశేషాలున్నాయన్న కారణంగా తిరస్కరణకు గురై వెనక్కి వచ్చాయని ఆయన అన్నారు. రైతులు యాంటీ బయాటిక్స్ స్వయం నియంత్రణ ద్వారా సాధించాలని ఆయన సూచించారు. -
టంగుటూరులో టెన్షన్.. టెన్షన్
‘టంగుటూరులోని నాగేశ్వర స్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను ఈ నెల 24వ తేదీలోగా తొలగించండి’ ్చ ఓ మహిళ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై దేవాదాయశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం టంగుటూరులోని పోతుల వెస్ట్ కాలనీలో 1,250 మంది ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పొందారు. వీరిలో 600 మంది అనర్హులని అధికారులు ఆలస్యంగానైనా గుర్తించారు. 600 మందికి నోటీసులిచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. టంగుటూరులో మెయిన్ రోడ్‌పై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆర్ఓబీ నిర్మాణం వల్ల పంచాయతీ కాంప్లెక్స్‌లతో పాటు పలువురి ఇళ్లు, ప్రైవేట్ వ్యాపార సముదాయాలు తొలగించనున్నారు. టంగుటూరులో తమకు చెందిన 10 ఎకరాల ఈనాం భూములను ఆక్రమించుకున్నారని కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన కొందరు హైకోర్టులో పోరాడుతున్నారు. ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద భవనాలు, పొగాకు కంపెనీలు, సినిమా హాల్ ఈ భూమిలోనే ఉన్నాయి. దీనిపై ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు. ఈ నాలుగు అంశాలు టంగుటూరులో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఏ ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినా వీటి గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతుందడగా.. సంఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కుటుంబాలు భయంతో వణికిపోతున్నాయి. - న్యూస్‌లైన్, టంగుటూరు రాజీవ్‌నగర్ వాసుల్లో కలవరం టంగుటూరులో 1977లో ఓ ప్రదేశంలో పేదల గుడిసెలు వెలిశాయి. కాలక్రమంలో గుడిసెల స్థానంలో పక్కా భవనాలు నిర్మించారు. కొందరు వ్యక్తులు అక్కడ స్థలాలను విక్రయించి వెళ్లిపోయారు. కొనుగోలు చేసిన వారు భవనాలు నిర్మించుకున్నారు. కాలనీకి రాజీవ్‌నగర్ అని పేరుపెట్టారు. ఇక్కడ 100 పక్కా గృహాలున్నాయి. అధికారులు ప్రభుత్వ నిధులతో మౌలిక వసతులు కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఓ మహిళ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)తో అసలు విషయం బయటపడింది. ఆ భూములు నాగేశ్వరస్వామి దేవస్థానానికి చెందినవని, మొత్తం 6 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని నిరూపితమైంది. పిల్‌పై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ‘దేవుడి మాన్యంలో అనుమతి లేకుండా నిర్మించుకున్న గృహాలను ఈ నెల 24వ తేదీలోగా తొలగించండి’ అని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలవరపడ్డ కాలనీ వాసులు స్టే కోసం సుప్రీం కోర్టు మెట్లెక్కారు. స్టే కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. దేవాదాయ శాఖ మాత్రం రాజీవ్‌నగర్‌ను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. పోతుల వెస్ట్ కాలనీలో అనర్హులకు నోటీసులు సిద్ధం టంగుటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అధికారులు 50 ఎకరాల దేవాదాయ భూమిని సేకరించారు. 2009లో పోతులవెస్ట్ కాలనీ పేరుతో సుమారు 1,250 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో ఇప్పటికే చాలా మంది పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం పలు ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ స్థలాల్లో అనర్హులకు పట్టాలు కట్టబెట్టారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గత ఏడాది మార్చిలో విచారణకు ఆదేశించించింది. విచారణ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. స్థలాలు పొందిన వారిలో 600 మందిని అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారికి నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. నోటీసులిస్తే ఏం సమాధానం చెప్పాలో అంతుబట్టక పలువురు లబ్ధిదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న ఆర్ఓబీ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ).. ఈ మాట టంగుటూరు గ్రామస్తుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. టంగుటూరు మెయిన్‌రోడ్డులో ఆర్ఓబీ నిర్మిస్తుండటమే ఇందుకు కారణం. పంచాయతీ కార్యాలయం నుంచి రైల్వే గేటు మీదుగా కొండపి రోడ్డులో కామనివారికుంట వరకు ఉన్న మెయిన్‌రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు పంచాయతీ మార్కెట్ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్ మార్కెట్ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థలు, ఇళ్లు.. ఇలా ఆదాయాన్ని సమకూర్చే వనరులన్నీ మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. ఆర్ఓబీ నిర్మాణంతో ఇవన్నీ కూలే అవకాశముంది. నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని రైల్వే ఉన్నతాధికారులను కలిసి టంగుటూరు వాసులు విన్నవించారు. సమస్యను ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జనం మాటలు వారు వినకపోగా.. ఆర్ఓబీ నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మార్గంలో మట్టి శాంపిల్స్ కూడా సేకరించడంతో గ్రామస్తుల్లో ఆందోళన ఎక్కువైంది. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘కుమ్మరి ఈనాం భూములు మావే’ టంగుటూరులో సుమారు పది ఎకరాల కుమ్మరి ఈనాం భూములకు అసలైన వారసులం తామేనంటూ కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఐదేళ్ల క్రితం హైకోర్టులో కేసు వేశారు. తమ పూర్వీకుల పేరున ఉన్న కుమ్మరి ఈనాం భూములను తమకు స్వాధీనం చేయాలని వారు పోరాడుతున్నారు. అత్యంత ఖరీదైన ఈ 10 ఎకరాల భూములు గ్రామంలో ఆర్థికంగా బలవంతులైన వారి చేతిలో ఉన్నాయి. ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద భవనాలు, పొగాకు కంపెనీలు, సినిమా హాల్‌ను ఈ భూముల్లో నిర్మించారు. ఈ విషయంపైనా గ్రామంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.