సల్లాపాల్ని వీడియో తీసుకున్న దంపతులు | couple make video while doing private work | Sakshi
Sakshi News home page

సల్లాపాల్ని వీడియో తీసుకున్న దంపతులు

Published Sat, May 28 2016 9:03 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

సల్లాపాల్ని వీడియో తీసుకున్న దంపతులు - Sakshi

సల్లాపాల్ని వీడియో తీసుకున్న దంపతులు

రాజానగరం : సరదాగా తమ సరాగాలను సెల్ ఫోన్‌లో వీడియో తీసుకున్న ఒక జంట ఆ వీడియో మార్కెట్‌లో దర్శనమివ్వడంతో సిగ్గుతో చితికిపోయింది. కాగా అందుకు కారకులైన ముగ్గురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరుకు చెందిన ఒక వ్యక్తికి నల్లమందు సందులో బంగారు కొట్టు ఉంది. అతని వద్ద గాడాలకు చెందిన కర్రి బ్రహ్మాజీ పని చేస్తుండేవాడు.
 
 బంగారు కొట్టు యజమాని తన భార్యతో సరాగాలను పదిలం చేసుకోవాలన్న సరదా సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. ఈ విషయం పసిగట్టిన బ్రహ్మాజీ రెండు నెలల క్రితం యజమాని ఇంటికి వెళ్లి ఆ సెల్ ఫోన్‌ని కాజేశాడు. కాగా ఇటీవల ఆ ఫోన్‌లోని వారి సరాగాల దృశ్యాలు మార్కెట్టో కొన్నిచోట్ల ప్రత్యక్షం కావడంతో సిగ్గుతో కుంగిపోయిన ఆ దంపతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
  విచారణ జరిపిన పోలీసులు బ్రహ్మజీతోపాటు అతని స్నేహితులు సురేష్, కిట్టులను బాధ్యులుగా గుర్తించారు. సెల్ ఫోన్‌ని అపహరించి, వాటిలో దృశ్యాలను తామే బయటపెట్టామంటూ వారు అంగీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై షరీప్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement