ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుందని గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి చేసే వేర్వేరు ప్లాట్‌ఫాంలపై చేసే పోస్టులను విశ్లేషించి, ఎవరిపై ఏ టాపిక్‌పై ఎంత సమయం గడుపుతున్నారన్న దాన్ని బట్టి.. గూగుల్ ట్రెండ్స్ ఫలితాలు ఇస్తుంది. ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టాప్‌లో ఉండగా.. దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేకపోవడం గమనార్హం.
గూగుల్ ట్రెండ్స్‌కు సంబంధించి రెండు రకాల రిపోర్టులు పరిశీలిద్దాం. ఒకటి 90 రోజులకు సంబంధించి, మరొకటి గత 30 రోజులకు సంబంధించి. ముందుగా గడిచిన 90 రోజుల ట్రెండ్స్ చూస్తే..
యావరేజ్ ఇంటరెస్ట్ ఓవర్ టైం
►సీఎం వైఎస్ జగన్- 39 నిమిషాలు
►చంద్రబాబు నాయుడు- 12 నిమిషాలు
(ఒక్కో యూజర్ ఆయా వ్యక్తుల మీద ఒక రోజు వెచ్చించిన సమయం)
గడచిన 90 రోజుల్లో సీఎం జగన్‌కు దగ్గరగా చంద్రబాబు వచ్చింది ఒకే ఒక సారి. అది కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మాత్రమే. ఆ కేసులో చంద్రబాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. తనపై కేసు కొట్టేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పైగా అరెస్ట్ సబబేనని తేల్చిచెప్పింది కూడా.
ఇక గడచిన 30 రోజులు అంటే ఎన్నికల వేడి బాగా పెరిగిన తర్వాత గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే..
యావరేజ్ ఇంటరెస్ట్ ఓవర్ టైం
►సీఎం వైఎస్ జగన్- 45 నిమిషాలు
►చంద్రబాబు నాయుడు- 16 నిమిషాలు
తెలుగు భాషలో ఉన్న మీడియాలో సింహాభాగం చంద్రబాబు, ఆయన మనుష్యుల చేతిలో ఉంది. ఇన్నాళ్లు చంద్రబాబు, ఎల్లోమీడియా ఏది చెప్పినా అది నిజమని నమ్మేవారు. ఇప్పుడు జనం ముందు సోషల్ మీడియా పుణ్యమా అని అసలు నిజాలను నెటిజన్లు మాత్రం బయటకు తీస్తూనే ఉన్నారు. అందుకే ఎన్నికల వేళ చంద్రబాబును మరింత దూరం పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment